టిడిపి ఇలాఖాలో అగ్గి రాజేస్తున్న బిజెపి!!

పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి, బిజెపి కూటమి అగ్గి రగులుతోంది. ఈ కూటమి జిల్లా మొత్తాన్ని కైవశం చేసుకున్నా మిత్రుల మధ్యే బేధాభిప్రాయాలు పెరిగి మంత్రి మాణిక్యాలరావు రాజీనామాకు సిద్ధపడే పరిస్థితులకు దారి తీస్తోంది. తాడేపల్లిగూడెం కేంద్రంగా ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాజాగా మరోసారి జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమంటూ తీవ్రస్థాయి నిర్ణయాలకు రెడీ అవుతున్నారు. ఈ […]

చంద్రబాబు కి మెట్రో చీఫ్‌ శ్రీధరన్ షాక్!!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకు గట్టి ఎదురుదెబ్బతాకింది. ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంటానని ఢిల్లీ మెట్రో చీఫ్‌ శ్రీధరన్‌ ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు. అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎంతో చర్చ సాగింది. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై శ్రీధరన్‌ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నిధులు కేటాయించకుండా 2019 నాటికి ప్రాజెక్టును ఎలా పూర్తిచేస్తామని ఆయన ప్రశ్నించారు. ‘ఇప్పటి వరకు సరిగా నిధులు, వసతులు కల్పించలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నట్లు […]

తంతే మెగా కాంపౌండ్ లో పడ్డ హరీష్ శంకర్

మెగా కాంపౌండ్‌లో డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఫుల్‌ బిజీ కానున్నాడట. సాయి ధరమ్‌ తేజ్‌తో ‘సుబ్రహ్మణ్యం పర్‌ సేల్‌’ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు హరీష్‌ శంకర్‌. చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్‌ కావాల్సిన వారిలో హరీష్‌ పేరు కూడా బాగా వినిపించింది. ఇప్పటికి అవకాశం అయితే దక్కలేదు. కానీ చేజారిపోలేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసుకున్నాడు హరీష్‌. ఇదివరకే అల్లు అర్జున్‌తో హరీష్‌ సినిమా చేయాలనుకున్నాడు కానీ కొన్ని కారణాలతో […]

అగ్రిగోల్ద్ ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించేనా?

పోరుదీక్ష పేరుతో గుంటూరు జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్‌లో ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల ధర్నాతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. వెయ్యి కోట్లు ఆర్థిక సహాయం అందించాలని … సీఐడీ దగ్గర బాధితుల లిస్టును ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులు […]

రజినీ రోబో 2.0 సెంచరీ కొట్టాడు..

స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో ఓ మూవీ పట్టాలెక్కనుంది అంటే.. ఆ మూవీపై ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రోబో చిత్రానికి సీక్వెల్‌గా 2.0 అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీని శంకర్ తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్ 16న మెదలైన ఈ చిత్ర షూటింగ్ నేటితో వంద రోజులు పూర్తి చేసుకున్నట్టు శంకర్ తెలిపాడు. రెండు భారీ యాక్షన్ […]

ఉద్యోగుల తరలింపు పై చంద్రబాబు వెనకడుగు.

అనుభవం అయితే గానీ తత్వం బోధపడదన్న విషయా న్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిదానంగా గ్రహిస్తున్నారు. జూన్ 27 కల్లా హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా, వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి తరలి రావలసిందేనని సీఎం హుకుం జారీ చేశారు. అయితే, వాస్తవ పరిస్థితులు, భవన నిర్మాణ స్థితిగతులపై వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్న సీఎం, ఇప్పుడు పట్టువిడుపుల ధోరణితో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం, ఇంటీరియర్ డెకరేషన్ సహా పూర్తి కావాలంటే […]

‘బాహుబలి’కి రాజమౌళి సూపర్బ్‌ ఫినిషింగ్‌

రాజమౌళి ఏం చేసినా అది కొత్తగానే ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడీ క్రియేటివ్‌ డైరెక్టర్‌. ‘బాహుబలి’ సినిమాని రెండు పార్టులుగా తీస్తున్న రాజమౌళి, తొలి పార్ట్‌ని ఇప్పటికే విడుదల చేశాడు. అదే బాహుబలి ది బిగినింగ్‌. రెండో పార్ట్‌ ‘బాహుబలి ది కంక్లూజన్‌’. ఇది ఇంకా నిర్మాణంలో ఉంది. ఇదే ‘బాహుబలి’కి ముగింపు. బిగినింగ్‌ పార్ట్‌తోనే సినీ పరిశ్రమ దృష్టినంతటినీ పూర్తిగా తన వైపుకు తిప్పేసుకున్న రాజమౌళి ఇక […]

లేడీ ‘చిరుత’ చెల్లెలొస్తోంది

ఇద్దరు అక్క చెల్లెళ్లలో ఒకరు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్‌ అవ్వగలుగుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో కొత్తగా మరో హీరోయిన్‌ చెల్లెలు తెరంగేట్రం చేయబోతోంది. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ తన కొత్త సినిమా కోసం ఓ హీరోయిన్‌ చెల్లెల్ని తీసుకొస్తున్నాడు. ‘చిరుత’ సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ సోదరి ఐషా శర్మ, అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించనున్న ‘నమస్తే ఇంగ్లాడ్‌’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా నటిస్తోంది. ఆమె […]

నిహారిక కోసమైనా పవన్ వస్తాడా?

అమ్మాయే అయినా చిచ్చరపిడుగే ఈ కొణిదెలవారమ్మాయి. తొలి సినిమా కోసం విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటోంది. హీరోయిన్‌గా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి అమ్మాయి నిహారిక మాత్రమే. హీరోయిన్‌గా నటించాలన్న తన ఆకాంక్షను బయటపెట్టాక, ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతూ, కుటుంబానికి చెడ్డపేరు తెచ్చే సినిమాలు మాత్రం చేయనని భరోసా ఇస్తోంది నిహారిక అభిమానులకి. ఇంకో వైపున పబ్లిసిటీ పరంగా నిహారిక తీసుకుంటున్న జాగ్రత్తలకు మెగా ఫ్యామిలీ ఆశ్చర్యపోతోందట. మెగా అభిమానుల్లో ప్రత్యేకించి మహిళా […]