లాక్‌డౌన్‌ను అలా యూజ్ చేసుకుంటున్న ర‌ష్మిక‌!

అతి త‌క్కువ స‌మ‌యంలోనే ద‌క్షిణాదిలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ర‌ష్మిక మంద‌న్నా.. త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా పూర్తి కాక‌ముందే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రాధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న‌ గుడ్ బై చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే మ‌రో రెండు ప్రాజెక్ట్స్ కూడా సైన్ చేసిన‌ట్టు టాక్‌. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్స్ బంద్ అయ్యాయి. దీంతో […]

కొత్త వ్యాపారంలోకి దిగుతున్న ఇలియానా?!

ఇలియానా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేవ‌దాసు సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈ భామ‌.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడింది. ఇక తెలుగులోనే కాకుండా త‌మిళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లోనూ న‌టించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్ర‌స్తుతం ఈ గోవా బ్యూటీ క్రేజ్ బాగా త‌గ్గిపోయింది. బాలీవుడ్ సహా దక్షిణాది లోనూ మరోసారి సత్తా చాటాలని ప్ర‌యత్నిస్తున్నా.. హీరోలు ఈమెవైపే చూడ‌టం లేదు. ఎలాగూ […]

ఆగిపోయిన విజ‌య్ సేతుప‌తి బాలీవుడ్ ప్రాజెక్ట్‌..కార‌ణం అదే!

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ప్ర‌స్తుతం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈయ‌న చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మేరీ క్రిస్మస్ సినిమా ఒక‌టి. కత్రినా కైఫ్ ప్రధాన పాత్రధారిగా అంధదూన్ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయింది. వాస్త‌వానికి […]

`ఆదిపురుష్` కోసం రంగంలోకి మ‌రో బాలీవుడ్ న‌టుడు!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా, స‌న్నీ సింగ్ ల‌క్ష్మ‌ణుడిగా న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం మ‌రో బాలీవుడ్ న‌టుడిని రంగంలోకి […]

బ‌తికే ఉన్నా..మ‌ర‌ణ వార్త‌ల‌పై స్పందించిన ప్ర‌ముఖ‌ న‌టుడు!

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు పరేష్ రావల్ మృతి చెందిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. శుక్ర‌వారం ఉదయం 7 గంటలకు ఆయన కన్నుమూశారని వార్తలు వైర‌ల్ అయ్యాయి. దీంతో నెటిజ‌న్లు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కామెంట్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశారు. అయితే ఈ వార్త ప‌రేష్ రావ‌ల్ చెంత‌కు చేర‌డంతో.. ఆయ‌న నవ్వుకోవడమే కాకుండా ట్విట్టర్ వేదికగా చమత్కారంగా రియాక్ట్ అయ్యారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించాలి.. నేను బ‌తికే […]

నెగెటివ్ టాక్‌తోనే రూ.100 కోట్లు రాబ‌ట్టిన `రాధే`?

ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం రాధే. ఈ చిత్రంలోనూ స‌ల్మాన్‌కు జోడీగా దిశా పటానీ న‌టించింది. ఈ చిత్రాన్ని భారీ అంచ‌నాల న‌డుము ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ ప్లెక్స్ లో మే 13న విడుద‌ల చేశారు. అయితే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం స‌ల్మాన్ అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచింది. రొటిన్ మాస్ మసాలా రివేంజ్ స్టోరీని సల్మాన్ ఖాన్‌తో ప్రభుదేవా తెరకెక్కించాడని నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు మండి […]

బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన రెజీనా?

శివ మనసులో శృతి సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన రెజీనా కాసాండ్రా.. కొత్త జంట సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని హిట్ల‌ను కూడా ఖాతాలో వేసుకుంది. కానీ, ప్ర‌స్తుతం రెజీనా కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. వ‌ర‌స ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న రెజీనాకు పెద్ద‌గా అవ‌కాశాలు కూడా రావ‌డం లేదు. దీంతో హీరోయిన్‌గా కాకుండా విల‌న్‌గా కూడా ప‌లు చేత్రాలు చేసింది. అయిన‌ప్ప‌టికీ.. ఈ అమ్మ‌డు గ్రాఫ్ పెర‌గ‌లేదు. రెజీనా ప్ర‌స్తుతం తెలుగులో నేనేనా అనే […]

కోవిడ్‌పై పోరు..భారీ విరాళం ప్ర‌క‌టించిన‌ అమితాబ్‌!

సెకెండ్ వేవ్‌లో విరుచుకు ప‌డుతున్న క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ ప్రజ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి క‌నుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు ల‌క్ష‌ల సంఖ్య పాజిటివ్ కేసులు, వేల సంఖ్య మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. స‌రైన స‌దుపాయాలు లేకే చాలా మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌..ఢిల్లీలోని రాకబ్ గంజ్‌ ప్రాంతంలోని గురుద్వారా […]

క‌రోనా బారిన ప‌డ్డ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో దేశ ప్ర‌జ‌ల‌ను ఏ స్థాయిలో అత‌లా కుత‌లం చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే రోజు రోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. సామాన్య ప్రజలు మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా క‌రోనా బారిన ప‌డుతూ నానా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌, కాంట్రవర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ కు కూడా కరోనా సోకింది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌నే […]