బీజేపీని తొక్కేసేందుకు బాబు కొత్త వ్యూహం!

ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా ఉన్నా.. వాటిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే నేత‌ల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు ముందు వ‌రుస‌లో ఉంటారు. టీడీపీ-బీజేపీ కూటమి విష‌యంలో చంద్ర‌బాబు వేస్తున్న అడుగులు చూస్తే.. ఇది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు! బీజేపీకి టీడీపీతో ఉన్న అవ‌స‌రం కంటే.. టీడీపీకి-బీజేపీతో ఉన్న అవ‌స‌ర‌మే ఎక్కువ‌! కానీ చంద్ర‌బాబు మాత్రం బీజేపీ మాత్రం టీడీపీపై ఆధార‌ప‌డ‌క త‌ప్ప‌ని స‌రి అనేంత‌గా ప‌రిస్థితుల‌ను మార్చేస్తున్నారు! అందుకు ఇటీవ‌ల విడుద‌లైన ప‌ట్ట‌భ‌ద్రుల‌, ఉపాధ్యాయ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం.. ఆయ‌న చేసిన […]

బాబుపై రాజీనామా అస్త్రం ఎక్కుపెట్టిన జ‌గ‌న్‌

ప్ర‌త్యేక‌హోదాపై వెన‌క‌డుగు వేసేది లేదంటున్నారు ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి! ఆరునూరైనా త‌మ ఎంపీలు రాజీనామా చేసి తీర‌తార‌ని స్ప‌ష్టంచేస్తున్నారు. హోదాపై మాట‌మార్చిన బీజేపీ, టీడీపీల‌ను ఇరుకున పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు! కేంద్రంతో గొడ‌వ ప‌డేదానికంటే.. రాజీమార్గ‌మే బెట‌ర్ అని సీఎం చంద్ర‌బాబు చెబుతుంటే.. రాజీ కంటే పోరాట‌మే బెట‌ర్ అని జ‌గ‌న్ చెబుతున్నారు. మొత్తానికి త‌మ పార్టీ నేత‌లు రాజీనామా చేస్తార‌ని చెప్పి.. ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాడింది తామేన‌ని, టీడీపీ అస‌లు చేసిందేమీ లేద‌ని ప్ర‌జల ముందు […]

టీఆర్ఎస్ ఎంపీకి కేసీఆర్ షాక్‌ … నిరాశలో గుత్తా

ఎన్నో ఆశ‌ల‌తో సొంత పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన నేత‌ల‌కు వ‌రుస‌గా షాక్‌లు త‌గులుతున్నాయి. ఏదో ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని.. గులాబీ కండువా క‌ప్పుకున్న నాయ‌కుల‌కు.. చివ‌రికి నిరాశే ఎదుర‌వుతోంది! ఇప్ప‌టికే కారులో ఇమ‌డ‌లేక‌.. సొంత గూటికి వెళ్ల‌లేక ఇలాంటి నాయ‌కులంతా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇప్పుడు ఇదే జాబితాలో మ‌రో ఎంపీ కూడా చేరిపోయారు. మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆయ‌న పెట్టుకున్న ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి! దీంతో ఆయ‌న తీవ్రంగా మ‌థ‌న‌ప‌డుతున్నారని స‌మాచారం! మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని వ‌చ్చిన ఆయ‌న‌కు […]

బీజేపీని నట్టేట ముంచిన సూపర్ స్టార్‌

దక్షిణాదిలో ఎలాగైనా పాగా వేయాల‌ని, దీనికి త‌మిళ‌నాడు నుంచే ప్రారంభించాల‌ని ఆశ పెట్టుకున్న‌బీజేపీకి ఎదురుదెబ్బ త‌గిలింది. మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఎలాగైనా త‌మిళ‌నాడుపై ప‌ట్టు సాధించాల‌ని చూస్తున్న కాషాయ ద‌ళానికి షాక్ ఎదురైంది. ఆర్ కే న‌గ‌ర్‌లో ఎలాగైనా బ‌లం లేక‌పోయినా, సూప‌ర్ స్టార్ ఇమేజ్‌తో నెట్టుకురావాల‌ని చూస్తున్న బీజేపీ నేత‌ల ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి! చివ‌రికి సూపర్ స్టార్ ర‌జనీకాంత్ కూడా బీజేపీకి షాక్ ఇచ్చాడు. తాను ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌న‌ని స్ప‌ష్టంచేశాడు. దీంతో […]

కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు బాబు ముహూర్తం ఖ‌రారు … ప్ర‌కంప‌న‌లు రేప‌డం ఖాయం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ ప్ర‌క్షాళ‌న వార్త‌లు గ‌త యేడాదిన్న‌ర‌గా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు త‌న కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు బాబు ముహూర్తం ఖ‌రారు చేశారు. ఉగాది, శాస‌న‌స‌భ, మండ‌లి స‌మావేశాలు ముగిశాక ఏప్రిల్ 6వ తేదీన కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ఐదుగురు మంత్రుల‌కు ఖచ్చితంగా ఊస్టింగ్ త‌ప్ప‌ద‌న్న టాక్ ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ  అవుట్ లిస్టులో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన పీత‌ల సుజాత‌, విజ‌య‌న‌గ‌రం […]

ఆ రిపోర్టులు కేసీఆర్ వ్యూహంలో భాగమేనా?

ఎమ్మెల్యేల‌పై నిఘా వ‌ర్గాల‌తో స‌ర్వే నిర్వ‌హించి.. మార్కులు కేటాయిస్తుంటారు ఏపీ సీఎం చంద్ర‌బాబు! ఎప్పటిక‌ప్పుడు ఇలా ప్రోగ్రెస్ కార్డులు రూపొందించి.. త‌క్కువ మార్కులు వ‌చ్చిన ఎమ్మెల్యేల‌కు బ్రెయిన్ వాష్ చేస్తుంటారు! ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రెస్ కార్డుల‌నే త‌యారుచేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌! దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు నిద్ర క‌రువు అవుతోంద‌ట‌. ఇప్ప‌టికే రెండు సార్లు ఇటువంటి నివేదిక‌లు తెప్పించుకున్నారు! ముచ్చ‌టగా మూడోసారి కూడా రిపోర్ట్ త‌యారైంద‌ట‌! ఈ రిపోర్టుల్లో ఏముందోన‌నే టెన్ష‌న్ అందరిలోనూ పెరిగిపోయింద‌ట‌. టెన్ష‌న్ మాటెలా […]

2019లో ఇద్దరు వైసీపీ సిట్టింగ్ ఎంపీలకు నో టిక్కెట్..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ బ‌లంగా ఉన్న క‌డ‌ప‌-క‌ర్నూలు-నెల్లూరు జిల్లాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు ఘోరంగా ఓడిపోయారు. దీంతో వైసీపీ అధినేత జ‌గ‌న్  ఈ మూడు జిల్లాల్లో కొంద‌రు పార్టీ నేత‌ల‌పై చాలా సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కీల‌క స్థానాల్లో ఉన్న వారికి సైతం 2019 ఎన్నిక‌ల సాక్షిగా షాక్ ఇవ్వ‌క త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. కడప జిల్లా కంచుకోటను టీడీపీ బద్ధలు కొట్టడంపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ […]

ప‌వ‌న్‌కు రామోజీకి గ్యాప్ ఎందుకు..!

ఈనాడు గ్రూఫ్ అధినేత రామోజీరావు పేరు చెపితే తెలియ‌ని తెలుగు వాళ్లు ఉండ‌రు. తెర‌ముందుకు రాకుండానే తెలుగు రాజ‌కీయాల‌ను శాసించే వ్య‌క్తిగా పేరున్న రామోజీని రాజ‌గురువు అని పిలిచేవాళ్ల సంఖ్య కూడా త‌క్కువేం కాదు. తెలుగు రాజ‌కీయాల్లో రామోజీ చ‌క్రం తిప్ప‌డం దాదాపు గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాల నుంచే ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో సైతం రామోజీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ టీడీపీ+బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా స‌పోర్ట్ చేయ‌డంలో కీ రోల్ పోషించార‌న్న వార్త‌లు కూడా […]

ప్రభుత్వం పై వ్య‌తిరేక‌త ఇది… దిమ్మ‌తిరిగే రిజ‌ల్ట్‌

ఏపీలో మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. సోమ‌వారం స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల్లో మూడు జిల్లాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో మూడింట  మూడు స్థానాలు గెలుచుకోవ‌డంతో అధికార టీడీపీ చేసిన హంగామాకు అంతే లేదు. క‌డ‌ప‌, క‌ర్నూలు, నెల్లూరు మూడు జిల్లాల్లో లోక‌ల్ బాడీస్ ఎమ్మెల్సీల‌ను టీడీపీ గెల‌చుకున్నా ఈ గెలుపుకోసం టీడీపీ ప్ర‌లోభాలు, బెదిరింపులు లెక్క‌లోకి రాలేదు. ఇక ప్ర‌లోభాలు, బెదిరింపుల‌కు తావులేని టీచ‌ర్స్‌, గ్రాడ్యుయేట్స్ నియోజ‌క‌వర్గాల ఫ‌లితాలు కాస్త లేట్‌గా వ‌చ్చాయి. […]