అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. దఢక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ..ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే జాన్వీ.. ఇటీవల బీచ్ ఒడ్డున దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో జాన్వీ సూపర్ హాట్‌గా కనిపిస్తుంది. అయితే ఈ ఫొటోలు చూసిన పలువురు నెటిజన్లు జాన్వీపై విమర్శలు వ్యక్తం చేశారు. కరోనాతో దేశం […]
Tag: bollywood news
కరోనా దెబ్బకు తోటల్లోనే ఉంటున్న ప్రముఖ హీరోయిన్!
దేశ ప్రజలను మళ్లీ కరోనా వైరస్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతున్న కరోనా ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. ఇక కరోనా దెబ్బకు భయపడిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జుహీ చావ్లా ముంబైలోని వాడా ఏరియాలో ఉన్న తన తోటల్లోనే నివాసం ఉంటోంది. అక్కడ ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడి నుంచే […]
పవన్ హీరోయిన్ ఆవేదన..2 రోజులుగా నరకమంటూ పోస్ట్!
కరోనా వైరస్ మళ్లీ ఎక్కడికక్కడ కోరలు చాచిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. సెకెండ్ వేవ్‌లో మరింత వేగంగా విజృంభిస్తున్న కరోనా కాటుకు ఇప్పటికే ఎందరో బలైపోయారు. ఇలాంటి విపత్కర సమయంలో అనవసరంగా ఇల్లు దాటి ఇబ్బందులకు గురి కావొద్దంటొంది బాలీవుడ్ హీరోయిన్ కృతి కర్బందా. తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టింది. గత రెండు రోజులుగా నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో నరకం అనుభవించాం. మీకు అనుభవమయ్యేవరకూ […]
మరోసారి ఇలియానాను ఆదుకునేందుకు ఫిక్సైన స్టార్ హీరో?
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఈ బ్యూటీ టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకుని బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ ఒకటి రెండు హిట్లు అందుకున్న ఇలియానాకు ఆ తర్వాత ఆఫర్లు కరువయ్యాయి. దాంతో ఇలియానా కెరియర్ డైలమాలో పడింది. అలాంటి సమయంలో బాద్‌షాహో సినిమాలో ఛాన్స్ ఇచ్చి ఇలియానాను ఆదుకున్నారు స్టార్ హీరో అజయ్ దేవగన్. ఆ తర్వాత […]
ప్రభాస్‌తో జతకట్టబోతున్న మరో బాలీవుడ్ భామ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ షూటింగ్‌ను చివరి దశకు తీసుకొచ్చిన ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. వీటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నాడు. అయితే ఈ చిత్రాలు ఇంకా విడుదల కాకముందే.. మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. […]
ఆ స్టార్ హీరోయిన్ కోసం గోవాకు విజయ్ సేతుపతి?!
విజయ్ సేతుపతి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక కేవలం హీరోగానే కాకుండా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఇక ఇటీవలె విడుదలైన ఉప్పెన సినిమాలో విలన్‌గా అద్భుతమైన నటను కనబరిచి.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. విజయ్ సేతుపతి నటనలో సహజత్వం కారణంగా.. […]
రష్మిక జోరు..ముచ్చటగా మూడో సినిమాకు గ్రీన్ సిగ్నెల్!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళ్ మరియు హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ అమ్మడు జోరుకు బ్రేకు వేయలేకపోతున్నారు. ప్రస్తుతం సిద్దార్థ్ మల్హోత్రతో కలిసి `మిషన్ మజ్ను` సినిమాలో నటిస్తోంది రష్మిక. బాలీవుడ్‌లో ఈ బ్యూటీకి ఇదే మొదటి సినిమా. ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే.. బాలీవుడ్ మెగాస్టార్ […]
అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన సోనూసూద్!
కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌లో ఎంత వేగంగా విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంటికి కనిపించుకు ప్రజలను, ప్రభుత్వాలను అల్లాడిస్తున్న కరోనా.. ఇప్పటికే లక్షల మందిని బలితీసుకుంది. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడి కారులు ఇలా అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల నటుడు, సమాజ సేవకుడు సోనూ సూద్‌కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. దాంతో అభిమానులు సోనూ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఎంతగానో కోరుకున్నారు. అయితే అభిమానులు కోరుకున్నట్టుగానే జరిగింది. […]
కరోనా కల్లోలం..ప్రముఖ సంగీత దర్శకుడు మృతి!
ఎక్కడో చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచదేశాలకు పాకేసి అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మునపటితో పోలిస్తే ప్రస్తుతం మరింత వేగంగా కరోనా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ఎందరో కరోనా బారిన పడుతుండగా.. కొందరు ప్రాణాలను ఊడా కోల్పోతున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ కరోనాతో మృతి చెందారు. ఈయన వయసు 66 సంవత్సరాలు. ఇటీవల శ్రావణ్‌కు కరోనా సోకగా.. ముంబైలోని ఎల్ఎల్ రహేజా ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటున్నప్పటికీ.. […]