రాజకీయాల్లో ప్రత్యర్థులు కామన్. అసలు ప్రత్యర్థులు లేకపోతే, ఒకళ్లనొకళ్లు విమర్శించుకోకపోతే, తిట్ట దండకం చదివించుకోకపోతే.. అది రాజకీయమేకాదు. అయితే, తెలంగాణలోని పాలమూరులో పాలిటిక్సే ఇప్పుడు అందరినీ తీవ్రంగా బాధపెడుతున్నాయి. ఇక్కడి రాజకీయాలు ఆ కుటుంబాన్ని శాసిస్తున్నాయి. అక్కా తమ్ముళ్ల మధ్య ఉన్న రక్త సంబంధానికి సైతం సవాల్ విసురుతున్నాయి. ఒకళ్ల నొకళ్లు ముఖం కూడా చూసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నాయి. అదికూడా గతంలో మంత్రిగా చేసిన సీనియర్ రాజకీయ నేత కేంద్రంగా జరగడం సర్వత్రా చర్చకు దారితీసింది. […]
Category: Politics
తూర్పులో టీడీపీకి దిమ్మతిరిగే షాక్…. జ్యోతుల గుడ్ బై
ఏపీలో అధికారం దక్కించుకునేందుకు కీలక జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ తగిలింది. ఓ పక్క కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దెబ్బతో చంద్రబాబు విలవిల్లాడుతుంటే మరోవైపు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీ ఇస్తుండడం మరో తలనొప్పిగా మారింది. ఇక తాజాగా అదే జిల్లాలో టీడీపీకి అదిరిపోయే షాక్ తగిలింది. జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు జ్యోతుల చంటిబాబు గురువారం టీడీపీ గుడ్ బై చెప్పారు. టీడీపీ సభ్యత్వానికి, […]
టీడీపీకి కాకినాడ టెన్షన్ స్టార్ట్
నంద్యాల ఉప ఎన్నికలతోనే ఒకపక్క టెన్షన్ పడుతున్న టీడీపీకి.. మరో పక్క కాకినాడ కార్పొరేషన్ టెన్షన్ పట్టుకుంది. కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఆందోళన మొదలైంది. తూర్పు గోదావరి జిల్లాలో కాపు ఓట్లు కీలకం. ముఖ్యంగా కాకినాడలో మరింత అధికం! కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఆవర్గపు ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఇదే సమయంలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు రావడంతో.. టీడీపీ […]
రెండు విషయాల్లో కేసీఆర్ ఆందోళన … ఆ ఎఫెక్టే కారణమా..!
తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ 2019 ఎన్నికల్లో తన నియోజకవర్గం సిరిసిల్లకు గుడ్ బై చెప్పేస్తున్నారా ? కేసీఆరే స్వయంగా కేటీఆర్‌ను సిరిసిల్ల నుంచి తప్పించేస్తున్నారా ? అంటే అవునన్న ఆన్సరే టీ పాలిటిక్స్ ఇన్నర్ సైడ్‌లో వినిపిస్తోంది. కేటీఆర్ మంత్రిగా ఎంత కష్టపడుతున్నా సిరిసిల్లలో కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాలు స్థానికంగా కేటీఆర్‌కు ఇబ్బందిగా మారుతున్నాయి. కేసీఆర్ వరుసగా చేస్తోన్న సర్వేల్లో కూడా ఇదే విషయం స్పష్టమైందట. కొద్ది రోజుల క్రితం ప్రత్యేక […]
నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మతిరిగే షాక్
నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో చేరారు. బుధవారం ఆయన తన కుమారులు, సోదరులతో పాటు సచివాలయానికి వచ్చి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఆయన్ను చంద్రబాబు వద్దకు తీసుకువచ్చారు. ఆ వెంటనే వాళ్లు చంద్రబాబు సమక్షంలోనే టీడీపీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నిక మరో వారం రోజుల్లో జరుగుతోంది. రెండు […]
బాబుకు యాంటీగా పవన్‌ను నడిపిస్తోంది వాళ్లేనా..!
`పవన్, చంద్రబాబు ఎప్పుడూ భాయి-భాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతు ఉంటుంది` ఇదీ కొంతకాలం క్రితం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య! నిజమే.. సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మధ్య.. సత్సంబంధాలే ఉన్నాయి. దీనివల్లే నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్ మద్దతు తమకు ఉంటుందని, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు అంతా నమ్మకంతో ఉన్నారు. కానీ `2019 ఎన్నికల వరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయం. మా వైఖరి […]
వైఎస్ కుటుంబంలో అసంతృప్తి సెగలు
వైసీపీ అధినేత జగన్ కెరీర్‌లోనే తీవ్రమైన సందిగ్ద స్థితిలో ఉన్నట్టే కనిపిస్తోంది. ముంచుకొస్తోన్న 2019 ఎన్నికలు, బలమైన చంద్రబాబు లాంటి రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవడం పెద్ద సవాల్. ఇక ఇప్పటికిప్పుడు నంద్యాల ఎన్నికలు చావోరేవోలా ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు జగన్‌కు తన ఫ్యామిలీని సంతృప్తి పర్చడం కూడా పెద్ద సవాల్‌గా మారింది. గత ఎన్నికలకు ముందు నుంచి సోదరి షర్మిలకు జగన్‌కు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. షర్మిల కడప లేదా ఖమ్మం ఎంపీ సీటు […]
మహేష్ ఫ్యాన్స్‌లో అయోమయం..అంతా అయోమయం!
ప్రస్తుతం జోరుమీదున్న నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ, వైసీపీలు దేనికి అదే విజయంపై ధీమాగా ఉన్నాయి. అదేసమయంలో అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ.. పార్టీ అధినేతలు ముందుకు పోతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని రంగంలోకి దింపుతున్నారు. సాధ్యమైనన్ని హామీలు.. అంతకు మించి సాధ్యమైనన్ని విమర్శలు చేసుకుంటున్నారు. ఇది నాణేనికి ఒకవైపు ముచ్చట. ఇక, ఇప్పుడు ఎన్నికలు సమీపించేస్తున్నాయి. వారాల నుంచి రోజుల్లోకి వచ్చేసింది గడువు. దీంతో ఇప్పుడు ప్రజలను మరింత బలంగా తమవైపు తిప్పగల వారికోసం […]
నంద్యాలలో టీడీపీ-వైసీపీ సర్వేలు ఏం చెపుతున్నాయ్
నంద్యాల ఉప పోరు సమీపిస్తున్న కొద్దీ.. విజయం ఎవరిదనే విషయంపై సహజంగానే ఆసక్తి నెలకొంటుంది. ఏ టీ బడ్డీ వద్ద చూసినా.. ఏ నలుగురు మాట్లాడుకున్నా.. గెలుపు సమాచారంపైనే మాటలు నడిచిపోతుంటాయి. ఇక, నంద్యాల వంటి అతి కీలకమైన ఎన్నిక, అదికూడా రెండు బలమైన పక్షాలు అక్కడే రోజుల తరబడి తిష్టవేసి మరీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇక ఈ నియోజకవర్గంపై అంచనాలు ఎలా ఉంటాయనేది చెప్పడం కష్టం. గెలుపు నాదంటే నాదనే ఈ రెండు పక్షాల […]