మంత్రి వర్గ విస్తరణ తర్వాత.. శాఖల కేటాయింపుల్లో సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారనే విషయం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ కేబినెట్‌లో దూకుడి వ్యవహరించే అచ్చెన్నాయుడుని కార్మిక శాఖ నుంచి రవాణా శాఖకు మార్చడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన దూకుడుకు కళ్లెం వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీవర్గాల్లో చర్చ మొదలైంది. స్వయం ప్రతిపత్తి కల ఆర్టీసీలో బతిమిలాడి పనిచేయించు కోవాలే తప్ప శాసించి పనిచేయించుకునే పరిస్థితి లేదు. దూకుడు స్వభావంతో అధికార […]
Tag: chandra babu
చంద్రబాబు నిర్ణయాలే బొత్సకు వరం!
విజయనగరం, శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగల నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు తీసుకున్న ఒక నిర్ణయంతో ఆయన స్ట్రాంగ్ అవుతున్నారు. మంత్రి వర్గ విస్తరణలో సీఎం పాటించిన కొన్ని సమీకరణాలు.. బొత్స సత్యనారాయణకు వరాలుగా మారుతున్నాయట. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయట. చంద్రబాబు నిర్ణయాలతో 2014 ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్.. స్వేచ్ఛ ఇవ్వకవపోవడంతో బొత్స […]
ఆనం, శివప్రసాద్ యూ టర్న్ తీసుకున్నట్టేనా
మంత్రి వర్గ విస్తరణ తర్వాత సీఎం చంద్రబాబును టార్గెట్ చేసిన నేతలు యూ టర్న్ తీసుకున్నారు. కానీ అక్కడక్కడా అసంతృప్తులు మాత్రం ఇంకా మిగిలిపోయారు. వీళ్లంతా ఇక పార్టీని వీడటం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో వీరందరినీ బుజ్జగించేందుకు స్వయంగా అధినేత రంగంలోకి దిగారు. రెండేళ్లలో ఎన్నికలు ఉన్న తరుణంలో ఇలాంటి అసంతృప్తుల ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించి అలక తీరుస్తున్నారు. ఎంపీ శివప్రసాద్, ఆనం వివేకా నందరెడ్డి.. ఇలా అందరినీ తన దారికి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతానికి […]
ఇద్దరు చంద్రులకు మోదీ మళ్లీ షాక్?
సంచలన నిర్ణయాలతో దేశ గతినే మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాని మోదీ! ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. కానీ వాటిని కనిపించకుండా చేస్తున్నారు ఇద్దరు చంద్రులు! ఇప్పుడు వీరికి మరో పిడుగులాంటి వార్త! రాజకీయంగా పార్టీల అస్థిత్వంపై దెబ్బకొట్టే నిర్ణయాన్ని మోదీ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను బుజ్జగించేందుకు ఇప్పటివరకూ ప్రభుత్వాలు ఎమ్మెల్సీ ద్వారా కొందరిని మండలికి పంపుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దుచేయాలని మోదీ నిర్ణయించుకున్నారట. అంతేగాక దీనిపై […]
ఆ విషయంలో చంద్రబాబు లెక్క తప్పిందా?
బహిరంగ సభల్లో ప్రజలతో మాట్లాడించడం.. వారిని ప్రశ్నలు అడగటం చేస్తూ ఉంటారు సీఎం చంద్రబాబు! వారు టీడీపీ పథకాల గురించి, తన గురించి ఏం చెబుతారోనని తెలుసుకునేందుకు ఇలాంటివన్నీ ప్రత్యేకంగా రూపొందిస్తుంటారు. ఇటీవల పశ్చిమగోదావరిలో నిర్వహించిన సభలోనూ ఇలాగే గ్రామస్తులతో మాట్లాడించిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజల్లో టీడీపీపై సంతృప్త స్థాయిని పెంచాలని, ఎప్పటికప్పుడు నేతలకు చెబుతూ ఉంటారు. 80 శాతం సంతృప్తిగా ఉన్నారని. మిగిలిన వారిని కూడా ఈ జాబితాలో చేర్చాలని చెబుతూ ఉంటారు. […]
బీజేపీని వదిలించుకునే పనిలో టీటీడీపీ
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే సూత్రాన్ని టీటీడీపీ వంటబట్టించుకుంది. గత ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో జత కట్టినా.. ప్రస్తుతం మిత్ర బంధం తెగిపోయేందుకు సిద్ధంగా ఉంది. దీంతో అస్థిత్వం కోసం జరిగే పోరాటంలో కొత్త మిత్రుల వేటలో టీటీడీపీ నేతలు వెదుకులాట ప్రారంభించారు. టీడీపీకి శత్రువయిన కాంగ్రెస్‌తో జతకట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని పరోక్షంగా అధినేత చంద్రబాబు ముందు ఉంచడం ఇప్పుడు […]
నంద్యాల టెన్షన్ బాబుకు తీరినట్టేనా
నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు పోటీచేయాలనే అంశంపై టీడీపీలో కొంతకాలంగా సందిగ్ధం నెలకొంది. తమ వర్గానికి కేటాయించాలని మంత్రి అఖిలప్రియ వర్గం.. తమ వర్గానికే కేటాయించాలని శిల్పా వర్గం పట్టుబట్టడంతో.. ఇప్పటివరకూ కొంత అనిశ్చితి నెలకొంది. అంతేగాక ఈ విషయంలో అధినేత చంద్రబాబు కూడా టెన్షన్ పడ్డారు. అయితే ఇప్పుడు ఆ టెన్షన్ తీరిపోయింది. శిల్పా, భూమా వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ వర్గాలను ఒకే […]
సైకిల్ గుర్తు వద్దు.. కమలంపై పోటీ చేస్తాం
బీజేపీ-టీడీపీ పొత్తు రెండు రాష్ట్రాల్లో వింతగా ఉంది. ఒకచోట టీడీపీ బలంగా ఉంటే.. మరోచోట బీజేపీ బలాన్ని పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకచోట సొంతంగా ఎదిగేందుకు బీజేపీ ఆరాటపడుతుంటే.. మరోచోట అస్థిత్వం కోసం టీడీపీ పోరాడుతోంది. కలహాలు ఉన్నా ఏదోలా ఇన్నాళ్లూ జోడీ బండిని లాక్కుంటూ వస్తున్నారు. ఏపీలో పరిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణలో మాత్రం వింతైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీటీడీపీ నాయకులు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారట. పార్టీని విలీనం చేయకుండానే.. బీజేపీ జెండాతో […]
మోదీ నిర్ణయానికి చంద్రబాబు సై.. లోకేష్ నై
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, పంచాయతీ,ఐటీ శాఖ మంత్రి లోకేశ్.. రోజుకో సంచలన వ్యాఖ్యతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే పలు సమావేశాల్లో తడబడుతూ వ్యాఖ్యలు చేసి తండ్రికి తలనొప్పులు తీసుకొచ్చిన ఆయన.. మరోసారి చంద్రబాబుకు పెద్ద ఝలక్ ఇచ్చారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అదే సమయంలో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చెబుతుంటే.. ఈ రెండిటినీ లోకేష్ తేలికగా కొట్టిపారేశారు. అసలు ఏకకాలంలో అన్నిరాష్ట్రాలకూ ఎన్నికలు నిర్వహించడం జరిగే పనికాదని కొట్టిపారేశారు!! […]