బీజేపీ లో వెంకయ్య నాయుడి రేంజే వేరు.పార్టీకి ఏసమస్యవచ్చినా వెంకయ్యే దారిచూపుతుంటారు.వెంకయ్య వాక్చాతుర్యం గురించి కొత్తగా చెప్పేదేముంది.అయన మైక్ పట్టుకుంటే ఎక్కడ మొదలెడుతారో ఎక్కడ ముగిస్తారో ఆయనకే తెలీదు.అలా తడుముకోకుండా అనర్గళంగా ఉపన్యాసాలు దంచేస్తారు ఈ నాయుడు గారు.అలాంటి ఈయన మన తెలుగోడు అవడం అందులోనా రాష్ట్రం విడిపోయి కష్టకాలం లో ఉన్న మనందరికీ వారమనుకున్నారు అందరు. అందులోనా ఈ నాయుడు గోరు అధికార బీజేపీ పార్టీ వాడు, అందునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయం లో […]
Category: Politics
టీడీపీ:తెలుగు వారి దౌర్భాగ్యాపు పార్టీ
రాజ్యసభలో కేవీపీ ప్రయివేట్ మెంబెర్ బిల్ చర్చ వాడి వేడిగా జరిగింది.అయితే సిగ్గు పడాల్సిన విషయమేంటంటే దేశం మొత్తం పార్టీలకతీతంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యక హోదా కోసం నిందిస్తుంటే అధికార టీడీపీ మాత్రం అత్యంత జుగుప్సయాకరమైన రీతిలో బీజేపీ ని వెనకేసుకు రావడం చూస్తే నిజంగా తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టి తగలబెట్టేశారు. ఎంతసేపు కాంగ్రెస్ అన్యాయంగా విభజించింది..ఇదంతా కాంగ్రెస్ వల్లనే..మొత్తం కాంగ్రెస్ చేసింది అని పాడిన పాటే పాడి..బీజేపీ హామీ ఇచ్చింది..కచ్చితంగా అమలు […]
వేడుకలు సీమకి అభివృద్ధి అమరావతికి!
అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందాగా తయారైంది రాయలసీమ అభివృద్ధి వ్యవహారం.ఒకప్పటి రాయలు పాలించిన రతనాల సీమ నేడు పాలకుల నిర్లక్ష్యానికి గురై అంతకంతకు వెనుకబడిపోతోంది.రాయలసీమ అంటే కేవలం ముఖ్య మంత్రుల్ని సప్లై చేసే ఫ్యాక్టరీ గానే చూస్తున్న తరుణం లో దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర రెడ్డి గారు అది నిజం కాదని నిరూపిస్తూ రాయసీమను కరువు కోరల్లోంచి రక్షించేందుకు అనేక తాగు,సాగు నీటి ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాడు.ఒక్క ప్రాజెక్టులే కాదు విద్య,వైద్య,పారిశ్రామిక […]
లండన్ కోర్టు, సింగపూరోడు:చంద్ర మాయ
ఏపీ రాజధాని నిర్మాణ వ్యవహారాన్ని స్విస్ చాలెంజ్ పద్ధతిలో చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియానికి కట్టబెట్టింది. అదే సందర్బంలో న్యాయపరమైన ఇబ్బందులన్నీ లండన్ కోర్టులో తేల్చుకోవాలని ఒప్పందం చేసుకుంది. అంటే భవిష్యత్తుల్లో సింగపూర్ కన్సార్టియం లాభాలకు గ్యారంటీ ఇచ్చిన ప్రభుత్వం ఒకవేళ పరిస్థితులు తారమారయితే మాత్రం లండన్ కోర్టు బోనెక్కాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం అంటే మనందరి పరిస్థితి దోషులుగా నిలవాల్సి ఉంటుంది. సింగపూర్ కంపెనీల లాభాల కోసం మన రాజధాని కడుతున్న చందంగా పరిస్థితులు మార్చేసిన […]
ఏపీ కాంగ్రెస్ కి అదే సంజీవిని!
ఏపిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ప్రభావం చూపలేకపోతోందని కాంగ్రెస్ పార్టీ నేతలే ధృవీకరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సర్వంకోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నా మైలేజీ పార్టీకి చేరడంలేదు . ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత బతికివుందంటే అది పార్టీకి అంటిపెట్టుకొన్న కొంత మంది సీనియర్ నేతల వల్లేనని రాజకీయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. పార్టీలో సీనియర్ నేతలు, సమయానుసారం ప్రజా సమస్యలపై స్పందిస్తున్నా విభజిత ఆంధ్ర ప్రదేశ్ […]
టీడీపీ, టీఆర్‌ఎస్ ఆశలపై కేంద్రం నీళ్ళు
పార్టీ ఫిరాయింపులకు పాల్పడేందుకు తెలంగాణలో టిఆర్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి వాడుకున్న అస్త్రం ‘అసెంబ్లీ సీట్ల పెంపు’. ఆకాశంలో మేడలు కట్టేయడంలో ఈ రెండు పార్టీలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. 2019 నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి కాబట్టి, ‘ఈలోగా మా పార్టీలోకి వచ్చెయ్యండి’ అని విపక్ష నేతలకు గాలం వేశాయి టిడిపి, టిఆర్‌ఎస్. ఈ మూడు నాలుగేళ్ళు అధికారంలో ఉంటాం, ఆ తర్వాత సీటు గ్యారంటీ అనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిథులు తెలంగాణ, […]
కడియం శ్రీహరికి చెక్ పెడ్తారా?
తెలంగాణలో ఎంసెట్ వివాదాస్పదమయ్యింది. నీట్ పరీక్ష కారణంగా ఎంసెట్-1, ఎంసెట్-2 రాయాల్సి వచ్చింది మెడిసిన్ అభ్యర్థులు. అయితే ఎంసెట్-2 లీక్ అయ్యిందని సిఐడి విచారణలో తేలింది. దాంతో ఎంసెట్-2 ఇంకోసారి నిర్వహించాల్సి వచ్చేలా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఇంకోసారి ఎంసెట్ నిర్వహించడం వల్ల తమకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 69 మంది విద్యార్థులు అక్రమంగా ఎంసెట్-2లో ర్యాంకులు పొందారు. పేపర్ లీకేజీ వెనుక పెద్ద కుట్రే దాగుందని సిఐడి తేల్చింది 50 […]
కెసియార్ లెక్కలు కెసియార్‌కి ఉన్నాయ్
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే మాక్కూడా ఇవ్వాలి అని ఇప్పుడు నినదించడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒకేసారి సమైక్య తెలుగు రాష్ట్రం నుంచి వేరుపడ్డంతో ఇస్తే రెండిటికీ ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో కెసియార్ సహా టిఆర్‌ఎస్ నాయకులు నినదించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కి రాజ్యసభలో దక్కిన హామీ కూడా నెరవేరకపోవడంతో తెలంగాణ గట్టిగా ఆ విషయం గురించి అడగడానికి లేకుండా పోయింది. ఇప్పుడు […]
ఓ రెడ్డి ఓ కాపు ఓ మైనారిటీ- ఇదీ బాబు లెక్క
రాజకీయాల్లో చంద్రబాబు రాజకీయమే వేరయా..ఇది ఇవ్వాల్టి మాట కాదు. రామ రావు గారిని గద్దె దించడానికి వైస్రాయ్ హోటల్ లో రాజకీయం చేసిన రోజులనుండి వినిపిస్తున్న మాటే ఇది. చంద్రబాబు వ్యక్తుల్ని పెద్దగా నమ్మరు అనేది అయన సన్నిహితులే చెప్పే మాట. ఆయన పలురకాల సమీకరణాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. ఆ సమీకరణాల్లో భాగంగానే ఎవరికైనా ఏదయినా పదవి దక్కాల్సిందే తప్ప వ్యక్తిగత ఎదుగుదలతో ఎంత చేసినా బాబు సమీకరణాలముందు అదంతా బేజారె. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాలంటే […]