‘ ఎన్టీఆర్ బయోపిక్‌ ‘ లో మోక్ష‌జ్ఞ రోల్ ఇదే 

ఒకేసారి రెండు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు తెర‌కెక్కుతుండ‌డం ఎన్టీఆర్, నంద‌మూరి ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌. అయితే ఇప్పుడు మ‌రో గుడ్ న్యూస్‌తో ఈ ఫ్యాన్స్‌కు డ‌బుల్ స్వీట్ న్యూస్ వ‌చ్చేసింది. వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సంగ‌తి అలా ఉంటే ఎన్టీఆర్ కుమారుడు బాల‌య్యే స్వ‌యంగా ఓ బ‌యోపిక్‌లో న‌టిస్తుండడంతో ఈ బ‌యోపిక్ ఇప్పుడు సినిమా వ‌ర్గాలు, రాజ‌కీయ‌వ‌ర్గాల్లోను పెద్ద ట్రెండింగ్ న్యూస్ అయ్యింది. మ‌రో సూప‌ర్ థ్రిల్లింగ్ న్యూస్ ఏంటంటే ఈ బ‌యోపిక్‌లో బాల‌య్య త‌న‌యుడు నంద‌మూరి […]

నాగ్ ‘ గ‌ది ‘ సేఫ్‌

టాలీవుడ్‌లో వ‌రుస భారీ బ‌డ్జెట్ సినిమాలు తీసి ఘోరంగా దెబ్బ‌తిన్నాడు పీవీపీ. వ‌ర్ణ‌, బ్ర‌హ్మోత్స‌వం లాంటి సినిమాలు మ‌నోడిని కోలుకోలేని విధంగా దెబ్బ‌తీశాయి. త‌ర్వాత క్ష‌ణం, ఘాజీ లాంటి చిన్న సినిమాలు స‌క్సెస్ అయ్యి మ‌నోడికి కొంత‌వ‌ర‌కు ఆదుకున్నాయి. తాజాగా ఇదే బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన సినిమా రాజుగారి గ‌ది 2. స‌మంత‌, నాగార్జున లాంటి స్టార్ కాస్టింగ్‌తో పాటు శీర‌త్‌క‌పూర్ అందాల ప్ర‌ద‌ర్శ‌నలు ఈ సినిమాపై మంచి హైప్ తెచ్చాయి. సినిమాపై ఉన్న అంచ‌నాల నేప‌థ్యంలో రాజుగారి […]

బాల‌య్య – వ‌ర్మ ‘ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల ‘ స్టోరీలు ఇవే..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల గురించే చ‌ర్చ న‌డుస్తోంది. ఒక‌టి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అయితే రెండోది ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ తెర‌కెక్కించే ఎన్టీఆర్ బ‌యోపిక్. నిన్న‌టి వ‌ర‌కు వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ హ‌డావిడి క‌నిపిస్తే తాజాగా బాల‌య్య బ‌యోపిక్‌కు ద‌ర్శ‌కుడిగా తేజ క‌న్‌ఫార్మ్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ బ‌యోపిక్ హ‌డావిడి కూడా మొద‌లైపోయింది. వ‌ర్మ బ‌యోపిక్‌కు వైసీపీ లీడ‌ర్ రాకేష్‌రెడ్డి నిర్మాత కాగా…. బాల‌య్య – తేజ కాంబోలో […]

ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై ట్విస్ట్ ఇచ్చిన బాల‌య్య‌

తెలుగుజాతి గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో ఒక‌రైన దివంగత ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా ఆయన తనయుడు నంద‌మూరి బాల‌కృష్ణ నిర్మించే బ‌యోపిక్‌పై బాల‌య్య అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. ఈ బ‌యోపిక్ వార్త‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సంచ‌ల‌నాలు రేపుతోంది. ఓ వైపు బాల‌య్య బ‌యోపిక్, మ‌రోవైపు బ‌యోపిక్‌లు తెర‌కెక్కించ‌డంలో సిద్ధ‌హ‌స్తుడు అయిన కాంట్ర‌వ‌ర్సీ కింగ్ రాంగోపాల్‌వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. వ‌ర్మ ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను ల‌క్ష్మీపార్వ‌తి కోణంలో తీస్తాన‌ని చెప్ప‌డంతో పాటు ల‌క్ష్మీస్ […]

ఎన్టీఆర్ క్రేజ్ @ ఎన్ని కోట్లో తెలుసా… చూడండి

ఎన్టీఆర్ క్రేజ్‌కు ఎవ‌రైనా లెక్క‌క‌ట్ట‌డే ద‌మ్ముందా..! ఎవ్వ‌రూ లెక్క‌క‌ట్ట‌లేని అమూల్య‌మైన క్రేజ్‌, ఫ్యాన్స్ నాటి సీనియ‌ర్ ఎన్టీఆర్‌తో పాటు నేటి జూనియ‌ర్ ఎన్టీఆర్ సొంతం. తాత సీనియ‌ర్ ఎన్టీఆర్ పోలిక‌లు ఉండ‌డంతో ఆ నంద‌మూరి తార‌క రాముడికి ఫ్యాన్స్‌తో పాటు క్రేజ్ కూడా చాలా వ‌ర‌కు జూనియ‌ర్ ఓన్ చేసుకున్నాడు. ఇదంతా కాసేపు ప‌క్క‌న పెట్టేస్తే ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ ద‌స‌రాకు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. కంటెంట్ ప‌రంగా చూస్తే జై ల‌వ‌కుశ అంత గొప్ప […]

ఈ ‘ ప‌ద్మావ‌తి ‘ తో బాహుబ‌లికి ముప్పా?

బాహుబ‌లి సినిమా రిలీజ్ అయ్యాక నార్త్ సినిమాపై సౌత్ డామినేష‌న్ గురించి ఒక్క‌టే చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తేడాది వ‌ర‌కు సౌత్ ఇండియ‌న్ సినిమాపై త‌మిళ సినిమా ఆధిప‌త్యం స్ప‌ష్టంగా ఉండేది. బాహుబ‌లి 1,2ల దెబ్బ‌తో ఇప్పుడు తెలుగు సినిమా సౌత్‌కే కాదు నార్త్‌కే స‌వాల్ విసిరే స్థాయికి వెళ్లిపోయింది. బాహుబ‌లిని ఇండియ‌న్ సినిమా గ‌ర్వించ‌ద‌గ్గ రీతిలో తెరకెక్కించాడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. ఇక బాహుబ‌లి సినిమాకు ధీటుగా నిలుస్తుంద‌ని ముందునుంచి అంచ‌నాలు ఉన్న ప‌ద్మావ‌తి ట్రైల‌ర్ తాజాగా రిలీజ్ […]

బాలయ్య మ‌హేష్ కోసం భారీ స్కెచ్ వేసిన టాప్ డైరెక్టర్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుకు గ‌త నాలుగేళ్ల‌లో ఒక్క శ్రీమంతుడు సినిమా మాత్ర‌మే హిట్ ఉంది. వ‌న్‌, ఆగ‌డు, బ్ర‌హ్మోత్స‌వంతో పాటు లేటెస్ట్ మూవీ స్పైడ‌ర్ కూడా భారీ డిజాస్ట‌ర్ అయ్యింది. వ‌రుసగా మ‌నోడి సినిమాలు క‌నీసం యావ‌రేజ్ కూడా కాదు క‌దా డిజాస్ట‌ర్లు అవుతుండ‌డంతో మ‌హేష్ డిఫెన్స్‌లో ప‌డ్డాడు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అను నేను సినిమా చేస్తోన్న మ‌హేష్ ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్‌లోకి ఎక్కాల‌ని క‌సితో ఉన్నాడు. భ‌ర‌త్ […]

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాకు హీరోయిన్ దొరికేసిందిగా…

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజాగా జై ల‌వ‌కుశ సినిమాతో వ‌రుస‌గా నాలుగో హిట్ అందుకున్నాడు. జై ల‌వ‌కుశ సినిమా ఇప్ప‌టికీ నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చి థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ప‌వ‌న్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన వెంట‌నే త్రివిక్ర‌మ్ […]

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌రోసారి తండ్రి అయ్యాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – అన్నా లెజొనెవా దంపతులకు కొడుకు పుట్టాడు. ఆయన భార్య అన్నా లెజొనెవా ఇవాళ పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఇది పవన్ కి నాలుగవ సంతానం. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముందుగా వైజాగ్‌కు చెందిన నందినిని పెళ్లి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి త‌న‌తో బ‌ద్రి, జానీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రేణు దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ప‌వ‌న్ – రేణు దంప‌తుల‌కు అకీరా, ఆద్య జ‌న్మించారు. […]