సొంత టీమ్‌ను రూపొందించే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు సీఎం చంద్రబాబు తనయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేశ్! ముఖ్యంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, వారితో సత్సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అవసరమైన సభ్యులను ఏరికోరి మరీ ఎంపికచేసుకుంటున్నారు. ఇతర రంగాల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్న వారిని తన టీంలో చేర్చుకుంటున్నారు. మీడియాలో సంచలనంగా మారిన టీవీ-9 చానెల్‌కు చెందిన రిపోర్టర్‌ను తన పీఆర్వోగా లోకేశ్ నియమించుకున్నారు. అలాగే మరో జాయింట్ కలెక్టర్‌ను కూడా తన వద్ద చేర్చుకున్నారు. మంత్రిగా […]
Category: Latest News
టీడీపీ కంచుకోటలో బాబు సర్వేలో షాకింగ్ రిజల్ట్
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోటలాంటిది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. 2004, 2009 ఎన్నికలు మినిహా టీడీపీ ఆవిర్భావం తర్వాత అన్ని ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఆధిపత్యం చూపించింది. గత సాధారణ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. 15 ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఏలూరు, నరసాపురంతో పాటు ఈ జిల్లాలో సగం విస్తరించి ఉన్న రాజమండ్రి ఎంపీ సీటును కూడా టీడీపీ + బీజేపీ భారీ మెజార్టీతో […]
కోదండరామ్ పార్టీపై కొత్త ట్విస్ట్…!
తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీకి కూడా మనుగడ లేకుండా చేసేశారు గులాబీ దళపతి కేసీఆర్! కాంగ్రెస్, తెలుగుదేశం వంటి పార్టీల అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేసి టీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ పార్టీ అనేంతగా చేసేశారు. అయితే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మరో కొత్త పార్టీని జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రారంభించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నా.. వాటిని ఖండిస్తూనే ఉన్నారు. కానీ తెర వెనుక ఈ పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ చకచకా జరిగిపోతున్నాయట. ఇప్పటి నుంచే పార్టీలోకి చేరే వారికి […]
మూడు జిల్లాల్లో మునిగిపోతోన్న వైసీపీ
విపక్ష వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు. జగన్ ప్రయత్నాలు ఎలా ఉన్నా చాలా జిల్లాల్లో వైసీపీ రోజు రోజుకు బలం కోల్పోతుంది. కోస్తాలో కీలకమైన ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అని ప్రశ్నించుకుంటే ఆ పార్టీ వాళ్లే ఒకటి రెండు నియోజకవర్గాల పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఓ వైపు టీడీపీ దూకుడు, అంతర్లీనంగా స్ట్రాంగ్ అవుతోన్న జనసేన దెబ్బతో […]
లగడపాటి రూటు టీడీపీనా..? వైసీపీనా..?
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ పేరు చెపితేనే మనకు రగడపాటి అన్న క్యాప్షన్ గుర్తుకు వస్తుంది. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేతో నానా హడావిడి చేసిన రాజ్‌గోపాల్ సర్వేలకు పెట్టింది పేరు… రాజ్‌గోపాల్ సర్వే అంటే కాస్త అటూ ఇటూగా తుది ఫలితానికి దగ్గరగా ఉంటుందన్న విషయం చాలాసార్లు రుజువైంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత రాజ్‌గోపాల్ కాంగ్రెస్‌కు దూరమై రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. ఇక కొద్ది రోజులుగా రాజ్‌గోపాల్ పొలిటికల్ రీ […]
బాబుకు బాలయ్య షాక్: హిందూపురంకు గుడ్‌బై
ప్రముఖ సినీనటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకోనున్నాడా ? వచ్చే ఎన్నికల్లో ఆయన తన హిందూపురం నియోజకవర్గాన్ని వదులుకోనున్నాడా ? బాలయ్య ఇప్పటికే తీసుకున్న ఈ డెసిషన్‌తో చంద్రబాబు సైతం షాక్ అయ్యారా ? అంటే ఏపీ పొలిటికల్ కారిడాల్ ఇప్పుడు ఇదే అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ వారసుడిగా టాలీవుడ్లో స్టార్ హీరోగా నాలుగు దశాబ్దాలుగా రాణిస్తోన్న బాలయ్య గత ఎన్నికల్లో హిందూపురం నుంచి పొలిటికల్ ఎంట్రీ […]
ఏపీలో అత్తాకోడళ్ల పోరు ఉంటుందా..!
ఏపీలో ఎన్నికలు ఇంకా కాస్త దూరంలోనే వున్నాయి. మోడీ డెసిషన్‌తో 2018లోనే జమిలీ ఎన్నికలు ఉంటాయన్న టాక్ బలంగా వస్తోంది. దీంతో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే ఏపీలో అత్తాకోడళ్లు అయిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి వర్సెస్ నారా బ్రాహ్మణి మధ్య ఆసక్తికరమైన పోరు ఉంటుందా ? అన్నదానిపై ఆసక్తికరమైన సస్పెన్స్ నెలకొంది. అసలు మ్యాటర్ ఏంటంటే గతంలో కాంగ్రెస్ తరపున బాపట్ల, విశాఖపట్నం నుంచి ఎంపీగా గెలిచిన పురందేశ్వరి గత […]
వైసీపీకి సినీ గ్లామర్ అటాచ్..!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు శ్రీకారం చుట్టనుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కూడా 2018లోనే ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. వచ్చే యేడాదిలోనే ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సై అన్నట్టు టాక్. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశానికి ఉన్నంత సినీగ్లామర్ మరే పార్టీకి లేదు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం సినిమా రంగం నుంచి రావడంతో ఎక్కువ మంది సినిమా వాళ్లు […]
టీటీడీ చైర్మన్ కోసం టీడీపీలో నాలుగు స్తంభాలాట
ఏపీలో కీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో టీటీడీ చైర్మన్ పోస్టు ఒకటి. ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేవాలయమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్టుకు మమూలు క్రేజ్ ఉండదు. ఈ ధర్మకర్తల మండలికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. టీటీడీ చైర్మన్ పదవి కోసం తలపండిన రాజకీయ నేతల నుంచి ఎందరో పోటీ పడతారు. ఈ పోస్టుతో పాటు ధర్మకర్తల మండలిలో సభ్యత్వం కోసం ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు కూడా సిఫార్సులు కూడా వస్తాయి. ఈ […]