Tag Archives: amithsha

ఈట‌ల‌కు బీజేపీ అమిత్‌షా ఫోన్‌..?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహానికి గురైన‌ మంత్రి ఈటల రాజేందర్‌తో బీజేపీ నేతలు అప్పుడే సంప్రదింపుల‌కు తెర‌లేపారు. శ‌నివారం ఉదయం నుంచి రాత్రి వరకు షామిర్‌పేట్‌లోని త‌న ఫామ్ హౌస్‌కే ప‌రిమిత‌మైన ఈట‌ల అక్క‌డ త‌న నియోజకవర్గ అభిమానులతో స‌మావేశ‌మ‌య్యారు. ఇదిలా ఉండ‌గా రాత్రి పొద్దుపోయిన తర్వాత బీజేపీ కేంద్ర అధిష్టానం పెద్దలు ఈటల రాజేందర్‌తో టెలిఫోన్‌లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీ పార్టీ సీనియర్ నేత అమిత్ షానే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు స‌మాచారం.

Read more