ఎవరెన్ని అనుకున్నా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన మంచి మంచి అవగాహన ఉంది. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మంచి దోస్తులే అన్నది కనీస రాజకీయ అవగాహన ఉన్నవారికి ఎవరికి అయినా అర్థమవుతుంది. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టిన పవన్‌కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు లాంటి సమర్థ నాయకత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీకి సపోర్ట్ చేశాడు. ఇక 2019 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పవన్ ఇప్పటికే ప్రకటించారు. తాను […]
Category: Politics
అఖిలప్రియకు చంద్రబాబు షాక్
ఏపీ పాలిటిక్స్ మాంచి రసకందాయంలో పడ్డాయి. అటు విపక్ష వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతుంటే ఇటు అధికారంలో ఉన్న టీడీపీలో కూడా వచ్చే ఎన్నికల వరకు ఎవరికి ఎప్పుడు ఏ షాక్ తగులుతుందో ? చెప్పలేం అన్నట్టుగా పరిస్థితి మారింది. కొద్ది నెలల క్రితం మంత్రివర్గ ప్రక్షాళనలో కొందరు మంత్రులకు షాక్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి ప్రక్షాళనకు దిగనున్నారన్న వార్తలు ఏపీ టీడీపీ వర్గాల్లో జోరుగా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ యేడాది ఆరంభంలో […]
ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అవుటా… అసలేం జరిగింది..!
కాపు ఉద్యమ ప్రభావం నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉంటుందని భావించినా.. వారంతా టీడీపీకి పట్టం కట్టారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు ఇచ్చిన హామీలో భాగంగా.. వారి అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేశారు. ఆశించిన స్థాయిలో లక్ష్యాలు అందుకునేలా చేయడంలో కార్పొరేషన్ విఫలమైంది. దీంతో పాటు ఈ కార్పొరేషన్‌లో అవకతవకలు కూడా చోటు చేసుకుంటుండటంతో దీని ప్రక్షాళనపై సీఎం దృష్టిసారించారు. కీలకమైన కాపు కార్పొరేషన్ చైర్మన్ […]
వైసీపీ ఎమ్మెల్యేకు కొడుకే షాక్ ఇచ్చాడుగా..!
ఏపీలో విపక్ష వైసీపీకి చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యేకు సొంత కొడుకే షాక్ ఇచ్చాడు. కృష్ణా జిల్లా నూజివీడు వైసీపీ ఎమ్మెల్యేగా మేకా ప్రతాప్ అప్పారావు ఉన్నారు. 2014 మునిసిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 30 వార్డుల్లో 22 వార్డులు వైసీపీ గెలుచుకుని మునిసిపాలిటీ కైవసం చేసుకుంది. అప్పుడు చైర్మన్ పదవి కోసం రెండు వర్గాలు పోటీపడ్డాయి. మాజీ చైర్మన్ బసవా భాస్కరరావు వర్గం నుంచి ఆయన భార్య బసవా రేవతికి ముందుగా చైర్మన్ సీటు ఇచ్చారు. ముందు […]
టీడీపీలోకి మాజీ సీఎం తమ్ముడు…. చంద్రబాబు రెండు ఆఫర్లు..!
సమైక్యాంధ్రప్రదేశ్‌కు చివరి సీఎంగా పనిచేసిన మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. కిరణ్ పొలిటికల్ రీ ఎంట్రీ బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌తో ఉంటుందని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు, ఆయన సొంత నియోజకవర్గం పీలేరులో గట్టి పట్టున్న నల్లారికిషోర్‌కుమార్ రెడ్డి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. నల్లారి కుటుంబానికి చిత్తూరు జిల్లా పీలేరులో గట్టి పట్టుంది. […]
ఐవైఆర్ ఈ కుప్పిగంతులేంటి…!
ఐవైఆర్ కృష్ణారావు. విభజన తర్వాత ఏపీ ప్రభుత్వానికి తొలి ప్రధాన కార్యదర్శి. దాదాపు రెండున్నరేళ్లపాటు ఆయన ఏపీకి సేవలందించారు. ఆయనంటే అటు ప్రభుత్వంలోనూ, ఇటు మంత్రుల్లోనూ గౌరవం ఉంది. చాలా సీనియర్ అధికారిగా, విచక్షణ ఉన్న అధికారిగా కూడా ఆయనకు మంచి మార్కులు ఉన్నాయి. అందుకే చంద్రబాబు ఆయనను రిటైర్ అయిన తర్వాత కూడా వినియోగించుకోవాలని భావించారు. అంతేకాదు, ఆయన సూచనల మేరకు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి దేశ చరిత్రలో ఇప్పటి వరకు లేని కొత్త […]
ఏపీలో పురందేశ్వరి స్టార్ట్ చేసిన కొత్త ఆపరేషన్
పాలిటిక్స్‌లో నేతలు అడుగు తీసి అడుగు వేశారంటే.. ప్రయోజనం లేకుండా జరగదు! అదే సీనియర్ నేతలు పర్యటనలు, ప్రదర్శనలు చేశారంటే..దాని వెనుక పరమార్థం, ప్రయోజనం పుష్కలంగా ఉండి తీరుతుంది. ఇప్పుడు ఈ రెండింటినీ ఆశించే బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి, ప్రకాశం జిల్లాకు చెందిన అన్నగారి కూతురు దగ్గుబాటి పురందేశ్వరి.. తొలిసారి రాయలసీమలో పర్యటించారు. రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ప్రవేశించి దాదాపు 9 ఏళ్లు పూర్తవుతున్నా.. ఇప్పుడే ఆమె సీమలో పర్యటించడం, సీమ వాసులకు నీళ్లందడం […]
ఏపీలో బాబు టీం మారుతోందా? ఉండే దెవరు? పోయే దెవరు?
అవును! అమరావతిలో ఈ చర్చ సాగుతోంది! అయితే, అతి రహస్యంగా మాత్రమే. దీనికి ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గ మార్పులే ప్రామాణికమని తెలుస్తోంది. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన ముద్ర పడేలా ప్రధాని నరేంద్ర మోడీ తన టీంను మార్చుకున్నారు. కీలకమైన పదవులను సైతం సామాన్యులకు అప్పగించగలనని, తనకు సామర్థ్యమే ప్రధానమని ఆయన రక్షణ శాఖ విషయంలో నిర్మలను నియమించడం ద్వారా నిరూపించేశారు. అదేవిధంగా ఇప్పుడు ఏపీలోనూ చంద్రబాబు ఆదిశగానే అడుగులు వేయాలని డిసైడ్ […]
టీటీడీ కొత్త చైర్మన్ ఎంపిక వెనక పెద్ద కథే ఉందా..!
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ తిరుమల వేంకటేశ్వరుని దేవస్థానం టీటీడీ ట్రస్టు బోర్డులో సభ్యత్వం వస్తే చాలు అనుకునేవారు ఎంతో మంది ఉన్నారు. ఈ సభ్యత్వం కోసం తమ సర్వస్వం ధార పోసేవారూ ఉన్నారు. ఇక, ఈ బోర్డు చైర్మన్ పదవి అంటే ఇంకెంత రేంజ్ ఉంటుందో ఆలోచించాలి. అందుకే కాబోలు.. 2014లో ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చి ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎంపీ సీటును సైతం ఈ చైర్మన్‌గిరీ కోసం తృణప్రాయంగా వదులుకుంటానని, బాబు టీటీడీ చైర్మన్ […]