జగన్…చంద్రబాబు కంచుకోట కుప్పంని వదిలేలా లేరు. ఎలాగైనా ఈ సారి అక్కడ ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గానే వైసీపీ రాజకీయం ఉంది. ఈ స్థానంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అక్కడ చంద్రబాబు బలం తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో అక్కడ బలమైన టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలని వైసీపీలోకి తీసుకొచ్చారు. కార్యకర్తలని లాగేశారు. ఇక పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ […]
Category: Politics
రాజధాని రిస్క్..జగన్ తగ్గించుకుంటారా?
నూటికి 95 శాతంపైనే హామీలు అమలు చేశాం…జనాలకు చాలా చేశాం..ఇంకా తమకు తిరుగులేదు..నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ప్రజలు తమకు మద్ధతుగా నిలుస్తారని..సంక్షేమమే తమని గెలిపిస్తుందనే ధీమా వైసీపీలో ఉంది. అవును నిజమే సంక్షేమ పథకాలని అద్భుతంగా అమలు చేశారు. మరి ప్రజలు కేవలం సంక్షేమం మాత్రమే చూసి ఓటేస్తారా? ఇంకా వేరే సమస్యలు, అభివృద్ధి, రాజధాని..ఇలా ఏ అంశాన్ని ప్రజలు పట్టించుకోరా? అంటే ప్రజలు అన్నీ పట్టించుకుంటారు…సమయం చూసి వారి తీర్పుని ఇస్తారు. కాబట్టి వైసీపీ అన్నీ […]
కొడాలి నాని కోసం పని చేస్తోన్న టీడీపీ కోవర్టులు ఎవరు…!
రాజకీయాల్లో కోవర్టులు కామన్. అయితే.. ఇది ఎంత వరకు? దీనికి హద్దు పద్దు ఉండదా? కనీసం.. పార్టీ ఉప్పు తింటున్నాం.. అనే కనీస ఆలోచన కూడా ఉండదా? అంటే.. ఉండదనే అంటున్నారు గుడివాడ టీడీపీ నాయకుల గురించి తెలిసిన వారు. ఇది ముమ్మాటికీ నిజం! గుడివాడ ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కాదు కాదు.. ఇప్పటికీ కంచుకోటే! కానీ, ఇక్కడ పార్టీ మాత్రం.. వరుస పరాజయాలతో ముందుకు సాగుతోం ది. దీనికి కారణం ఏంటి? ఒకప్పుడు అన్నగారు ఎన్టీఆర్‌ను […]
రజిని స్టార్ట్…పేటలో పొజిషన్ ఏంటో?
నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి…ప్రజలకు సేవ చేయాలసిన ప్రజా ప్రతినిధులు..పూర్తిగా ప్రత్యర్ధులని తిట్టడంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా మంత్రులు…అసలు మంత్రులు అంటే తమ తమ శాఖలకు సంబంధించి బాధ్యతలని సక్రమంగా నిర్వహించి…ప్రజలకు సేవ చేయాలి. కానీ ఇప్పుడు మంత్రులు అర్ధం మారిపోయింది…కేవలం ప్రతిపక్ష పార్టీలని తిట్టడానికే మంత్రులు అన్నట్లు ఉంది. గతంలో చంద్రబాబు హయాంలో ఇదే జరిగింది…ఇప్పుడు జగన్ హయాంలో అంతకుమించి జరుగుతుంది. రాష్ట్రంలో 25 మంత్రులు ఉన్నారు…కానీ విచిత్రమైన విషయం ఏంటంటే కొందరు మంత్రులు […]
ఎంపీ కోటగిరితో ఎమ్మెల్యే ఎలీజా రాజీ ఫార్ములా…!
ఏలూరు జిల్లా చింతలపూడి రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైసీపీలో గ్రూపుల గోల గత రెండున్నర సంవత్సరాలగా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. స్థానిక ఎమ్మెల్యే ఎలిజాకు ఇదే నియోజకవర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ వస్తోంది. చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు కీలక పంచాయతీలలో అధికార పార్టీలోనే ఉండి కూడా ఈ రెండు గ్రూపులు వేరువేరుగా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. ఓవైపు పార్టీ నష్టపోతున్న ఆధిపత్య […]
అక్కడ మళ్ళీ డిపాజిట్ గల్లంతే?
గత ఎన్నికల మాదిరిగానే …ఈ సారి ఎన్నికల్లో కూడా ఓ నియోజకవర్గంలో టీడీపీకి మళ్ళీ డిపాజిట్ రావడం కష్టమేనా? గెలుపు మాట పక్కన పెడితే..డిపాజిట్ తెచ్చుకోవడం కూడా కష్టమవుతుందా? అంటే ఈ సారి ఆ పరిస్తితి మళ్ళీ రాకపోవచ్చు గాని..గెలుపు మాత్రం కష్టమని తెలుస్తోంది. ఇంతకీ టీడీపీ డిపాజిట్ కోల్పోయిన స్థానం ఏది…మళ్ళీ గెలుపు ఛాన్స్ లేని స్థానం ఏది అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అరకు స్థానం. గిరిజన ప్రాంతంలో ఉన్న అరకు స్థానంలో టీడీపీకి […]
ఎంపీ స్థానాల్లో లీడ్ మారిపోయింది..!
రాష్ట్రంలో ఎక్కడకక్కడ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఉన్న పరిస్తితులు…ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ప్రతి చోటా వైసీపీ హవా కనిపించింది. అసెంబ్లీ స్థానలైన, ఎంపీ స్థానలైన వైసీపీదే లీడింగ్ అనే పరిస్తితి. అందుకే గత ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు గెలుచుకుంది. మరి అప్పుడు పరిస్తితి ఇప్పుడు ఉందా? అంటే చాలా వరకు ఆ పరిస్తితి మారుతూ వస్తుంది…చాలాచోట్ల వైసీపీకి పోటీగా టీడీపీ పుంజుకుంటుంది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో […]
యాంటీ బీజేపీ: కేసీఆర్‌తో జగన్..?
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చెప్పి తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. తెలంగాణలో బలపడుతున్న బీజేపీకి..కేంద్ర స్థాయిలోనే చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీపై కేసీఆర్ గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం స్థాయిలో కూడా కేసీఆర్…మోదీ సర్కార్‌ని టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఏమో…కేసీఆర్‌ని టార్గెట్ చేసి ముందుకెళుతుంది. అందుకే కేసీఆర్..కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మోదీని గద్దె దింపాలని, బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదం […]
గుడివాడ టీడీపీని లేపుతున్న కొడాలి..?
గుడివాడ అంటే కొడాలి నాని అడ్డా అనే సంగతి తెలిసిందే…అలాగే ఆయన ఫైర్ బ్రాండ్ నాయకుడు అని కూడా తెలుసు…తన మాటలతో టీడీపీపై విరుచుకుపడతారు. అలాగే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబుని దారుణంగా తిట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని మాత్రమే. మరి ఈయన తిట్టడం వల్ల వైసీపీకి ఎంత లాభం జరుగుతుందో తెలియదు గాని…పరోక్షంగా టీడీపీని మాత్రం పైకి లేపుతున్నట్లు కనిపిస్తోంది. అసలు కొడాలి విమర్శలు…కాదు కాదు బూతులు ఏ స్థాయిలో […]