నయీం గ్యాంగ్ స్టర్.. ఎన్నో హత్యలు చేశాడు..ప్రతి వ్యవహారంలోనూ వేలుపెట్టి సెటిల్మెంట్లు …చడీచప్పుడు లేకుండా అత్యంత రహస్య ఆపరేషన్ తో తెల్లారేసరికి ఎన్ కౌంటర్ చేసి పడేశారు..చాలాకాలం పోలీసులకు ఇన్ఫార్మరుగా ఉంటూ… మావోయిస్టులను, పౌరహక్కుల నేతలనూ చంపిన నయీం ఒక్కసారిగా పోలీసులకు, ప్రభుత్వానికి ఎందుకు టార్గెట్ అయ్యాడు..? ఒకటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో కొత్తగా సంబంధాలు పెట్టుకోవడం.. రెండు తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలను బెదిరించడం. రెండో కారణమే బలంగా వినిపిస్తున్నా, మొదటి కారణం కూడా ప్రభుత్వం తక్షణం […]
Category: Politics
మరో మల్లన్నసాగర్ గా తయారవుతున్న ఫార్మా సిటీ…
ఫార్మాసిటీ…. తొలుత 6000 ఎకరాల్లో ఫార్మాసీటీకి ఊపిరి పోయాలని అనుకున్నా, కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలతో 12,500 ఎకరాలకు పెంచారు. ఈ ప్రాజెక్టుకు ఎన్డీయే సర్కారు జాతీయ పెట్టుబడి, తయారీ కేంద్రం హోదా సైతం మంజూరు చేసిందని టీఎస్‌ఐఐసీ అధికారులు అంటున్నారు.ఫార్మా సిటీ కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలాల్లోని 19 గ్రామాల్లో ఇప్పటికే భూసేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే కందుకూరు మండలం ముచ్చర్ల ప్రధాన కేంద్రంగా […]
కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య మరో వివాదం
దేశ రాజధాని ప్రాంతం పరిపాలనాధిపతిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కొనసాగుతారని ఇటీవలే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండనక్కరలేదని కూడా హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్, కేజ్రీవాల్ మధ్య మరో వివాదం చెలరేగేలా కనిపిస్తోంది. ఫైళ్లను తనకు పంపించాలని ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాశారు. ఫైళ్ల వివరాలన్నింటినీ నజీబ్ జంగ్ కోరారు. దీనిపై కేజ్రీవాల్ ప్రభుత్వ స్పందన […]
జీఎస్టీ సవరణలకు లోకసభ ఓకే
చరిత్రాత్మక పన్ను సంస్కరణగా భావిస్తున్న జీఎస్టీ సవరణ బిల్లును లోక్ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. గతేడాది జీఎస్టీ బిల్లును లోక్ సభ ఆమోదించినప్పటికీ.. రాజ్యసభలో గతవారం నాలుగు సవరణలతో బిల్లు పాస్ అయింది. తాజాగా లోక సభ కూడా ఆమోదించడంతో…. జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించినట్టయింది. జీఎస్టీ రాజ్యాంగ 122వ సవరణ బిల్లుపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. 443 అనుకూల ఓట్లతో ఏకగ్రీవంగా జీఎస్టీ బిల్లులోని సవరణలను సభ ఆమోదించింది. సవరించిన బిల్లును మధ్యాహ్నం లోక్ […]
సివిల్స్ టెస్ట్ లో మోడీ జపం
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలో మోదీ ప్రభుత్వంపై అడిగిన ప్రశ్నలు అభ్యర్థులకు నిజమైన పరీక్ష పెట్టాయి. మొత్తం వంద ప్రశ్నల్లో మోదీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకాల గురించే 13 కావడం గమనార్హం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, స్టాండప్ ఇండియా, ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ అస్పైరింగ్ మైండ్స్, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజనలపై ప్రశ్నలు అడిగారు. వీటిపై చాలామంది అభ్యర్థులు మండిపడుతున్నారు. ఆధునిక చరిత్ర, […]
విశాఖకు దూరమవుతున్న విద్యాసంస్థలు
ప్రతిష్ఠాత్మకమైన వివిధ విద్యా సంస్థలను విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పటికీ అవి ఇతర జిల్లాలకు తరలిపోతున్నాయి. తాజాగా విశాఖలో ఏర్పాటు చేయాలనుకున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (ఐఐపిఎం) కృష్ణాజిల్లా కొండపల్లికి తరలించాలని నిర్ణయించారు. విభజన నేపథ్యంలో పలు విద్యా సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందు కు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిలో కొన్ని విశాఖలో ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు ఏర్పడిన విషయం తెలిసిందే. అందులో కొన్ని […]
ట్రబుల్ లో కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్…
తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు ఇస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.. శాంపుల్‌గా హైదరాబాద్‌లో కొన్ని ఇళ్లను చూపించింది.. వాటిని చూసిన ప్రజలు సర్కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆ ఊహల్లోనే విహరిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరో రకంగా ఉంది.. ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గృహ నిర్మాణ శాఖ మంత్రి సొంత జిల్లా ఆదిలాబాద్‌లో అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. నాలుగు సార్లు టెండర్లు పిలిచినా […]
ఈ సారైనా స్మార్ట్ సిటీ దక్కేనా…
రెండో దఫా స్మార్ట్ సిటీలో తిరుపతికి చోటుదక్కుతుందోలేదోనన్న ఎదురుచూపులు ఎక్కువవుతున్నాయి. కేంద్రమంత్రి పదవిలో కొలువుదీరిన వెంకయ్యనాయుడు ఈ సారైనా కరుణిస్తారోలేదోనని నగరవాసులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.వంద నగరాల్లో మొదటి దఫా 20 నగరాలను ఎంపికచేసినా.. అందులో తిరుపతికి చోటుదక్కని సంగతి తెలిసిందే. 40 నగరాలతో రెండో జాబితాను ప్రకటించాల్సి ఉండగా కొన్ని కారణాలచేత 13 నగరాలను ఎలాంటి ఎంపిక ప్రతిపాదనలు లేకుండానే ఈ ఏడాది మేలో ప్రకటించారు. మిగిలిన 27 నగరాలను ఆగస్టు 15లోపు ప్రకటించాల్సి ఉంది. […]
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లెక్కలు తేలాయి….
విభజన జరిగిన రెండేళ్ల తర్వాత… రెండు రాష్ట్రాల పంచుకోవలసిన ఆస్తుల లెక్కలు తేలుతున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూలులో పేర్కొన్న సంస్థల ఆస్తులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 142 సంస్థల్లో 132 సంస్థల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. మరో 10 సంస్థల నుంచి వివరాలు అందలేదు. భూములు, భవనాలతో కూడిన భూములు, కార్యాలయాల సామగ్రి, వివిధ సంస్థల మెషినరీ సంబంధిత సామగ్రి, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు అకౌంట్లు… […]