తెలుగునాట ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తరువాత ఆ స్థాయిలో దశాబ్దాలపాటు సినీ అభిమానులను ఉర్రూతలూగించి తిరుగులేని అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న ఘనత చిరంజీవిది. ఆ ధైర్యంతోనే ఎన్టీఆర్ బాటలోనే తానూ సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలని ఆశించిన చిరంజీవికి రాజకీయాల్లో మాత్రం గట్టి ఎదురుదెబ్బనే రుచిచూడాల్సి వచ్చింది. సినిమాల్లో నెంబర్ వన్‌గా రాణించిన చిరంజీవి రాజకీయాల్లో మాత్రం వెనుకబెంచీ విద్యార్థిగానే ఉండిపోయారు. చిరంజీవి రాజకీయాల్నినమ్ముకుని సినీరంగాన్ని వీడటంతో సహజంగానే ఆయన అభిమాన గణమంతా […]
Category: Latest News
కేసీఆర్ కోరిక బాబు తీరుస్తాడా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య ప్రజలను మెస్మరైజ్ చేయగల మాటల మరాఠీగానే చాలామందికి తెలుసు. కానీ ఆయనకు మత పరమైన నమ్మకాలు, సెంటిమెంట్లు, వాస్తు పట్టింపులు కూడా బాగా ఎక్కువని ఆయన సన్నిహితులకు మాత్రమే తెలుసు. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసమంటూ ఆయన భారీగా నిర్వహించిన చండీయాగం అందరికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి శత్రువులపై విజయం సాధించడం కోసం ఈ యాగం నిర్వహిస్తారు. ఈ యాగం ఫలితంగానే అన్ని అడ్డంకులను అధిగమించి తెలంగాణ కల సాకారమైందని […]
అడ్డంగా బుక్ అయిన టీఆర్ఎస్ లేడీ ఎమ్మెల్యే
ప్రజా ప్రతినిధులుగా ఉన్నవాళ్లు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి. ఒకవేళ వీలు కాకపోతే వారికి నచ్చచెప్పుకోవాలి. లేదా ప్రజలతో కలిసి ఉద్యమానికి దిగాలి. ఇది ఎక్కడైనా ఉన్న పద్ధతి. కానీ, ఈ పద్ధతిని పక్కన పెట్టిన తెలంగాణలోని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు తనను తాను రక్షించుకోవడం కోసం, ప్రజల ఆగ్రహం నుంచి బయటపడడం కోసం భలే గిమ్మిక్కు ప్లే చేశారు. తనకు టికెట్ ఇచ్చి, విప్ హోదా ఇచ్చి గౌరవించిన ప్రభుత్వ అధినేతనే బోనులో ఇరికించేశారు. తన […]
లోకేష్‌కు గుడ్ న్యూస్…ఆమెకు బ్యాడ్ న్యూస్
లోకేష్‌కు ప్రభుత్వంలో పదవులిచ్చే అంశాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు తాత్కాలికంగా పక్కన పెట్టినా… లోకేష్ రాజకీయ అరంగేట్రం పేరు చెపితేనే విపక్ష వైసీపీ ఉలికిపడుతూ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో లోకేష్ పేరు చెపితేనే జగన్ భయపడుతున్నారని… జగన్‌కు దీటైన ప్రత్యర్థి లోకేషేనని, విపక్ష వైఖరి చూశాక టీడీపీలో యువ నాయకులు ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. అందుకే లోకేష్‌కు ప్రభుత్వంలో సముచిత పదవినివ్వాలని పార్టీ నేతలు మరోసారి ముఖ్యమంత్రిని కలిసి చెప్పినట్టు సమాచారం. చంద్రబాబు పాలనా వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతుండటంతో […]
ఆ ఇద్దరు మంత్రులకు డీ గ్రేడ్ ఇచ్చిన బాబు
ఏపీ ప్రభుత్వంలో మంత్రులు ఇప్పుడు విచిత్ర పరిస్తితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమకు తిరుగులేదు.. అని గుండెల నిండా గాలి పీల్చుకుని తిరిగిన నేతలు ఇప్పుడు ఒక్కసారిగా కుంగిపోతున్నారు. దీనంతటికీ కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీఎం చంద్రబాబు చేయించిన సర్వేనే! ఆ సర్వేలే ఇప్పుడు మంత్రులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సర్వేలో భాగంగా మంత్రుల పనితీరు, ప్రజలు, అధికారులతో ఇంటరాక్షన్, సమీక్షలు వంటి వివిధ పనుల ఆధారంగా చంద్రబాబు వారికి గ్రేడ్లు నిర్ణయించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు […]
2019లో తెలంగాణలో వార్ ఇలా ఉంటుందా..!
సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీ… తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి అధికార పగ్గాలు చేపట్టినపుడు ఆ పార్టీ పైనా.., పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైనా ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కాంగ్రెస్ ఆడిన రాజకీయ జూదంలో ఆ పార్టీ వ్యూహాలు ఎదురుతన్ని.. పరిస్థితులు టీఆర్ఎస్కు అనుకూలించడంతో… ఏదో గాలివాటంగా అధికారంలోకి వచ్చిందని భావించినవారే రాజకీయ విశ్లేషకుల్లో అధికశాతం. నిజానికి అందులో వాస్తవం లేకపోలేదు. […]
రోజా బూతుల పంచాంగం అందుకేనా..!
వర్తమాన రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉండటం కంటే… ప్రజలను ఏ స్థాయిలో నమ్మించగలమనేదానిపైనే తమ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుందన్నది అధిక శాతం రాజకీయ నాయకుల నమ్మకం. అందుకే మీడియాలో రాజకీయ నేతల ముఖాముఖి చర్చల్లో దాదాపు మాటల యుద్ధమే జరుగుతోంది. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శల చేసే విషయంలో కొందరు నేతలైతే అన్నిహద్దులను ఎప్పుడో దాటేశారు. తమ నోటి దురుసుతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న తీరు జుగుప్స కలిగిస్తోంది. ఇక తనను […]
2016లోనే జనసేన పోటీ చేస్తుందా..!
రాజకీయపార్టీగా అవిర్భవించినా ఇప్పటిదాకా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించని జనసేన పార్టీ తొలిసారిగా ఎన్నికల గోదాలోకి దిగబోతోందా..? ఆ పార్టీ రాజకీయ తొలి రాజకీయ ప్రత్యక్ష పోరుకు జీవీఎంసీ ఎన్నికలు వేదిక కాబోతోన్నాయా..? ఈ వార్తలు నిజమేనా…? లేక ప్రస్తుతానికి ఊహాగానాలేనా..? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ప్రస్తుతం.. ఏపీలో చాలామందికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. విషయమేమిటంటే మహా నగరపాలక సంస్థ(జీవీఎంసీ) ఎన్నికలపై జనసేన పార్టీ గురిపెట్టిందని తాజాగా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ […]
ఏపీకి కొత్త హోం మంత్రి వస్తున్నాడు..!
ఏపీకి కొత్త హోం మంత్రి వస్తున్నారా? ప్రస్తుతమున్న హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు ఊష్టింగ్ తప్పదా? ఆయన వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారా? అంటే ఇప్పుడు ఔననే సమాధానమే వినిపిస్తోంది అమరావతి పరిసరాల్లో! ఏపీలోని హోం శాఖపై చంద్రబాబు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇప్పుడిప్పుడు అభివృద్ధి బాటలోకి వస్తున్న ఏపీని అన్ని విధాలా ఫాస్ట్‌గా దూసుకుపోయేలా చేయడంలో హోం శాఖ కీలక మని ఆయన ఎప్పటికప్పుడు చెబుతున్నారు. అయితే, గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాల […]