లోకేష్ ‘యువగళం’ రెడీ..టీడీపీకి కలిసొస్తుందా?

మొత్తానికి లోకేష్ యువగళం పాదయాత్రకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి..జనవరి 27 తేదీన ఉదయం 11 గంటలకు కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. పోలీసులు పలు ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో పాదయాత్ర ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే పోలీసుల ఆంక్షలని పట్టించుకోకుండా టి‌డి‌పి శ్రేణులు పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇటు లోకేష్ సైతం అదే దూకుడుతో ముందుకెళుతున్నారు. బుధవారం ఇంటిదగ్గర చంద్రబాబు, భువనేశ్వరి ఆశీర్వాదం తీసుకుని, ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్ళి, ఆ తర్వాత కడపకు వెళ్ళి […]

రాజుగారి సర్వేలు..లగడపాటి కాదు కదా..!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..ఢిల్లీలో ఉంటూ ఏపీలోని అధికార వైసీపీపై ఏ స్థాయిలో ఫైర్ అవుతున్నారో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం అనేక తప్పులు చేస్తుందంటూ విమర్శలు చేస్తున్నారు. తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇక టీడీపీ-జనసేనలకు అనుకూలంగా రఘురామ మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని, ఆ పొత్తులోనే తాను పోటీ చేస్తానని రాజు గారు చెప్పుకొస్తున్నారు. ఇదే క్రమంలో ఎప్పటికప్పుడు తాను సొంతంగా సర్వేలు నిర్వహిస్తున్నానని, ఆ సర్వే వివరాలని […]

గుంటూరు టీడీపీలో కన్ఫ్యూజన్..ఏ సీటు ఎవరికి?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది..వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని టి‌డి‌పి చూస్తుంది. దీంతో గెలుపు కాస్త ఈజీ కావడంతో గుంటూరులో పలు సీట్లకు డిమాండ్ పెరిగింది. సీట్ల కోసం పోటీ పెరిగింది. ఇప్పటికే సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్, తాడికొండ లాంటి సీట్లలో ఇద్దరు, ముగ్గురు నేతలు ఉన్నారు. ఇదే క్రమంలో తన వారసుడుకు సీటు ఇవ్వాలని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ […]

సామినేని వర్సెస్ వెల్లంపల్లి..పెద్ద పంచాయితీ..వైసీపీకి డ్యామేజ్!

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే..చాలా నియోజకవర్గాల్లో సొంత నేతల మధ్య పోరు నడుస్తోంది. సొంత పార్టీ నేతలకే చెక్ పెట్టాలని చెప్పి కొందరు నాయకులు పావులు కదుపుతున్నారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో రచ్చ నడుస్తోంది. తాజాగా విజయవాడ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేల మధ తగాదా సంచలనంగా మారింది. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుల మధ్య గొడవ తారస్థాయిలో జరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరినొకరు బూతులు తిట్టుకునే […]

కలిసొస్తేనే పొత్తులు..ఒంటరిగా వీరమరణం ఉండదా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్..పొత్తులపై ఎప్పటికప్పుడు కొత్తగా స్టేట్‌మెంట్స్ ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఒకోసారి ఒకోలా పొత్తుల గురించి మాట్లాడుతున్నారనే భావన వస్తుంది. ఎందుకంటే పొత్తులపై ఇప్పటికే పలురకాల స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. మొదట నుంచి వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వమనే చెబుతున్నారు. అది జరగాలంటే ఖచ్చితంగా టీడీపీతోనే పొత్తు ఉండాలి..బి‌జే‌పితో పొత్తు ఉన్న ప్రయోజనం ఉండదు. ఆ విషయం పవన్‌కు తెలుసు. ఇక బి‌జే‌పితో పొత్తు ఉందని చెబుతూనే..ఆ పార్టీతో ఇంతవరకు కలిసి ఏ కార్యక్రమం చేయలేదు..అటు బి‌జే‌పి […]

బాబోయ్ ఇవేం రూల్స్..జగన్‌ మాదిరిగానే పాదయాత్ర.!

నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్రకు కఠినమైన ఆంక్షలు విధించారు. ఈ రూల్స్ తో పాదయాత్ర చేయడం కష్టమని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కాళ్ళు కట్టేసి ముందుకెళ్లమని చెబుతున్నట్లుగా పోలీసుల రూల్స్ ఉన్నాయని అంటున్నారు. జనవరి 27 నుంచి కుప్పంలో మొదలుకానున్న లోకేష్ పాదయాత్రకు డి‌జి‌పి పర్మిషన్ ఇచ్చి ఉంటే..రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రూల్ ఉండేది..కానీ ఎక్కడకక్కడ సబ్ డివిజన్ పరిధిలో డి‌ఎస్‌పి ద్వారా పర్మిషన్ తీసుకోవాలి. అంటే ప్రతి […]

జనసేనలోకి కన్నా ఫిక్స్..సీటు పక్కా.!

జనసేనలోకి మాజీ మంత్రి, బి‌జే‌పి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ చేరిక దాదాపు ఖాయమైందని ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆయన బి‌జే‌పిని వీడి జనసేనలో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తోంది. అయితే బి‌జే‌పి-జనసేన పొత్తులో ఉన్నాయి..అలాంటప్పుడు కన్నా జంపింగ్ ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. కానీ ఈ మధ్య కన్నా..సోము వీర్రాజు వైఖరిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు..ఆయనపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఇదే సమయంలో సోము సైతం…కన్నాపై గుర్రుగా […]

చీరాల సీటు కరణం వారసుడుకే..టీడీపీ నిలువరిస్తుందా?

మొత్తానికి చీరాల సీటు విషయంలో దాదాపు క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది..మొన్నటివరకు ఈ సీటు కోసం ఇటు కరణం బలరాం, అటు ఆమంచి కృష్ణ మోహన్‌ల మధ్య పోరు నడిచిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమంచిని పర్చూరు ఇంచార్జ్ గా పంపారు. దీంతో చీరాలలో కరణంకు రూట్ క్లియర్ అయింది. ఈ సీటుని కరణం వారసుడు వెంకటేష్‌కు ఫిక్స్ చేస్తున్నారని తెలిసింది. తాజాగా  వెంకటేష్ పేరును వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బీదా మస్తాన్ రావు ప్రకటించారు. […]

క్యాస్ట్ ఈక్వేషన్స్‌తో వైసీపీ..మరో భారీ స్కెచ్!`

కుల సమీకరణాలని తమకు అనుకూలంగా మార్చుకుని..రాజకీయం చేయడంలో అధికార వైసీపీ టాప్ లో ఉంటుందనే చెప్పాలి. సమయానికి తగినట్లుగా కుల సమీకరణాలతో వైసీపీ రాజకీయం చేస్తుంది. గత ఎన్నికల్లో అదేవిధంగా ప్రతి కులానికి తగ్గట్టుగా రాజకీయం చేసి..దాదాపు అన్నీ కులాల మెజారిటీ ఓట్లని దక్కించుకుని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫార్ములాతో వైసీపీ ముందుకెళుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో అత్యధిక ఓట్లు ఉన్న బీసీ ఓట్లని టార్గెట్ చేసుకుని జయహో బీసీ సభ […]