ఉప ఎన్నికల వేళ కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయం రోజు రోజుకు ఎటు మలుపులు తిరుగుతుందో అంచనా వేయడం కష్టంగా మారుతోంది. ఇక నంద్యాల రాజకీయం బాగా హీటెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం ఇక్కడ టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలో చేరగా ఇప్పుడు అదే బాటలో మరో కీలక వ్యక్తి పయనిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. దివంగత నేత భూమా నాగిరెడ్డికి నంద్యాలలో కుడిభుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారని… […]
Category: Politics
వైసీపీకి ఆ మూడు పార్టీల మద్దతు
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో ఇప్పుడు కొత్త జోష్ కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎవరు పార్టీలో ఉంటారో? ఎవరు ఎప్పుడు జంప్ చేస్తారో? తెలియని పెద్ద సందిగ్ధావస్థలో కూరుకుపోయిన వైసీపీ నేతలు సహా అధినేత జగన్‌లో ఇప్పుడు ఏదో తెలియని కొత్త జోష్ కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం.. నిన్న మొన్నటి వరకు జగన్‌ను తిట్టిపోసిన కాంగ్రెస్, వామపక్షాలు సహా లోక్‌సత్తా పార్టీలు ఇప్పుడు జగన్ చెంత చేరి.. జై కొడుతున్నాయట. అదే సమయంలో […]
శిల్పా చక్రపాణిని టీడీపీ వదిలించుకోనుందా?
కర్నూలు జిల్లా టీడీపీ పొలిటికల్ గేమ్ పీక్ స్టేజ్‌కి చేరింది. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో ఇప్పటికే టీడీపీ నేతల నిర్ణయం సెగలు పొగలు కక్కిస్తున్న విషయం తెలిసిందే. హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డి సీటును ఆయన సోదరుని కుమారుడు బ్రహ్మానంద రెడ్డికి కట్టబెట్టి.. ఎప్పటి నుంచి పార్టీ కోసం కృషి చేస్తున్న శిల్పా మోహన్‌రెడ్డిని పక్కన పెట్టేశారు. దీంతో ఆయన అలిగి.. జగన్ పంచకు చేరిపోయిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు శిల్పా ఫ్యామిలీ నుంచి […]
చేతులెత్తేసిన భూమా ఫ్యామిలీ…రంగంలోకి నారాయణ
నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్నటీడీపీ మరో పక్క ఎన్నిక జరిగితే గెలిచేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఈ క్రమంలోనే నంద్యాలలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు అప్పుడే తెరలేపేసింది. ఉప ఎన్నిక నేపథ్యంలో అప్పటి వరకు పార్టీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి పార్టీ వీడి వెళ్లడంతో ఆయన వెంట మునిసిపల్ చైర్మన్‌తో పాటు చాలా మంది కౌన్సెలర్లు సైతం వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో నంద్యాల మునిసిపాలిటీ వైసీపీ పరం అయ్యింది. ఈ క్రమంలోనే […]
విపక్షాల విమర్శల నుండి కేటీఆర్ వెనక్కి వెళ్లిపోయాడా?
టీఆర్ ఎస్ సహా తెలంగాణ ప్రభుత్వంలో నెంబర్ – 2 గా ఉన్న కేటీఆర్ ఇప్పుడు విపక్షాల విమర్శలకు తలవంచుతున్నారా? అని అనిపించేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే 2019 కి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయంలో వెనుకడుగు వేశారట. అదేంటో చూద్దాం.. రాష్ట్రంలో 2019లో ఎలాగైనా సరే మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ ఎస్ వీక్‌గా ఉండి.. టీడీపీ సహా ఇతర పక్షాలు బలంగా ఉన్న చోట.. ముఖ్యనేతలను […]
ఫైర్‌బ్రాండ్‌కు రోజాకు జగన్ క్లాస్ .. దానికి రోజా రియాక్షన్ ..!
జగన్ పార్టీ వైసీపీలో తనకు ఎదురు లేదని భావించిన ఆ పార్టీ లేడీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు ఇప్పుడు కష్టాలు స్టార్టయ్యాయని అంటున్నారు. అది కూడా ఆ పార్టీ అధినేత జగన్ నుంచేనని సమాచారం. తన జబర్దస్త్ దూకుడుతో మీడియాలో ఏదో ఒక కామెంట్ చేసి.. అధికార పార్టీని ఇరుకున పెట్టే.. రోజా.. సడెన్‌గా ఇలా పార్టీ అధినేతకు దొరికిపోవడం ఏంటి? జగన్‌తో క్లాస్ చెప్పించుకునే స్థాయికి ఎందుకు దిగజారింది? అసలేం జరిగింది? అంటే.. స్టార్టింగ్‌లో […]
పైసా ఖర్చేలేదు.. మోడీ బాబు ను తెగ వాడేస్తున్నాడన్నమాట!!
అందితే జుట్టు.. అందకపోతే.. కాళ్లు పట్టుకోవాలి! ఇది ఓల్డ్ సామెత. అయితే, ఇది మన దేశాన్నేలుతున్న ప్రధాని నరేంద్ర మోడీకి అక్షరాలా సరిపోతుందని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. తనకు అవసరమైన వారితో ఎలా పనిచేయించుకోవాలో..? తన అవసరం వస్తే.. ఎలా తప్పించుకోవాలో? మోడీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదంటే నమ్మలేరు. కానీ, పాలిటిక్స్‌లో ఆ మాత్రం జిమ్మిక్కులు చేయకపోతే ఎలా అనేవారూ ఉన్నారు. ఇక, విషయానికి వస్తే.. దేశం మొత్తంమీద ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకి, మోడీకి […]
కేసీఆర్‌కు ఎక్కడో టెన్షన్…అది హరీశేనా..!
తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లో గత రెండేళ్లుగా వారసత్వ పోరు తీవ్రంగానే జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు పార్టీలో హరీశ్‌రావుకు ఉన్న ప్రాధాన్యం ఎన్నికల తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. కేసీఆర్ సైతం అల్లుడు కంటే కొడుకు కేటీఆర్‌కే కీలక బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పిన హరీశ్ ఇప్పుడు సిద్ధిపేట, మెదక్ జిల్లాలకు పరిమితమైపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల తర్వాత కేటీఆర్ క్రేజ్ మామూలుగా లేదు. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు వరంగల్ […]
2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందన్న నమ్మకంతో ..!
ఏపీ విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్ బాబాయ్, ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారా ? వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే తాను మంత్రి అవ్వవచ్చని ప్లాన్ వేస్తోన్న వైవీ ఈ క్రమంలోనే ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్లానింగ్‌లో ఉన్నట్టు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చలు వినపడుతున్నాయి. ప్రస్తుతం వైవీ.సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందన్న నమ్మకంతో […]
