కేవీపీకి టీడీపీ సపోర్ట్…

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు ఊహించని మద్దతు లభించింది. ఈ బిల్లు ఓటింగ్ వరకు వస్తే… దానికి అనుకూలంగా ఓటేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ తీర్మానించింది. పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడినా… పార్టీలతో ప్రమేయం లేకుండా మద్దతు తెలపాలని కూడా […]

మోడీకి మరో షాక్ :సిద్దు జంప్

మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు నరేంద్ర మోడీకి షాక్ ఇచ్చాడు.సిద్ధు గ‌త ఏప్రిల్ నెల‌లో బీజేపీ తరపున రాజ్యస‌భ‌కు నామినేట్ అయ్యారు.తాజాగా సిద్దు తన రాజ్యసభ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పారు.త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్దు రాజీనామా సర్వత్రా చర్చనీయమాసం అయింది.గతంలో రెండుసార్లు అమృతసర్ నియోజక వర్గం నుంచి సిద్ధూ ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకూ అమృతసర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సిద్ధూ ఎంపికయ్యారు. అయితే ఆ నియోజకవర్గం […]

చిరు,గంటా మళ్ళీ దోస్తీ అందుకేనా?

చిరంజీవితో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సాన్నిహిత్యం ఈనాటిది కాదు.ప్రజారాజ్యం పార్టీ పెట్టినదగ్గరినుండి గంటా తో చిరుకి మంచి అనుబంధం ఉంది.అయితే ఆ తదనంతర పరిణామాల్లో చిరు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాడం తో గంటా కాంగ్రెస్ లో మంత్రి పదవి కొట్టేశారు.ఇక 2014 లో వ్యూహాత్మకంగా టీడీపీ లో చేరి మళ్ళీ మంత్రయ్యారు.చిరు మాత్రం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. తాజాగా గంటా కొడుకు రవితేజ హీరోగా ఓ చిత్రం ప్రారంభమైంది.ఈ చిత్రానికి జయంత్ సి […]

అందుకే జనసేన పార్టీని రద్దుచేసెయ్యాలట

పవన్‌కళ్యాణ్‌ కొన్నాళ్ళ క్రితం జనసేన పార్టీని స్థాపించారు. ఆ పార్టీని స్థాపించిన పవన్‌కళ్యాణే జనసేన అనే పార్టీ ఒకటుందన్న విషయాన్ని మర్చిపోయారు. డబ్బుల్లేవు కాబట్టి పార్టీని నడపలేకపోతున్నట్లు ఓ సందర్భంలో ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో జనసేనకి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించినప్పటికీ ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇప్పటిదాకా పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లోనే పోటీ చేయాల్సిన జనసేన, గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లోనూ మొహం చాటేసింది. జనసేన అనే పేరుతో ఓ […]

షాక్ ఇస్తున్న అమరావతి ఇటుకలు!

అమరావతి అని రాజధాని పేరును ప్రకటించిన దగ్గరినుండి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తో ఊడగొట్టేసింది.అమరావతి పేరులోనే రాజసం ఉట్టిపడుతోంది.అమరావతి అంటే ప్రజలది..ప్రజలంటేనే అమరావతే అన్నంతగా ప్రచారాన్ని హోరెత్తించారు.అసలు శంకుస్థాపనయితే ఓ చారిత్రాత్మక ఘట్టంలా నిర్వహించారు.దాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ ఓ వైపు లోటు బడ్జెట్ సన్నాయి నొక్కులు నొక్కుతూనే మరో వైపు శంకుస్థాపన ఆర్భాటాలు చూసి జనం విస్తుపోయారు. మొదట్లో స్వచ్ఛందంగానే ప్రజలంతా మన అమరావతి అనే నినాదం తోనే ముందుకెళ్లారు.అప్పట్లో ఆహా అమరావతి […]

ఇప్పుడనుకొని ఏమా లాభం జైరాం గారూ!

కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ పెద్దల్లో ఒకరైన జయరాం రమేష్ గారిగి పాపం ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయినట్టుంది.రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కి జరిగిన నష్టం పూడ్చలేనిది నిట్టూర్చారు పాపం.ఎం చేస్తాం జైరాం గారూ ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారన్న నానుడి గుర్తుంది గా..అచ్చం అలాగే జరిగినదన్నమాట కాంగ్రెస్ కి. వైఎస్ఆర్ మరణించకుండా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థులు వేరుగా వుండేయని అన్నారు.అయినా ఈయనకు ఈ నిజం ఇప్పటికి తెలిసిందేమో కానీ వైఎస్ఆర్ మరణించిన తరువాత […]

మేడమ్‌కి మోడీ షాక్‌లే షాక్‌లు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మానవ వనరుల శాఖ మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించిన మోడీ, ఆమెకు తాజాగా పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నుంచి ఉద్వాసన పలికారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఏ కమిటీల్లోనూ స్మృతి ఇరానీకి చోటు కల్పించలేదు నరేంద్రమోడీ. ఒకానొక సమయంలో కేంద్ర క్యాబినెట్‌లో స్మృతి ఇరానీ అత్యంత కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్‌ […]

రేవంత్‌రెడ్డికి కౌంటరిచ్చిన కిషన్‌రెడ్డి

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలమేమిటో తెలుసుకోకుండా భారతీయ జనతా పార్టీపై నోరు పారేసుకున్న రేవంత్‌రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి గట్టి కౌంటర్‌నే ఎదుర్కొన్నారు. బిజెపి తమకు మిత్రపక్షమని కూడా చూడకుండా రేవంత్‌రెడ్డి వెటకారం చేయడాన్ని బిజెపి సీనియర్‌ నాయకుడు కిషన్‌రెడ్డి తీవ్రంగా పరిగణించినట్లున్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డిని వివరణ కోరితే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? అని కౌంటర్‌ ఇచ్చారు. కలిసి పనిచేయాల్సిన రెండు రాజకీయ పార్టీల మధ్య ఈ తరహా మాటల తూటాలు అందర్నీ […]

కోహ్లీకి ప్రొపోజ్ చేసిన అమ్మాయిని చంపేశారు

వరల్డ్ కప్ T20 జరుగుతున్నప్పుడు ఓ పాకిస్థానీ అమ్మాయి పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపింది గుర్తుందా.ఆమె ఎవరో కాదు ప్రముఖ పాకిస్థానీ మోడల్‌, సోషల్‌ మీడియా సెలబ్రిటీ అయిన ఖందీల్‌ బలోచ్‌.ఈ మధ్య కాలం లో పాకిస్థాన్ లో బాగా పాపులర్ అయిన ఖందీల్‌ బలోచ్‌ ఈ రోజు హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. బలోచ్ T20 వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఓ వీడియో పోస్ట్ చేసి సంచలనంగా మారింది.ఆ వీడియో లో కోహ్లీ అంటే […]