మెగా మూవీ లో ఒక్క ఛాన్స్ ప్లీజ్..

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న 150వ సినిమాలో నటించేందుకు టాలీవుడ్‌ నుంచి నటీనటుల పోటీ ఎక్కువైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో చిరంజీవికి అత్యంత సన్నిహితులైన సినీ ప్రముఖులు ఈ సినిమాలో నటించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారట. వీరిలో ఏటీఎం శ్రీకాంత్‌ అందరికన్నా ముందున్నాడు. ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’, ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ సినిమాల్లో శ్రీకాంత్‌ ఏటీఎం పాత్రలో అలరించాడు. అయితే ఈ పాత్రకి ముందుగా రవితేజని అనుకున్నారు. కానీ రవితేజ ఆ పాత్ర పట్ల ఆసక్తి ప్రదర్శించకపోవడంతో, శ్రీకాంత్‌కి […]

రమ్యకృష్ణ మళ్ళీ హీరోయిన్ గా!

రమ్యకృష్ణ అంటే ఒకప్పుడు గ్లామర్‌ హీరోయిన్‌. ఆమె వేయని కాస్ట్యూమ్‌ లేదు. గ్లామర్‌ పండించడంలో ఆమెకు ఎలాంటి హద్దులు లేవు. అలా గ్లామర్‌ డాళ్‌గా టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన రమ్యకృష్ణ. కేవలం గ్లామర్‌ పాత్రలే కాకుండా, హుందాతనంగా ఉండే పాత్రలకు కూడా ప్రాణం పోసింది. హీరోయిన్‌గా తన హవా అయిపోయిన తరువాత కూడా తల్లి పాత్రల్లో మురిపించింది. ‘బాహుబలి’ సినిమాలో రాజమౌళి శివగామి పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకున్నారు. ఆయన ఈ పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకోవడానికి ఏమాత్రం […]

హోంమంత్రి రేసులో రెడ్డిగారికి ఛాన్స్‌! 

ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రిగా నిమ్మకాయల చినరాజప్ప బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆయన్ను తప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నారట. తుని విధ్వంసం ఘటనలో ప్రభుత్వ వైఫల్యం సుస్పష్టం. ఆ తర్వాత కూడా శాంతిభద్రతల నిర్వహణలో నిమ్మకాయల చినరాజప్ప అలసత్వం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారని సమాచారమ్‌. అయితే సామాజిక వర్గ సమీకరణాలు, కాపు ఉద్యమం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఇప్పటివరకూ ఆ విషయాన్ని బయటపెట్టలేదట. అతి త్వరలోనే చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారని, ఈ సమయంలో నిమ్మకాయల చినరాజప్పను తప్పిస్తారనీ […]

నాని పంట పండింది!

తాజాగా ‘జెంటిల్‌మెన్‌’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు నాని. వరుస విజయాలతో హ్యాట్రిక్‌ కొట్టిన నాని కెరీర్‌కి ఏ మాత్రం ఢోకా లేదు ఇంకొన్నాళ్లు. వరుస సినిమాలతో రావడమే కాకుండా, వచ్చిన ప్రతీ సినిమా విజయం సాధిస్తుంది. దాంతో దర్శక నిర్మాతలకు మినిమమ్‌ గ్యారంటీ హీరో అయిపోయాడు నాని. పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా రెట్టింపు లాభం ఆర్జించొచ్చు నానితో అని డిసైడ్‌ అయిపోయారు. దాంతో నానితో సినిమాలు చేయడానికి ఒకరి తర్వాత ఒకరు ముందుకొస్తున్నారు. ‘ఉయ్యాలా జంపాలా’ వంటి […]

పవన్ రికార్డ్ ని బ్రేక్ చేసిన NTR!

ఒకప్పుడు సినిమా అంటే కలెక్షన్స్,సెంటర్స్,50 డేస్ ,100 డేస్ ఈ లెక్కలవరకే.కానీ ఇప్పుడు కాలం మారింది.అంత సోషల్ మీడియా యుగం అయిపోయింది.సినిమా రిలీస్ కి ముందే ఫస్ట్ లుక్ అని,మోషన్ పోస్టర్ అని,టీజర్ అని,ట్రైలర్ అని నానా హంగామా చేస్తున్నారు.ఇదంతా ఒకెత్తు అయితే వాటికొచ్చే లైక్ లు సెన్సషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్, తాజాగా రిలీజ్ అయిన టీజర్తో మరోసారి రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. గతంలో పవన్ […]

శృతిహాసన్‌ ‘లవ్‌’ ఎవరో తెలుసా! 

‘ఆల్‌ ది బెస్ట్‌ తమ్మీ’ అని శృతిహాసన్‌ ట్వీటేసింది. ‘అభినేత్రి’ సినిమా కోసం తమన్నాకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన శృతిహాసన్‌, ‘తమ్మీ’ అని ముద్దుగా తమన్నాని కోట్‌ చేసింది. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అభినేత్రి’. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో తమన్నా డ్యూయల్‌ రోల్‌లో కనిపించనుంది. ఒకదానితో ఒకటి సంబంధం లేని రెండు వెరైటీ గెటప్స్‌లో దర్శనమివ్వనున్న తమన్నా, ‘అభినేత్రి’ సినిమాని ఛాలెంజింగ్‌గా తీసుకుంది. ఒక పాత్రకు అస్సలు గ్లామర్‌ […]

సంపత్‌ నంది ‘రచ్చ’ చేసేస్తాడా? 

యంగ్‌ డైరెక్టర్స్‌లో మంచి విజన్‌ ఉన్న దర్శకుడిగా సంపత్‌ నంది పేరొందాడు. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’, ‘బెంగాల్‌ టైగర్‌’ ఈ మూడు చిత్రాలతో సినీ పరిశ్రమ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. తృటిలో తప్పిపోయిందిగానీ లేదంటే ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ ఛాన్స్‌ మొదట సంపత్‌ నందికే దక్కింది. సంపత్‌ నంది అంటే మినిమమ్‌ గ్యారంటీ డైరెక్టర్‌. సరైన ఛాన్స్‌ కోసం చూస్తున్న ఈ యంగ్‌ డైరెక్టర్‌, గోపీచంద్‌తో సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఇంకో వైపున సంపత్‌ నందితో ఇంకోసారి వర్క్‌ […]

మహేషా మజాకా:లైన్లో అన్ని సినిమాలా!

‘బ్రహ్మూెత్సవం’ తర్వాతి సినిమాకి ఎక్కువగా హైప్‌ క్రియేట్‌ చేయకూడదని అనుకుంటున్నట్టున్నాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌. అంతా సైలెంట్‌గా చేసుకెళ్ళిపోతున్నాడట తన కొత్త సినిమా కోసం. మురుగదాస్‌ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాపై మహేష్‌ ఎంత వద్దన్నా హైప్‌ క్రియేట్‌ అవుతూనే ఉంటుంది. ఇంకో వైపున మురుగదాస్‌ తర్వాత చేయబోయే సినిమాల కసరత్తూ ఓ కొలిక్కి వచ్చిందని సమాచారమ్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా సినిమా ఎప్పుడో ఫైనలైజ్‌ అయిపోయింది. అయితే మురుగదాస్‌తో చేసిన తర్వాతే పూరితో […]

రాహుల్ స్వామి మాటల్ని నిజం చేస్తాడా?

ఈ తరం పొలిటీషియన్లలో రాహుల్‌ గాంధీ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌. ఆయనకు పెళ్ళంటే ఇష్టం లేదో, పెళ్ళి చేసుకుంటే రాజకీయాల్లో తన కుమారుడికి గుర్తింపు తగ్గిపోతుందేమోనని ఆయన తల్లి సోనియాగాంధీ భయపడుతున్నారోగానీ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అనిపించుకున్న రాజీవ్‌గాంధీ పుత్రరత్నం రాహుల్‌గాంధీకి ఇంకా పెళ్ళి కాలేదు. ఇంకెప్పటికీ పెళ్ళి చేసుకోడా? అని కాంగ్రెసు నాయకులే తమ యువ నాయకుడి గురించి ఆశ్చర్యపోతుంటారు. ఈ టైమ్‌లో బిజెపి నేత సుబ్రమణ్యస్వామి ట్విట్టర్‌ వేదికగా రాహుల్‌గాంధీ పెళ్ళిపై పంచ్‌లు […]