రాపాకకు సరైన ప్రత్యర్ధి?

ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి జంప్ చేసే నాయకులని ప్రజలు ఆదరించే రోజులు పోయాయి. గత ఎన్నికల్లోనే ఈ విషయం రుజువైంది..వైసీపీ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే…అలాగే కొందరు మంత్రులు కూడా అయ్యారు. అలా అనైతికంగా గెలిచి పార్టీలు మారిన వారిని ప్రజలు తిరస్కరించారు. రానున్న రోజుల్లో జంపింగులని ఆదరించమని ఆ ఎన్నికల్లోనే ప్రజలు రుజువు చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా జంపింగులని ప్రజలు ఆదరించే పరిస్తితి కనిపించడం […]

కోమటిరెడ్డి..బలాలు…బలహీనతలు?

చాలాకాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ బీజేపీకి మద్ధతుగా మాట్లాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే స్పీకర్ కు రాజీనామా లేఖని అందించడం…వెంటనే స్పీకర్ రాజీనామాని ఆమోదించడం జరిగిపోయాయి.  దీంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమకంటూ సెపరేట్ వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. కాసేపు ఆ రెండు పార్టీల గురించి పక్కన పెడితే…అసలు బీజేపీ నుంచి బరిలో […]

గోరంట్ల మ్యాటర్ డైవర్ట్?

ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతుంది…ఆ వీడియో వ్యవహారం కాస్త ఇప్పుడు రెండు కులాల మధ్య చిచ్చు రాజేసే పరిస్తితికి వచ్చింది. అదే సమయంలో 2015లో తెలంగాణలో జరిగిన ఓటుకు నోటు కేసు తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు వీడియో నిజమో కాదో తెలిస్తే సరిపోతుంది…అప్పుడు దాని బట్టి చర్యలు తీసుకోవచ్చు..అలా కాకుండా రెండు కులాల మధ్య రచ్చ ఎందుకు జరుగుతుంది..అసలు సంబంధం లేకుండా ఓటుకు […]

బీజేపీతో బాబు..సజ్జల నిజాలు?

2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు..బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఎన్నికల ముందు వరకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన బాబు…ఎన్నికల్లో ఓడిపోయాక పూర్తిగా సైలెంట్ అయ్యారు. బీజేపీని ఒక్క మాట కూడా అనడం లేదు…అలాగే తమ సన్నిహితులు బీజేపీలోకి వెళ్ళినా సరే స్పందించలేదు. అసలు వారిని బాబే…బీజేపీలోకి పంపారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏదొక విధంగా బీజేపీకి బాబు మద్ధతు ఇస్తూనే వచ్చారు. ఇక చివరికి మోదీని కలిసే అవకాశం […]

దగ్గుబాటి వారసుడు మళ్ళీ దూరమేనా?

ఏపీలో వారసత్వ రాజకీయాలు కొత్త కాదనే చెప్పాలి…అసలు ఏపీలో ఎక్కువ నడిచేది వారసత్వ రాజకీయమే..ఎవరికి వారు తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి…సక్సెస్ చేయాలని సీనియర్ నేతలు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు. ఇప్పటికే పలువురు నేతల వారసులు రాజకీయాల్లోకి సక్సెస్ అయ్యారు…మరికొందరు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు వారసుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ భవిష్యత్తుపై క్లారిటీ రావడం లేదు. ఏపీ రాజకీయాల్లో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ […]

ఆనంకు నేదురుమల్లి చెక్?

ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడుగా ఉన్న ఆనం రామ్ నారాయణరెడ్డి రాజకీయ భవిష్యత్ పై క్లారిటీ మిస్ అవుతుంది…ఆయనకు నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ నుంచి సీటు వస్తుందా? లేక ఆయన వైసీపీ వదిలి వెళ్లిపోతారా? అనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. అసలు సీనియర్ నాయకుడు..ఆయనకు సీటు గురించి డౌట్ ఏంటి అని అంతా అనుకోవచ్చు. అలా డౌట్లు పెరగడానికి కారణం కూడా ఆయనే అని చెప్పొచ్చు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం […]

ఆ యువ ఎమ్మెల్యేకు సీనియర్ టెన్షన్?

అధికార వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే…చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలకు ఒకరంటే ఒకరికి పడని పరిస్తితి. ఎవరికి వారు చెక్ పెట్టాలని చెప్పి రాజకీయం చేస్తున్నారు. కొన్నిచోట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేల విధానాలు నచ్చాక చాలామంది వైసీపీ నేతలు తిరుగుబాటు చేసే పరిస్తితి. అలాగే కొన్ని చోట్ల సీటు విషయంలో నేతల మధ్య రచ్చ జరుగుతుంది. ఇదే క్రమంలో పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ యువ ఎమ్మెల్యే అదీప్ రాజ్ కు ఓ […]

కన్ఫ్యూజ్ చేస్తున్న కేశినేని.. !

తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారంపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే…సొంత పార్టీపైనే తిరుగుబాటు జెండా ఎగరవేసిన నాని వైఖరిపై అసలు క్లారిటీ రావడం లేదు..ఒకోసారి పార్టీని తిడతారు…మరొకసారి పార్టీతో కలిసి పనిచేస్తారు…అసలు ఆయన పార్టీలో ఉంటారా? వెళ్లిపోతారా? అనేది ఏ మాత్రం తెలియడం లేదు. ఆ మధ్య సొంత తమ్ముడు కేశినేని శివనాథ్ టార్గెట్ గా కూడా కేశినేని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ పార్టీతో సఖ్యతగానే ఉంటున్నారు..పైగా […]

క్యాస్ట్ పాలిటిక్స్: గోరంట్లకు సపోర్ట్?

ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మధ్య న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియో వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి..ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా…న్యూట్రల్ వర్గాల నుంచి సైతం..వైసీపీ ఎంపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ వీడియోని మార్ఫింగ్ చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, దీని వెనుక టీడీపీ నేతలు ఉన్నారని మాధవ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో వీడియో వ్యవహారంలో తప్పు ఉందని తేలితే…మాధవ్ […]