బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. బాలకృష్ణ వాహనంలో హిందూపురం నుంచి బెంగుళూరు వెళ్తుండగా లారీ ఓవర్‌టేక్ చేయబోయినపుడు పశువు అడ్డు రావడంతో డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం కర్ణాటకలోని బాగేపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. అనంతరం బాలయ్య మరో వాహనంలో బెంగుళూరు వెళ్లిపోయారు.
Tag: Balakrishna
కృష్ణవంశీ ‘రైతు’ వెనుక కథ
బాలకృష్ణతో కృష్ణవంశీ ‘రైతు’ అనే సినిమా చేయనున్నాడు. ఈ టైటిల్ ఇదివరకు దర్శకుడు తేజ చేతిలో ఉండేది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఈ టైటిల్‌తో సినిమా చేస్తాననేవాడు తేజ. తెలుగులో పంచెకట్టుకి గ్లామర్ తెచ్చిన హీరో ఎవరంటే తడుముకోకుండా బాలకృష్ణ అని చెప్పవచ్చు. నందమూరి హీరోలలో ఇప్పటిదాకా కృష్ణవంశీతో సినిమా చేసింది ఎన్టీఆర్ మాత్రమే. బాలకృష్ణతో చెయ్యాలని రెండేళ్ళ క్రితమే కృష్ణవంశీ అనుకున్నాడు. బాలయ్య వందవ చిత్రం కూడా కృష్ణవంశీ చేతుల మీదుగానే ఉంటుందని అనుకున్నారు. కానీ […]
బాలయ్య 101:”రైతు” కన్ఫామ్డ్ గా
నందమూరి నటసింహం బాలకృష్ణ 101 వ సినిమా ప్రకటన వెలువడింది.ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 100 వ సినిమాగా గమ్యం,వేదం,కృష్ణం వందే జగద్గురుమ్,కంచె వంటి ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు క్రిష్ తో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్ లో బిజీ గా వున్నారు బాలకృష్ణ.ఈ మధ్యనే క్రిష్ నిశ్చితార్థ వేడుకకి కూడా హాజరై వాడు వరులను ఆశీర్వదించారు. కాగా హిందూపురం ఎమ్మెల్కేగా కొనసాగుతున్న బాలకృష్ణ అక్కడి రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీలో భాగంగా తన 101 వ […]
క్రిష్ నిశ్చితార్థం వేడుకలో బాలయ్య
మొత్తానికి క్రిష్ ఓ ఇంటివాడు కావడానికి మొదటి అడుగు వేసాడు.సందేశాత్మక సినిమాలతో కమర్షియల్ విజయాలు సాధిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్,కేర్ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న రమ్య ల నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. వీరిద్దరి పెళ్లి గురించి ఎప్పటినుండో వార్తలు వినిపిస్తున్నా ఎప్పటికప్పుడు అదిగో పెళ్లి ఇదిగో నిశ్చితార్థం అంటూ దోబూచులాడినా ఈ జంట పెళ్లి ఘట్టం ఎట్టకేలకు పట్టాలెక్కింది.ఈ వేడుకకి ముఖ్య అతిధిగా బాలకృష్ణ హాజరయ్యారు.బాలకృష్ణతో కృష్ […]
జార్జియాలో ‘శాతకర్ణి’ పోరాటం!
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టైటిలే చాలా గంభీరంగా ఉంది. ఇక హీరో బాలయ్య లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. ఇటీవలే విడుదల పోస్టర్ ఆయన అభిమానలోకాన్నే కాక సినీప్రియులు, విమర్శకులను ఆకట్టుకుంది. మొరాకోలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం డైరక్టర్ క్రిష్ పడుతున్న తపన అంతాఇంతా కాదు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను జార్జియాలో ప్లాన్ చేశారు. జులై 2 నుంచి 22 రోజులు భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకుంటున్నారు. ఈ షెడ్యూల్ […]
శ్రియ పాత్రకి అంత సీనుందా?
బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్లో రానున్న ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా. ఇందులో బాలకృష్ణ సరసన శ్రియ హీరోయిన్గా నటిస్తోంది. శ్రియ ఇందులో ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించనుంది. సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యముందట. ‘బాహుబలి’లో రమ్యకృష్ణ పాత్ర తరహాలో చాలా పవర్ఫుల్గా శ్రియ పాత్ర ఉంటుందని సమాచారమ్. అయితే ఆ పవర్ నటనలోనేనట. ఇంతవరకూ ఇలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్లో శ్రియ నటించలేదు. మరి ఇంత బరువైన పాత్రని శ్రియ ఎలా టేకప్ చేయగలుగుతుందో చూడాలి. […]
శాతకర్ణి రిలీజ్ డేట్ అదేనా!!!
జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ దర్శకత్వంలో శక చక్రవర్తియైన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ ఆధారంగా బాలకృష్ణ నటిస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా కొద్దిరోజుల క్రితం ప్రారంభమై మొదటి షెడ్యూల్ని మొరాకోలో భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించిన దర్శకుడు క్రిష్ రెండవ షెడ్యూల్‌లో కూడా హైదరాబాద్ దగ్గర చిలుకూరు బాలాజీ దేవాలయం దగ్గర వేసిన సెట్‌లో భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు.త్వరలో ప్రారంభం అవుతున్న మూడో […]
టార్గెట్ జూనియర్ – లేపేయ్ దుమారం
ఆయన్ని ఎన్నికల ప్రచారం లో వాడుకున్నారు,తాతకి తగ్గ మనవడని కితాబిచ్చారు,అబ్బో ఒకటా రెండా ఏకంగా అందలమే ఎక్కిన్చేసారు జూనియర్ NTR ని TDP వర్గాలు మరీ ముక్యంగా చంద్రబాబు నాయుడు.ఒక సారి గతం లోకి వెళ్తే ఇదే నారా నందమూరి జూనియర్ NTR కెరీర్ బెగినింగ్ లో అతనెవరో అన్నట్టు, మాకు జూనియర్ కి సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు.ఒక్క సారి NTR కి సక్సెస్ రాగానే మొత్తం బెటాలియన్ అంత NTR మావాడే అసలు మేమే NTR […]
బావ.. బామ్మర్ది..ఓ తెలంగాణా..
ఆ మధ్యన AP CM చంద్రబాబు నాయుడు గారు అసలు తెలంగాణా ప్రజానీకానికి పొద్దున్నే లేవడం NTR గారే నేర్పించారని మాట జారి తరువాత నాలుక కరుచుకోవడం ఆయన వంతైంది.అక్కడికేదో తెలంగాణా వాళ్ళు బద్దకస్తులని వారికి రామారావు గారే పొద్దున్న లేవటం నేర్పారన్నట్టు సెలవివ్వడంతో క్షమాపణ చెప్పే వరకు వెళ్ళింది వ్యవహారం.ఈయనకి ఈ తరహా చలోక్తులు ఈ మధ్యన బాగానే రివర్స్ అవుతున్నాయి.కోడలు మగబిడ్డని కంటా అంటే అత్త వద్దంటుందా అని,వెనుకబడిన కులాల్లో పుట్టాలని ఎవరినా కోరుకుంటారా […]