అప్ప‌ట్లో ప‌ర‌కాల‌, ఇప్పుడు ఐవైఆర్ సేమ్ టు సేమ్‌

రాజకీయ పార్టీలు, ప్ర‌భుత్వాల‌కు మేధావుల అవ‌స‌రం ముఖ్యం! ఇది గ‌మ‌నించే కొంత‌మందిని కీల‌క ప‌ద‌వుల్లో నియ‌మిస్తూ ఉంటారు! అయితే వారు ఆ రాజ‌కీయ పార్టీకి, ప్ర‌భుత్వానికి రివ‌ర్స్ అవుతార‌ని ఎవరూ ఊహించి ఉండ‌రు. ప్ర‌స్తుతం ఇలాంటి ప‌రిణామ‌మే ఏపీ రాజ‌కీయాల్లో ఎదురైంది. సీఎం చంద్ర‌బాబు.. ఏరికోరి నియ‌మించుకున్న ఐవైఆర్ కృష్ణారావు.. ప్ర‌భుత్వంపై ఎద‌రుదాడికి దిగ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అంతేగాక ఆయ‌న‌పై వేటు వేసే వ‌ర‌కూ వ్య‌వ‌హారం వెళ్లింది. అయితే ఇలాంటి సంఘ‌ట‌నే ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో […]

ఐవైఆర్ సునామీ… బాబుకు ఝ‌ల‌క్‌..వెనక జరిగిన తతాంగం ఇదేనా..!

ఏపీలో ఇప్పుడు అనూహ్యం, అసాధార‌ణం అన‌ద‌గిన పరిణామాలు వెంట‌వెంట‌నే చోటు చేసేసుకుంటున్నాయి. త‌న మామ‌కు వెన్నుపోటు పోడిచాడు అని విప‌క్షాలు సీఎం చంద్ర‌బాబును త‌ర‌చు విమ‌ర్శిస్తూ ఉంటాయి. దీనిని ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి నేరుగా చంద్ర‌బాబుకు అనుభవంలోకి వ‌చ్చింది. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో బాబు అవాక్క‌యిపోవ‌డం త‌రువాయి అయింది. నిజానికి ఈ ప‌రిణామం ఏ క‌మ్మ‌, కాపు కుల స్తుల నుంచి ఎదురై ఉంటే.. మ‌రో రకంగా ఉండేది. కానీ, బ్రాహ్మ‌ణ కులం […]

మోడీ మెగా ప్లాన్‌: ఉపరాష్ట్రపతిగా నరసింహన్..!

2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించి ఢిల్లీ పీఠం వ‌రుస‌గా రెండోసారి అధిష్టించేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వేస్తోన్న ఎత్తులు, ప‌న్నుతోన్న వ్యూహాలు మామూలుగా లేవు. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక‌లో మోడీ అనుస‌రించిన వ్యూహానికి విప‌క్షాల నుంచి విమ‌ర్శ‌ల‌కు తావే లేకుండా పోయింది. దీంతో ఆయ‌న‌తో విబేధించే మ‌మ‌తా బెన‌ర్జీ లాంటి వాళ్లు కూడా ఏమీ అన‌లేని ప‌రిస్థితి మోడీ క‌ల్పించారు. ఇక్క‌డ ఎవ్వ‌రు విమ‌ర్శించినా ద‌ళితుడు రాష్ట్ర‌ప‌తి అవ్వ‌డం ఇష్టం లేదా ? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. […]

ప‌క్క‌లో బ‌ల్లెంపై చంద్ర‌బాబు వేటు

ఈ రోజు ఉద‌యాన్నే చంద్ర‌బాబు ఓ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌పై వేటు వేశారు. ఐవైఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వార్త‌లు గ‌త రెండు రోజులుగా మీడియాలో ప్ర‌ముఖంగా వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ‌స్తోన్న వార్త‌ల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో పాటు చంద్ర‌బాబు, టీడీపీనే టార్గెట్ చేసే పోస్టుల‌ను ఆయ‌న పెడుతూ పెద్ద సీత‌య్య‌గా మారారు. ఈ క్ర‌మంలోనే ఈ రోజు ఉద‌యాన్నే ఆయ‌న‌పై వేటు వేసిన చంద్ర‌బాబు ఏపీ […]

బ్రాహ్మ‌ణి – జ‌య‌దేవ్ డీల్ ఇదే

ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు పొలిటిక‌ల్ ఎంట్రీపై గ‌త ఆరేడు నెల‌లుగా మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌న కోడ‌లిని ఎంపీగా పోటీ చేయిస్తార‌ని…ఇందుకోసం విజ‌య‌వాడ‌, గుంటూరు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. నిన్న‌టి వ‌ర‌కు బ్రాహ్మ‌ణి విజ‌య‌వాడ నుంచి పోటీ చేస్తుంద‌ని కొంద‌రు అనుకున్నా…ఇప్పుడు ఈ సీటుపై బీజేపీ క‌న్నేయ‌డం.. పురందేశ్వ‌రి, కేంద్ర మంత్రి వెంక‌య్య కుమార్తె దీపా పేర్లు ఇక్క‌డ నుంచి విన‌ప‌డ‌డం, మ‌రోవైపు మాజీ ఎంపీ […]

సీఎం ర‌మేశ్ స్పీడ్ కు బాబు బ్రేక్

ఏపీలో అధికార టీడీపీలో రాజ‌కీయాలు ఎప్పుడూ లేనంత‌గా క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పిన‌ట్టే క‌నిపిస్తున్నాయి. చంద్ర‌బాబు గ‌తంలో సీఎంగా ఉన్న‌ప్ప‌టి కంటే ప్ర‌స్తుతం ఆయ‌న మాట‌ను ధిక్క‌రించే వాళ్లు రోజు రోజుకు ఎక్కువ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న మాట విన‌క‌పోతే త‌న‌కు ఎంత స‌న్నిహితులైన వారిని అయినా బాబు ప‌క్క‌న పెట్టేస్తూ వారికి షాకులు ఇస్తున్నారు. ఈ కోవ‌లోకే వ‌స్తారు రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం.ర‌మేశ్‌. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సీఎం.ర‌మేశ్‌కు చంద్ర‌బాబు ఇచ్చిన ప్ర‌యారిటీ అంతా ఇంతా కాదు. సీమ‌లో […]

గంటాని అడ్డం పెట్టుకుని ఆట మొద‌లెట్టేశారు…

ఏపీలో ఇప్పుడు విశాఖ భూదందా కేసు వాడి వేడి సెగ‌లు పుట్టిస్తోంది. అధికార ప‌క్షంలోనే నేత‌లు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించుకుంటూ.. విప‌క్షం ప‌నిని తామే చేసేసుకుంటున్నారు. విశాఖ‌లో భారీ ఎత్తున భూములు కొల్ల‌గొడుతున్నారంటూ మంత్రి అయ్య‌న్న పాత్రుడే నేరుగా మీడియా మీటింగ్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు, దీనిపై సీఎం చంద్ర‌బాబుకు నేరుగా ఆయ‌న లే ఖ కూడా రాసేశారు. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తున్న టీడీపీ మిత్ర ప‌క్షం బీజేపీ.. ముఖ్యంగా బీజేపీ ఏపీ నేత‌లు త‌మ‌కు […]

నంద్యాల‌లో జ‌న‌సేన ఇన్న‌ర్ స‌పోర్ట్‌ ఆ పార్టీకేనా..!

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌కు మ‌రో నెల రోజుల్లోగానే నోటిఫికేష‌న్ రానుంది. ఇప్ప‌టికే టీడీపీ త‌న అభ్య‌ర్థిగా ఇక్క‌డ మృతిచెందిన భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి పేరు ఖ‌రారు చేసింది. వైసీపీ అభ్య‌ర్థి ఎంపిక జ‌గ‌న్‌కు కాస్త చిక్కుగానే ఉంది. నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్ రాజ్‌గోపాల్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ గంగుల ప్ర‌తాప్‌రెడ్డి, ఇటీవ‌ల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి పోటీప‌డుతున్నారు. ఇక్క‌డ ప్ర‌ధాన పార్టీల […]

దివాళా దిశ‌గా ల‌గ‌డ‌పాటి ల్యాంకో..!

ప్ర‌ముఖ వ్యాపారవేత్త‌, కాంట్ర‌వ‌ర్సి పొలిటిషీయ‌న్ అయిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్‌కు చెందిన ల్యాంకో కంపెనీ ఖేల్ ఖ‌తం కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. రాజ్‌గోపాల్‌కు చెందిన ప్ర‌ముఖ మౌలిక రంగ సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ దివాలా ముంగిట నిలిచింది. భారీ స్థాయిలో రుణాలు తీసుకుని తీర్చ‌లేక ఎగ‌వేత‌దారుల లిస్టులో ఉన్న కంపెనీల‌పై దివాలా ప్ర‌క్రియ ప్రారంభించాలంటూ ఇటీవ‌ల ఆ కంపెనీల‌కు రుణాలు ఇచ్చిన బ్యాంకుల‌కు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. విజ‌య‌వాడ ఎంపీగా […]