పురందేశ్వ‌రిపై కుట్ర వెన‌క ఆ ఇద్ద‌రు..!

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏపీలో ఎదిగేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఆ పార్టీని ఆద‌రించేందుకు ఏపీ ప్ర‌జ‌లు ఎంత‌మాత్రం సిద్ధంగా లేరు. ఏపీలో ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో టీడీపీతోనో లేదా వైసీపీతోనో పొత్తు లేకుండా బీజేపీ వార్డు మెంబ‌ర్ సీటు కూడా సొంతంగా గెల‌వ‌లేదు. అది ఇక్క‌డ బీజేపీ స‌త్తా. ప్ర‌స్తుతం టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ రాజ‌కీయ స్వ‌లాభం కోసం అటు వైసీపీతో అయినా క‌లిసి వెళ్లేందుకు సిద్ధ‌మ‌న్న సంకేతాలు ఇస్తూ డ‌బుల్ గేమ్ ఆడుతోంది. […]

ఏబీఎన్‌కు జ్ఞానం ఉందా… నంద్యాల‌లో బ‌తికున్న అధికారిని చంపేసింది

నంద్యాల- ఈ పేరు చెబితేనే చాలు రాష్ట్రంలోని ఓ మీడియా వ‌ర్గానికి ఎక్క‌డాలేని ఉలుకొచ్చేస్తోంద‌ట‌! అక్క‌డి వార్త‌ల‌ను క‌వ‌ర్ చేయ‌డం, ప్ర‌సారం చేయ‌డంలోనూ ఇలానే దుందుడుకు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోందట‌. ముఖ్యంగా ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రారంభానికి ముందే ఈ మీడియా.. చాలా దుందుడుకు క‌థ‌నాలు ప్లే చేస్తోంద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక్క‌డ భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఎన్నిక‌లు రావ‌డం, వైసీపీ కూడా బ‌రిలో నిల‌బ‌డ‌డంతో టీడీపీని స‌మ‌ర్ధించే ఏబీఎన్ చానెల్‌కు ఒక్క‌సారిగా టెన్ష‌న్‌తో కూడిన […]

నంద్యాల‌లో వైసీపీ గెలుపు ఆశ‌లు ఇవే

అవును! ఇప్పుడు ఆపార్టీ నంద్యాల ఉప పోరులో గ్రామాల‌పైనే ఆశ‌లు పెట్టుకుంది. ముఖ్యంగా గోస్పాడు వంటి అతి పెద్ద గ్రామాల‌ను టార్గెట్ చేసుకుని ఆ పార్టీ దూసుకుపోయింది. అదేవిధంగా జ‌గ‌న్ కూడా గ్రామాల్లోనే ప‌ర్య‌ట‌న ఎక్కువ‌గా చేశాడు. దీంతో జ‌గ‌న్ స‌హా అంద‌రూ ఇప్పుడు ఓటింగ్ స‌ర‌ళిపై చ‌ర్చిస్తూ.. త‌మ‌ను దీవించేదీ, అధికారం అప్ప‌గించేదీ ఒక్క గ్రామాలేన‌ని స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చారు. ప‌ట్ట‌ణంలో ఎలాగూ టీడీపీ హావా స‌హా.. ప్ర‌భుత్వ అభివృద్ధి అజెండా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో ప‌ట్ట‌ణ […]

బ్రేకింగ్‌: న‌ంద్యాల‌లో శిల్పాపై కాల్పులు

గ‌త నెల‌రోజులుగా ప్ర‌చారంతో హోరెత్తిన క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో పోలింగ్ జ‌ర‌గ‌డంతో అక్క‌డ ప్ర‌స్తుతం ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొంది. పోలింగ్ జ‌రిగిన మ‌రుస‌టి రోజే అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప‌ట్ట‌ణంలోని సూర‌జ్ గ్రాండ్ హోట‌ల్ వ‌ద్ద వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డిపై టీడీపీ వ‌ర్గీయులు కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. మైనార్టీ నేత చింపింగ్‌ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన శిల్పా చక్రపాణిరెడ్డిపై సూరజ్‌ గ్రౌండ్‌ హోటల్‌ వద్ద ఈ కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకుంది. […]

నంద్యాల‌లో ఆ ఓటింగ్ సానుభూతికా… వ‌్య‌తిరేకానికా..!

నంద్యాల‌లో పోలింగ్ ముగిసింది. ఓట‌రు తీర్పు ఎలా ఉంటుందో ?  ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. సాధార‌ణంగా ఉప ఎన్నిక అంటే ఓట‌ర్లు పెద్ద ఇంట్ర‌స్ట్ చూప‌రు. ఎవ‌రి ప‌నుల్లో వారు నిమ‌గ్నమైపోతారు. అయితే నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ మాత్రం సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా జ‌రిగింది. 80 శాతానికి కాస్త అటూ ఇటూగా పోలింగ్ న‌మోదైంది. ఓవ‌రాల్‌గా 79.20 శాతం పోలింగ్ జ‌రిగింది. 2014లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో 72.09 శాతం ఓటింగ్ న‌మోదు అయితే […]

సీమ పౌరుషం కోసం వైసీపీని గెలిపిస్తారా..!

రాయ‌ల‌సీమ వాసుల‌కు పౌరుషం ఎక్క‌వ‌… సీమ పౌరుషం సీమ‌వాళ్ల‌కు బాగా తెలిసినా మిగిలిన ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్ర‌జ‌లు సీమ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాల్లో చూశారు. అక్క‌డ పంతాల‌కు, పౌరుషాల‌కు, ప‌గ‌ల‌కు ప‌ట్టింపులు ఎక్కువ‌. ముఖ్యంగా ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టుపెట్టి బ‌తికేందుకు వారు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. సీమ‌లో చిత్తూరు మిన‌హా క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో ఈ త‌ర‌హా సంస్కృతి ఎక్కువ‌. న‌మ్ముకున్న వాళ్ల కోసం వారు ఎంత‌కైనా వెళ‌తారు. దేనికైనా తెగిస్తారు. తాజాగా జ‌రిగిన నంద్యాల ఉప […]

ఏపీ మంత్రి గంటాకు నాన్ బెయిలబుల్ వారెంట్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. గంటా 2009 ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారనే కేసులో అనకాపల్లి రెండో అదనపు సివిల్‌ కోర్డు జడ్జి మంత్రికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేశారు. 2004 ఎన్నిక‌ల్లో చోడ‌వ‌రం నుంచి టీడీపీ త‌ర‌పున గెలిచిన ఆయ‌న 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీలోకి జంప్ చేసి అన‌కాప‌ల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. […]

పార్టీ మార‌డంపై కామినేని ఒక్క‌సారిగా బర‌స్ట్

బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస‌రావుపై గ‌త కొంత కాలంగా ఆయ‌న పార్టీ మార‌తాడ‌ని, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగుతాడ‌ని, అందుకే ఏపీలో బీజేపీ ఏమైపోయినా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పుమ‌న్నాయి. అంతేకాదు, ఇటీవ‌ల కాలంలో కొన్ని మీడియాల్లో అయితే, కామినేని చూపు టీడీపీ వైపు అంటూ క‌థ‌నాలు వ‌చ్చేశాయి. ఈ జోరు రోజు రోజుకు పెరుగుతుండ‌డంతో త‌ట్టుకోలేక పోయారో ఏమో .. […]

కేసీఆర్ మాట లెక్క‌చేయంది వీళ్లే..!

తెలంగాణలో త‌నకు ఎదురు లేద‌ని భావిస్తున్న టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌కు ఇంటి పోరు ఎక్కువైంద‌ట‌! త‌న సొంత పార్టీలోనే ఎవ‌రూ త‌న‌ను లెక్క‌చేయడం లేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా త‌న రాజ‌కీయ భిక్ష‌తో ప‌ద‌వులు అనుభ‌విస్తున్న హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌లోని కార్పొరేట‌ర్లే. త‌న‌ను లెక్క‌చేయ‌క‌పోవ‌డంపై కేసీఆర్ తీవ్రంగా మ‌థ‌న ప‌డిపోతున్నార‌ని స‌మాచారం. కార్పొరేట‌ర్లు.. ఎవ‌రికి వారే త‌మ ఇష్టానుసారం నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, గులాబీ బాస్ చెప్పిన మాట‌లు పెడ‌చెవిన పెడుతుండ‌డంపై ఇటీవ‌ల కాలంలో పెద్ద […]