మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సినిమా దృశ్యం 2. కరోనా కారణంగా మూవీ థియేటర్స్ మూతపడి ఉండటం వల్ల ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యి ఘన విజయం పొందింది. ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేసేందుకు అంతా సిద్ధం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పనోరమ స్టూడియోస్ ఈ మూవీ హిందీ రీమేక్ హక్కులు సొంతం చేసుకుంది. అయితే ఈ అంశం మీద ప్రస్తుతం వివాదం చెల […]
Category: Latest News
బాలీవుడ్ బ్యూటీకి మరో యాప్ స్వాగతం..?
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌కు సామాజిక మాధ్యమ వేదిక కూ యాప్ సాదరంగా ఆహ్వానం పలికింది. స్వేచ్ఛగా ఆమె భావాలను వ్యక్త పరిచేందుకు ఈ వేదికను ఆమె ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. ట్విటర్ ఆమె ఖాతాను శాశ్వతంగా నిలిపివేసిన క్రమంలో కూ యాప్ ఆమెను ఆహ్వానించింది. కూ యాప్ దేశీయంగా అభివృద్ధి చెందింది. తమ వేదిక స్వేచ్ఛగా అభిప్రాయాలను తెలిపేలా అవకాశం కల్పిస్తుందని కూ వ్యవస్థాపకులు తెలిపారు. ఇది మీ ఇల్లు లాంటిది అంటూ కంగనను స్వాగతించారు. కూ […]
మరో సారి రియల్ హీరో అనిపించుకున్న సోను..!
రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. మరో వైపు ఆక్సిజన్ కొరత తో ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో అభాగ్యులకు అండగా నిలుస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. తాజాగా కర్ణాటకలోని సోనూసూద్ టీం అంతా కరోనా రోగుల పట్ల సకాలంలో స్పందించి 22 మంది ప్రాణాలని రక్షించారు. బెంగళూరులోని అరక్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీనితో వెంటనే అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్లు కావాలంటూ సత్యనారాయణన్ అనే ఓ పోలీసు […]
రాకేష్ మాస్టర్ పై కేసు ..?
ఎప్పుడు ఎదో ఒక వివాదపు వ్యాఖ్యలు చేస్తూ, సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలో ఉండే డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర నృత్య దర్శకుడు ఎస్.రామారావు అదే రాకేష్ మాస్టర్ శ్రీకృష్ణుడి పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారని యాదవ సంఘ నాయకులు ఆరోపించారు. దీనితో యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు […]
వైరల్ : ఒకే కాన్పులో 9 మంది పిల్లలకు జననం..!
మహిళలు కవల పిల్లలకు జన్మ ఇవ్వటం మాములు విషయమే. కొందరు మహిళలు ఒకే సారి ముగ్గురు, నలుగురు పిల్లలకు జన్మ ఇస్తుంటారు. ఒక మహిళ ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మ ఇచ్చింది. ఈ విషయం విన్న అందరు షాక్ కి గురి అవుతున్నారు. పశ్చిమ ఆఫ్రికాలోని మాలీ దేశానికి చెందిన హలీమా సిస్సే గత సంవత్సరం ఆగస్టులో గర్భం దాల్చింది. మూడు నెలల వరకు సాధారణంగానే ఉంది. మూడు నెలల తర్వాత సాధారణ గర్భవతులకంటే పెద్ద […]
ఒక్క వైన్‌బాటిల్ ధర రూ.7కోట్లు..!
సాధారణ లిక్కర్ తో పోల్చితే వైన్ ధర కాస్తా ఎక్కువగానే ఉంటుంది. వైన్ ఎంత పురాతనమైనది అయితే అంత కిక్కుతోపాటు, అంతే ఎక్కువ ధర పలుకుతుంటుంది. అందుకే పాత వైన్ కోసం మద్యం ప్రియులు వేలు, కాదు లక్షల రూపాయాలనైనా వెచ్చిస్తారు. వాటన్నింటిని తలదన్నే విధంగా ఓ మద్యం బాటిల్ విలువ కోట్ల రూపాయల ధర పలుకుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అంత ధర ఎందుకంటే అది అంతరిక్షంలో పులియబెట్టిన వైన్ కావడమే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో […]
గూఢచారి హీరో పెద్ద మనసు..!
ప్రస్తుతం మన దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. ఇప్పటికే సోనూసూద్ వంటి స్టార్ హీరోలు కరోనాతో బాధ పడుతున్న ప్రజలకు తమ వంతు సాయం చేస్తూ రియల్ హీరోస్ గా పేరు తెచ్చుకుంటున్నారు. మరోవైపు సందీప్ కిషన్ కూడా కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రెండేళ్ల వరకు వారికీ కావాల్సిన అవసరాలను తీరుస్తానని ప్రకటించారు. అలాగే తాజాగా హీరో అడివి శేష్ కూడా కరోనా క్లిష్ట పరిస్థితిలో తన వంతు సాయం చేసి నిజమైన […]
ఈటలపై ఎన్నారైల ఆగ్రహం..!
మాజీమంత్రి, టీఆర్ ఎస్ తిరుగుబాటు నేత ఈటెల రాజేందర్ వ్యవహారంపై అమెరికా ఎన్నారైల కోర్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు పట్ల ఎన్నారైలు చర్చించి స్థిరమైన సంక్షేమ పాలన కేసీఆర్ తోనే సాధ్యమని, వ్యక్తులు ముఖ్యం కాదు వ్యవస్థ మరియు సమాజహితం ముఖ్యమన్నారు. సబ్బండ వర్గాలకు కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడుతూ కెసిఆర్ గారి నాయకత్వం పై విశ్వాసం వ్యక్తపరుస్తూ ఎన్నారైలు సంపూర్ణ మద్దతు […]
స్మశానానికి స్వాగతం.. బీజేపీ శవరాజకీయాలు..!
రాజకీయ నాయకులు వ్యక్తిగత ప్రచారానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రతి విషయాన్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవాలని చూస్తుంటారు. తమ ఇమేజ్‌ను పెంచుకోవాలని ఆరాటపడుతుంటారు. పోస్టర్లను వేసుకుంటూ హోరెత్తిస్తుంటారు. అయితే కర్నాటకకు చెందిన బీజేపీ నేతలు ఆఖరికి కొవిడ్ మరణాలను కూడా తమ ప్రచారానికి వినియోగించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్మశానానికి స్వాగతం అంటూ కట్టిన ఫ్లెక్సీలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కోవిడ్ మృతుల అంత్యక్రియల కోసం కర్నాటక రాష్ట్రం నెలమంగల తాలూకా […]









