ప‌వ‌న్ గురించి రోజా కొత్త భాష్యం! 

నంద్యాల ఉప ఎన్నిక‌కు గ‌డువు స‌మీపిస్తున్న కొద్దీ.. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం పెరుగుతోంది. ఒక‌రిని మించి మ‌రొక‌రు మాట‌ల‌తో గేమ్ ఆడేస్తున్నారు. ఇక‌, ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన జ‌బ‌ర్డ‌స్త్ రోజా.. మ‌రింత‌గా రెచ్చిపోయింది. నంద్యాల‌లో గెలుపు వైసీపీదేన‌ని చెప్పింది. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిపోయింద‌ని, అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలివిగా వ్య‌వ‌హ‌రించి.. తాను ఎవ‌రికీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేద‌ని కొత్త భాష్యం చెప్పుకొచ్చింది. ఒక వేళ ప‌వ‌న్ ఎవ‌రికైనా మ‌ద్ద‌తిచ్చినా.. వైసీపీ […]

ఆ టీడీపీ ఎమ్మెల్యేను ఆదర్శంగా తీసుకోమంటోన్న జ‌గ‌ప‌తిబాబు

ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై టాలీవుడ్ సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తిబాబు ప్ర‌శంస‌లు కురిపించాడు. జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టించిన లేటెస్ట్ మూవీ జయ జానకీ నాయక సక్సెస్‌‌ మీట్ కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని హంసలదీవిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర సిబ్బంది, పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమాలో ఇంట‌ర్వెల్ త‌ర్వాత వ‌చ్చే ఓ ఫైట్‌ను హంస‌ల‌దీవి వ‌ద్ద చిత్రీక‌రించారు. ఇది సినిమాకే […]

తెలంగాణ పాలిటిక్స్‌లో కులాల కుంప‌టి

బంగారు తెలంగాణ సాకారం అవుతుంద‌ని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అక్క‌డి రాజ‌కీయ నేత‌లు.. కులాల తెలంగాణను చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం మింగుడు ప‌డ‌డం లేదు. వాస్త‌వానికి ఏపీలో మాత్ర‌మే కులాల కుమ్ములాట‌లు ఉన్నాయ‌ని, అక్క‌డ మాత్ర‌మే రాజ‌కీయాలు కులాల‌తో నిండిపోయాయ‌ని గ‌తంలోనే అనేక‌సార్లు టీఆర్ ఎస్ అధినేత‌గా, సీఎంగా కూడా కేసీఆర్ విమ‌ర్శించారు. అయితే, ఇప్పుడు మాత్రం తెలంగాణ‌లో కులాల కుంప‌ట్లు రాజుకున్నాయి. కులం కార్డుతో ఒక‌రి నొక‌రు ఓడించుకునేందుకు, కులం కార్డుతో ప్ర‌జ‌ల్లో బ‌లంగా […]

న‌ంద్యాల క్లైమాక్స్‌లో టీడీపీకి చెంప దెబ్బ‌

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం క్లైమాక్స్‌లో టీడీపీకి అదిరిపోయే చెంప‌దెబ్బ త‌గిలింది. ఇక్క‌డ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రావ‌డానికి కొద్ది రోజుల ముందే చంద్ర‌బాబు నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న అధికారుల‌ను అంద‌రిని ట్రాన్స్‌ఫ‌ర్ చేసేసి త‌న‌కు అనుకూలంగా ఉండేవాళ్ల‌ను వేయించుకున్నారు. ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు, ఎస్పీ, ఐజీ, డీఐజీ ఇలా అంద‌రిని బ‌దిలీ చేసేసి కొత్త‌వాళ్ల‌ను అక్క‌డ బాబు సెట్ చేశారు. ఉప ఎన్నిక వేళ నోటిఫికేష‌న్ వ‌స్తే తాను చెప్పిన‌ట్టు చేయాల‌ని, అధికార టీడీపీకి అనుకూలంగా […]

రోజాపై వేణు మాధ‌వ్ చేసిన కామెంట్లు చూస్తే షాకే (వీడియో)

నంద్యాల ప్ర‌చారం ర‌చ్చ ర‌చ్చ‌గా మారుతోంది. అటు అధికార టీడీపీ వాళ్లు, ఇటు విప‌క్ష వైసీపీ వాళ్లు ప‌ర‌స్ప‌రం తిట్ల విష‌యంలో పోటీప‌డి మ‌రీ విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. జ‌గ‌న్‌, రోజా, బాల‌య్య‌, చంద్ర‌బాబు, వేణు మాధ‌వ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్క‌డ అభ్య‌ర్థులు కాకుండా స్టేట్ వైడ్ సెల‌బ్రిటీలు చాలా మందే మ‌కాం వేసి త‌మ పార్టీ అభ్య‌ర్థుల కోసం ప్ర‌చారం ముమ్మ‌రం చేస్తున్నారు. రోజా ఎక్క‌డైనా ఎంట్రీ ఇస్తే ఆ ప్రచారం ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి […]

షాక్‌…. టీడీపీకి యాంటీగా నంద్యాల‌కు క్యూ క‌డుతోన్న లీడ‌ర్లు

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరుగుతోంది. ఆయ‌న ఊహించ‌ని విధంగా నంద్యాల ఉప ఎన్నిక యూట‌ర్న్ తీసుకుంటోంది. బాబుకు వ్య‌తిరేకంగా ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన కొంద‌రు నేత‌లు ఇప్పుడు నంద్యాల‌కు క్యూ క‌ట్టారు. అక్క‌డ బాబును ఏకేయ‌డంతోపాటు.. విప‌క్షానికి బ‌లం చేకూరేలా వాళ్లు పెద్ద ఎత్తున స్కెచ్ సిద్ధం చేశారు. దీంతో నంద్యాల రాజ‌కీయ ఈక్వేష‌న్స్ ఎప్పుడెలా మారిపోతాయో చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. విష‌యంలోకి వెళ్తే.. నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఏర్ప‌డ్డ ఖాళీని తాము కైవ‌సం చేసుకుంటామంటే తామేన‌ని […]

ఆ మంత్రి బెదిరింపుల‌తో చంద్ర‌బాబుకు టెన్ష‌నే..టెన్ష‌న్‌

క‌డప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు అధికార పార్టీ నేత‌లు అధినేత చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించారు. మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి నుంచి ఎమ్మెల్సీ.. రామ‌సుబ్బారెడ్డి వ‌ర‌కు అంద‌రూ బాబును బెదిరించేవారే అయిపోయారు. దీంతో ఇప్పుడు జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయాలంటేనే బాబుకు ఒకింత కంప‌రంగా మారాయ‌ట‌. అయినా కూడా పార్టీని నిల‌బెట్టుకునేందుకు ఆయ‌న శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నార‌ట‌. విష‌యంలోకి వెళ్తే.. జ‌మ్మ‌ల‌మ‌డుగు.. ఒక‌ప్పుడు వైసీపీకి పెట్ట‌నికోట‌. అయితే, అనూహ్యంగా చంద్ర‌బాబు దృష్టి క‌డ‌ప జిల్లాపై ప‌డింది. వైసీపీకి కంచుకోట‌గా ఉండే ఈ […]

కాకినాడ‌లో టీడీపీ దెబ్బ‌తో బీజేపీకి దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌ప‌డుతోందా..

చంద్ర‌బాబు పార్టీ టీడీపీ.. తాజాగా త‌న మిత్ర‌ప‌క్షం, 2014లో ఏపీలో తాను అధికారంలోకి వ‌చ్చేందుకు దోహ‌ద‌ప‌డిన బీజేపీకి ఝ‌ల‌క్ ఇచ్చింది. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో తమ‌కు పెద్ద పీట వేస్తుంద‌ని, మిత్రం ప‌క్షం కాబ‌ట్టి టీడీపీ త‌మ‌ను నెత్తిన పెట్టుకుంటుంద‌ని భావించిన బీజేపీకి ఒక్క‌సారిగా షాక్ త‌గిలింది. తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌లో దాదాపు ఏడేళ్ల త‌ర్వాత కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. ఇక్క‌డి మొత్తం 50 స్థానాల్లో 48 స్థానాల‌కు ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో […]

కేంద్ర నిఘా సంస్థ‌ల నివేదిక‌లో నంద్యాల‌లో వైసీపీ మెజార్టీ లెక్క ఇదే

నంద్యాల.. నంద్యాల‌.. నంద్యాల‌..! క‌ర్నూలు జిల్లాలోని ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌పై ఇప్పుడు అంద‌రి దృష్టీ ప‌డింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇక్క‌డ అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు ఎవ‌రికి వారు త‌మ‌దే విజ‌యం అంటే త‌మ‌దేన‌ని, త‌మ‌దే భారీ మెజారిటీ అంటే .. కాదు త‌మ‌దేన‌ని ఒక‌రికొక‌రు లెక్క‌లు వేసుకుంటున్నారు. అంతేకాదు, విజ‌యంపై గ‌ట్టి ధీమాగా కూడా ఉన్నారు. ఎవ‌రికి వారు […]