తెలుగు దేశం పార్టీ విషయంలో రాష్ట్ర బీజేపీ అనుసరిస్తున్న వైఖరి స్పష్టంగానే ఉంది. ఇక్కడి నాయకు లు.. టీడీపీని ససేమిరా ఒప్పుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో తాము జనసేనతోనే కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారు. నిజానికి ఇలా చేసుకునే గత ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయా మనే వాదన బీజేపీలో ఉంది. ఈ పరిస్థితిని అధిగమించి.. బయటకు వచ్చేందుకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని.. కొందరు చెబుతున్నారు. ఇక, బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము మాత్రం.. […]
Category: Politics
పవన్ చక్రం తిప్పుతున్నారా.. మారుతున్న పరిణామాలపై వైసీపీ డేగకన్ను..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీకి వస్తున్నారు.. ఇది వైసీపీకి ఆనందకర పరిణామం. ఎందుకంటే.. ఆయన నోటి నుంచి ఇక్కడి ప్రభుత్వాన్ని పొగిడించుకునేందుకు ఇప్పటికే ఢిల్లీస్థాయిలో వైసీపీ నాయకులు చక్రం తిప్పారని తెలుస్తోంది. అయితే.. అదేసమయంలో బీజేపీ.. వైసీపీ ప్రధాన ప్రత్యర్థి పార్టీ టీడీపీకి చేరువ అవుతోంది. ఇది భారీ ఎత్తున వైసీపీని కలవరపెడుతున్న అంశం. ఎందుకంటే.. ఏది జరగకూడదని.. వైసీపీ భావించిందో అదే జరుగుతోందికాబట్టి!! వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా గెలవాలంటే.. 2019 ఎన్నికల్లో జరిగినట్టుగా.. […]
బాబు ఓటమి అంత ఈజీనా.. వైసీపీ నయా స్ట్రాటజీ ఇదే…!
టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ఏమనుకుంటోంది? ఆయనను ఎంత తక్కువగా అంచనా వేస్తోం ది? ఇవీ… ఇప్పుడు తెరమీదికి వచ్చిన ప్రశ్నలు. ఎందుకంటే.. చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ వ్యూ హాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆయనను ఎట్టిప రిస్థితిలోనూ ఓడించి తీరుతామని.. వైసీపీ నాయకులు శపథం చేస్తున్నారు. చేశారు కూడా. ఈ క్రమంలోనే చంద్రబాబుపై పోటీ చేసేందుకు నాయకుడికోసం వైసీపీ అధిష్టానం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఎవరిని వెతికినా.. ఎక్కడ నుంచి తీసుకువచ్చి పెట్టినా.. చంద్రబాబు ఓడించడం వైసీపీకి […]
పీవీ విషయంలో ఎన్టీఆర్ నిర్ణయం… ఎప్పటకీ షాకింగ్ డెసిషనే..!
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ముందుకు సాగిన అన్నగారు నందమూరి తారకరామారావు.. ఇటు సినిమాల పరంగానే కాదు.. అటు రాజకీయంగా కూడా తనదైన శైలిలో ముందుకు సాగారు. ప్రతి అవకా శాన్నీ తెలుగు వారి కోణంలోనే చూశారు. ముఖ్యంగా ఆయనకు సాహిత్య అభిమానులు అన్నా.. రచయిత లు అన్నా.. ఎనలేని మక్కువ. ఎప్పుడు అవకాశం వచ్చినా..ఆయన తన అభిమానాన్ని చాటుకునేవారు. ఇలాంటి పరిణామమే ఒకసారి వచ్చింది. అదే.. ప్రముఖ రచయిత.. రాజకీయ దురంధరుడు పీవీ నరసింహారావు.. ప్రధాని […]
ఆత్మకూరు ఫలితం.. విపక్షాలు ఏం చేస్తాయ్..!
తాజాగా జరిగిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక రెండు కీలక విషయాలను తెరమీదికి తెచ్చింది. ఒకటి.. మూడేళ్ల జగన్ పరిపాలన తర్వాత.. వచ్చిన తొలి ఎన్నిక.(ఉప ఎన్నికే అయినా ) రెండు.. ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా ఉండడం. ఈ రెండు విషయాలను అధికార పార్టీ తనకు గొప్పగా ప్రచారం చేసుకోవడం.. మామూలే. తమ పథకాలే ఇంత మెజారిటీ వచ్చేలా చేశాయని.. జగన్‌కు అనుకూలంగా ప్రజలు ఉన్నారని.. పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటారు. […]
ఆత్మకూరులో అసలేం జరిగింది.. సీఎం జగన్ సీరియస్..
కొన్ని కొన్ని ఫలితాలు.. పార్టీలను, నేతలను కూడా ఇబ్బందిలోకి నెడుతుంటాయి. పైకి ఎంతో బాగుందని అనుకున్నా.. లోలోన మాత్రం అంతర్మథనం తప్పదు. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీలోనూ ఇదే జరుగు తోంది. దీనికి కారణం.. తాజాగా వచ్చిన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం. ఇక్కడ జరిగినన ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ గెలుపై వైసీపీ ఆశించినట్టుగా జరగలేదు. అందుకే ఎక్కడా హంగామా కనిపించలేదు. కనీసం.. టపాసులు […]
గుడివాడపై చంద్రబాబు గురి.. నయా స్కెచ్…!
అత్యంత కీలకమైన నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడపై చంద్రబాబు తనదైన ముద్ర వేస్తారా? ఇక్కడ టీడీపీకి ఆయన ప్రాణం పోస్తారా? ఇదీ.. ఇప్పుడు టీడీపీలో జరుగుతున్న ఆసక్తికర చర్చ. ఎందుకంటే.. త్వరలోనే చంద్రబాబు ఇక్కడ పర్యటించనున్నారు. మరో రెండు రోజుల్లోనే ఆయన ఇక్కడ జిల్లాలో యాత్ర పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే గుడివాడ నియోజకవర్గంలో ఆయన మినీ మహానాడును నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే.. నిత్యంచంద్రబాబును తిట్టిపోయడం.. టీడీపీని తిట్టిపోయడమే పనిగా […]
విజయవాడలో టీడీపీ, వైసీపీకి చెక్ పెడుతోన్న ఇద్దరు జనసేన నేతలు…!
విజయవాడలో మూడో పార్టీ దూకుడు పెరిగింది. ఇప్పటి వరకు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్న వైసీపీ, టీడీపీలకు ఇప్పుడు పోటీగా జనసేన తెరమీదికి వస్తోంది. ఇక్కడ నుంచి యువ నాయకులుగా .. ఇద్దరు కీలక వ్యక్తులు జనసేన తరఫున బాణిని వినిపిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా మేమున్నామంటూ.. వారు ముందుకు వస్తున్నారు. దీంతో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీ యాల్లో ఇప్పుడు జనసేన కూడా చేరడం గమనార్హం. వారే.. పోతిన మహేష్, సోడిశెట్టి రాధా. ఈ ఇద్దరు […]
ఆ రెండు జిల్లాల్లోనూ టీడీపీ టెన్షన్ పడుతోందా..?
జిల్లాల వారీగా చూసుకుంటే.. టీడీపీకి బలమైన కేడర్ ఉంది. నాయకులు కూడా ఉన్నారు. ఏ నియోజకవ ర్గాన్ని చూసుకున్నా.. దాదాపు అన్ని చోట్ల కూడా నాయకులు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజ యం లక్ష్యంగా దూసుకుపోయేందుకు ఎవరికి వారు వ్యక్తిగత ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. గుంటూరు, కృష్ణా జిల్లాల విషయంపై టీడీపీ టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ రెండు జిల్లాలు కూడా పార్టీకి అత్యంత ముఖ్యం. అయితే.. ఈ రెండు […]









