ఏపీ రాజకీయాల్లో విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేరుకు కాస్త క్రేజ్ ఉంది. టీడీపీ తరపున ఉదయం మీడియా ఛానెళ్లలో ఆయన బాగానే హంగామా చేస్తారు. బొండా టీవీ చర్చలు చూసే వాళ్లలో చాలా మంది ఆయనకు మ్యాటర్ తక్కువ…మాటలు ఎక్కువ అని కూడా చమత్కరిస్తుంటారు. ఇక బొండా గెలవడానికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినా నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినంత హడావిడి చేస్తుంటారు. గత మంత్రి వర్గ ప్రక్షాళనకు ముందు వరకు బొండా […]
Category: Latest News
నంద్యాల సీటుపై చంద్రబాబుకు అంత టెన్షన్ ఎందుకో?
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికపైటీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు భారీ ఎత్తున టెన్షన్ పడుతున్నారు. దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న బాబు.. అక్కడ గెలుపుకోసం అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నికపై ఇంకా ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అయినా కూడా అటు అధికార, ఇటు విపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం, ప్రచారం తప్ప పంపాకాలు ప్రారంభించేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈవిషయంలో విపక్ష పార్టీని పక్కన పెడితే.. బాబు […]
జగన్ కోసం ఒక్కటైన తెర వెనక లీడర్లు..!
ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడనుందా? 2019లో జగన్ సీఎం కల నెరవేరబోతోందా? అంటే.. ఇప్పుడు గ్యారెంటీగా ఔననే సమాధానమే వస్తోంది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న దివంగత వైఎస్ మిత్రులు, సన్నిహితులు అందరూ జగన్‌కి జట్టుగా కలిసి రావాలని డిసైడ్ అయ్యారట. వైఎస్ అధికారంలో ఉండగా ఆయనతో ఎంతో చెలిమి చేసిన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు జగన్‌ని సీఎంని చేసే బాధ్యత తీసుకున్నారని, దీనివెనుక వైఎస్ ఆత్మ కేవీపీ ప్రధాన చక్రం […]
మీడియాకి కేటీఆర్ పాఠాలు.. నిజాలు చెప్పినందుకే!
తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్నిమీడియా సంస్థలపై నిప్పులు చెరుగుతున్నారు. పెయిడ్ ఆర్టికల్స్ రాస్తున్నాయని తెగ ఫీలైపోతున్నారు. అంతేకాదు, పత్రికా స్వేచ్ఛ అంటే ఏమిటో ఇప్పుడు గంటల తరబడి క్లాస్ పీకుతున్నారు. గతంలో టీఆర్ ఎస్‌కు అనుకూలంగా రాయని పత్రికలు పత్రికలే కావని, ప్రసారం చేయని మీడియా మీడియానే కాదని గులాబీ దళం తీర్మానించేసింది. అప్పట్లో టీఆర్ ఎస్‌ని, కేసీఆర్‌ని పొడుగుతూ పత్రికలు రాసిన కథనాలు, వెలువరించిన వార్తలు పెయిడ్ న్యూస్‌గా కనిపించని కేటీఆర్‌కి.. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా […]
పవన్ దానినుంచి అయితే తప్పించుకున్నాడు…మరి రేపు
ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పోటీకి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కులాల లెక్కనే ఎక్కువుగా నడుస్తున్నాయి. ఈ ట్రెండ్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా ఉంటుంది. ఏపీలో 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో కులాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. టీడీపీకి కమ్మ, బీసీ వర్గాలు, కాంగ్రెస్‌కు రెడ్డి, ఎస్సీ వర్గాలు, ప్రజారాజ్యానికి కాపు వర్గం ఎక్కువుగా మద్దతు ఇచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ […]
చంద్రబాబుకు, ఆ సీనియర్ ఎమ్మెల్సీకి పడట్లేదా..!
టీడీపీలో ఓ సీనియర్ ఎమ్మెల్సీకి, సీఎం చంద్రబాబుకు అస్సలు పడట్లేదా ? చంద్రబాబు తీరుపై విసిగిపోయిన సదరు సీనియర్ నేత రాజకీయాలను గుడ్ బై చెప్పేయాలన్న నిర్ణయానికి వచ్చారా ? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ రాజకీయాల్లో గాలి ముద్దుకృష్ణమ నాయుడు అందరికి సుపరిచితుడే. గత ఎన్నికల్లో గాలి నగరి నుంచి పోటీ చేసి రోజా చేతిలో కేవలం 926 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత బాబు ఆయన సీనియారిటీని గుర్తించి ఎమ్మెల్సీ […]
దేవినేని ఉమా వదిన మృతిపై వైసీపీ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమాపై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఉమా తన వదిన (మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ భార్య)ను చంపేశాడని కృష్ణా జిల్లా జనాలు ఇప్పటకీ అనుకుంటారని వైసీపీ నేత జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఉమాను రమేశ్ ఉత్త మాటలు చెప్పే పిట్టల దొరగా కూడా అభివర్ణించారు. జోగి రమేశ్ గత ఎన్నికల్లో మైలవరం నుంచి ఉమా మీద పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఉమా గురించి మాట్లాడిన రమేశ్ […]
మూడు పార్టీల్లోను సెగలు రేపుతోన్న ఆ సీటు
ఏపీలో ఓ ఎంపీ సీటుకు జరుగుతోన్న రాజకీయం ఇప్పుడు యమా హాటుగా మారింది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ, కొత్తగా పోటీ చేస్తోన్న జనసేన ఈ మూడు పార్టీల నుంచి ఆ ఎంపీ సీటుకు కీలకమైన అభ్యర్థులు రంగంలో ఉంటారన్న ప్రచారం ఇప్పుడు అక్కడ పొలిటికల్ వాతావారణాన్ని ఎన్నికలకు రెండేళ్ల ముందే హీటెక్కించేస్తోంది. ప్రస్తుతం అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్‌కు బదులుగా వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి టీడీపీ తరపున చంద్రబాబు కోడలు […]
జనసేనకి వారే పెద్ద ఆస్తి అవుతారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన వచ్చే 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అదేసమయంలో తాను అనంతపురం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే పవన్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే ఆయన నెత్తురు మండే కత్తుల్లాంటి యువతకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించి.. ఇప్పటికే జిల్లాల వైజ్‌గా యువతను పార్టీలోకి ఆహ్వానించి వారికి వివిధ రంగాల్లో పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాడు. వాస్తవానికి దీని వెనుక పెద్ద వ్యూహాన్నే పవన్ ఫాలో అవుతున్నాడని సమాచారం. యువకులకు […]
