స్పార్క్ ఓటీటీలో బిగ్ బాస్ బ్యూటీ సినిమా..?

తెలుగు ప్రేక్షకులను బిగ్ బాస్ కార్యక్రమం ఎంతగానో అలరించింది. అంతేకాదు ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది సెలబ్రిటీలు ఫేమస్ అయిపోయారు. బిగ్ బాస్ తర్వాత తాము అనుకున్నది సాధించుకుంటూ విజయాన్ని పొందుతున్నారు. మంచి సినిమా ఆఫర్లు రావడంతో బిజీగా మారిపోతున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 4తో ఫేమస్ అయిన న‌టి దివికి అనేక చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈమె తాజాగా క్యాబ్ స్టోరీస్ అనే చిత్రంలో న‌టించింది. ఇందులో గిరిధ‌ర్, ధ‌న్‌రాజ్, ప్ర‌వీణ్‌,శ్రీహాన్, […]

అలా అడిగితే.. కృతి అస్స‌లు ఒప్పుకోవ‌డం లేద‌ట‌?!

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకోవ‌డంతో పాటు తెలుగు ప్రేక్ష‌కుల మదిని గెలుచుకుంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఎలాగైనా కృతితో సినిమా చేసేందుకు పలువురు హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే సినిమాల ఎంపిక‌లో కృతిశెట్టి మాత్రం చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ట‌. వ‌చ్చిన ప్రాజెక్టున‌ల్లా ఒప్పేసుకోకుండా.. సినిమా క‌థ‌, త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త, రెమ్యున‌రేష‌న్ ఇలా అన్ని విష‌యాలు త‌న న‌చ్చితేనే సినిమాకు […]

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని పేర్కొన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు వేయడం ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యంగా వైయస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏపీలో పేద, […]

హీరో రామ్ ఇంట తీవ్ర‌ విషాదం!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. రామ్ తాతయ్య నేటి ఉద‌యం కన్నుమూశారు. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆయ‌న మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్‌ ఓ భావోద్వేగ ట్వీట్‌ పెట్టారు. తాతయ్య విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా ప్రారంభమై ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కుటుంబసభ్యులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు అందించడం కోసం ఆరోజుల్లో మీరు లారీ […]

వైరల్: బామ్మ చేసిన పనికి ఇంప్రెస్ అయిన జెనీలియా భ‌ర్త‌..?

ఈరోజుల్లో ఏవిషయం జరిగినా ఆ సంఘటనను సోషల్ మీడియాలో పంచుకోవడం అందరికీ అలవాటైపోయింది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా అనేది తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఉపయోగపడే ఒక ఫ్లాట్ ఫామ్ గా కూడా ఉపయోగపడుతోంది. కొందరు సోషల్ మీడియాను ఉపయోగించి పాపులర్ అవుతుంటే మరికొందరు మంచి గుర్తింపుతో ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడొక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ వృద్దురాలు ఆ ఆట ఆడిన తీరు చాలా మందిని పొగిడేలా చేసింది. ముసలామె […]

ఓటీటీలో `పాగ‌ల్‌`..క్లారిటీ ఇచ్చేసిన విష్వక్ సేన్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో విశ్వక్‌సేన్ తాజా చిత్రం పాగ‌ల్‌. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‏గా నటిస్తుంది. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‏తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే1న విడుద‌ల కావాల్సిన ఉంది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఈ చిత్రం థియేట‌ర్‌లో విడుద‌ల‌య్యే ఛాన్స్ […]

వైరల్ అవుతున్న నాజర్ న్యూ లుక్.. ?

టాలీవుడ్ లో వస్తున్న చిన్న సినిమాల్లో కంటెంట్ బాగుంటుంది. హీరో ఎవరనే సంబంధం లేకుండా కంటెంట్ పై నమ్మకంతోనే సినిమాలు చేస్తున్నారు. అలాంటి సినిమాలు పేరుతో పాటు లాభాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. తాజాగా అడవిలో జరిగిన సంఘటనల ఆధారంగా “నల్లమల” అనే ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది. రవిచరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమిత్ తివారి, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్ఎం నిర్మిస్తున్నారు. నాజర్, తనికెళ్ళ భరణి వంటి సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో […]

క‌రోనా టైమ్‌లో రిస్క్ చేస్తున్న `ఎఫ్ 3` టీమ్..?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. గ‌తంలో వ‌చ్చిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇంత‌లోనే క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు ప‌డ‌టంతో.. షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే తాజా స‌మాచారం […]

క‌మ‌ల్ హాస‌న్‌కు విల‌న్‌గా మారిన విజ‌య్ సేతుప‌తి?!

కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి ఒకే స‌మ‌యంలో అటు హీరోగానూ, ఇటు విల‌న్‌గానూ న‌టిస్తూ విల‌క్ష‌ణ న‌టుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌నకు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే లోకనాయకుడు కమల్ హాసన్ తాజా చిత్రం విక్ర‌మ్‌లో న‌టించే ఛాన్స్ విజ‌య్ సేతుప‌తికి ద‌క్కింది. లోకేష్ కనకరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌‌కి చెందిన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రంలో […]