పవన్‌కళ్యాణ్‌కి శక్తి సరిపోదా?

పవన్‌కళ్యాణ్‌ ఎంత మాట అనేశాడు? ఎన్నికలకు ముందే పవన్‌కళ్యాణ్‌ ఈ మాట అని ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, ఈ రోజు పవన్‌కళ్యాణ్‌ని ప్రశ్నించేవారే కాదు. నన్ను నమ్మి భారతీయ జనతా పార్టీనీ, తెలుగుదేశం పార్టీనీ గెలిపించండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఈ ఇద్దరూ నెరవేర్చకపోతే మీతోపాటు ఉండి నేనూ వారిని ప్రశ్నిస్తానని చెప్పిన పవన్‌కళ్యాణ్‌, ఇప్పుడు ప్రశ్నించడానికి తన శక్తి చాలదనడం శోచనీయం. రాజకీయాల్లో అపరిపక్వతకి పరాకాష్ట ఇది అని పవన్‌కళ్యాణ్‌ని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారంటే, దానికి కారణం […]

ఆది కన్నడ సినిమా పక్కా.

తెలుగు సినిమాల్లో డైలాగ్‌ కింగ్‌గానూ, మంచి నటుడిగానూ సాయికుమార్‌కి పేరు ఉంది. అయితే తెలుగుతో పాటు కన్నడంలో కూడా చాలా ఫాలోయింగ్‌ ఉంది సాయికుమార్‌కి. ఈయన తనయుడు తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన యంగ్‌ హీరోగా తన హవా చూపిస్తున్నాడు. కానీ సాయికుమార్‌కి కొడుకు విషయంలో ఏదో తెలీని వెలితి ఉంది.తెలుగులో ఆశించినంతగా రాణించలేకపోతున్నాడు ఆది. దాంతో కన్నడ పరిశ్రమ మీద దృష్టి పెట్టాడు సాయికుమార్‌. తనయున్ని ఎలాగైనా కన్నడంలో పాపులర్‌ హీరోని చెయ్యాలని తలంచాడు. […]

నెపోలియన్ కాదు ఖైదీ నెంబర్ 150 ఫైనల్

మెగా మూవీ టైటిల్ కంఫర్మ్ అయింది.చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాలైన ఖైదీ,ఖైదీ నెంబర్ 786 సెంటిమెంట్ కలిసొచ్చేలా ప్రతిష్టాత్మక చిరు 150 వ చిత్రానికి “ఖైదీ నెంబర్ 150’’ అనే టైటిల్ ని ఖరారు చేశారు.ఈ విషయాన్నీ స్వయంగా చిత్ర నిర్మాత రామ్ చరణ్ ప్రకటించడం తో ఊహాగానాలకు ఇక తెరపడినట్లే. ఇప్పటికే ఈ సినీ షూటింగ్ శెరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా మూవీ తమిళ్ లో విజయ్ […]

పవన్ బాబా ‘ప్రత్యేక’ పురాణం

ఎట్టకేలకు ప్రశ్నించే నాయకుడు స్పందించాడండోయ్..ప్రశించాడనేలేదు ఇక్కడ కేవలం స్పందించాడు.ఈయన స్పందించే నాయకుడో ప్రశ్నించే నాయకుడో అర్థం కావడం లేదు.ఈపాటికి అర్ధమయ్యే ఉంటుంది ఆయనే జనసేన అధ్యక్షుడు ప్రశ్నించడానికే పుట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ప్రత్యేక హోదా అంశం పైన చాలా కూల్ గా చాలా రిలాక్స్డ్ గా స్పందించారు పవన్.ఒక పక్క పార్లమెంట్ లో బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వం మొర్రో అని గొంతు చించుకు అరుస్తుంటే..ఇంకోవైపు రాష్ట్ర ప్రజానీకం అంతా ఏకమై ప్రత్యేక […]

నాన్నకు ప్రేమతో అంటున్న రాంచరణ్

మెగా అభిమానులంతా చిరంజీవి 150వ సినిమా ఫస్ట్ లుక్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను టైటిల్‌తో పాటే ఈనెల 22న విడుదల చేసేందుకు నిర్మాత, చిరు తనయుడు రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు. చెప్పిన తేదీకే పక్కాగా ఫస్ట్‌లుక్ వచ్చేస్తుందని తెలుపుతూ, చరణ్ ఇటీవలే ఓ ప్రీ లుక్‌ను కూడా విడుదల చేశారు. చిరు పుట్టినరోజున పెద్ద […]

ఎన్టీఆర్ నా ప్రాణం కంటే ఎక్కువ.

ఎన్టీఆర్‌ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయనని హీరో మంచు మనోజ్‌ అంటున్నాడు. ట్విట్టర్‌ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్‌ ఈ సమాధానం ఇచ్చాడు. ‘అన్నా మీకు ఎన్టీఆర్‌ అంటే ఎంత ఇష్టం?’ అని ఓ ఫ్యాన్ మనోజ్‌ను ప్రశ్నించాడు. దీనికి రెస్పాన్స్‌గా మనోజ్‌ ‘నా ప్రాణం లెక్కచేయనంత(స్మైల్‌)’ అని ట్వీట్‌ చేశాడు. ఇంకేముంది ఈ ట్వీట్‌ చూసిన ఎన్టీఆర్‌ అభిమానులంతా ధన్యవాదాలు, సూపర్‌ అన్నా అని కామెంట్స్‌ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్‌ […]

బుల్లి పవర్ స్టార్ బుల్లితెరపై!

పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తాడా అని మెగా ఫ్యాన్స్‌ అంతా ఆసక్తితో ఉన్నారు. అకీరా ఓ మరాఠీ చిత్రంలో చేసినా అది మనదగ్గరకు ఇంకా రాలేదు. ఇదిలా ఉంటే, అకీరా నందన్ నటించినసదరు సినిమా త్వరలోనే టీవీలో రాబోతోంది. 2014వ సంవత్సరంలో రేణు దేశాయ్ ఒక కథను రాసి తానే దర్శక నిర్మాతగా ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అకీరా  ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. […]

అన్నదమ్ములే కానీ అక్కడ మాత్రం కాదు

తమిళ అగ్రకథానాయకులు సూర్య, కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరికీ తెలుగులోనూ ఎంతో క్రేజ్‌తో పాటూ మంచి మార్కెట్ కూడా ఉంది. తమిళంతో పాటుగా తెలుగులోనూ వీళ్ల సినిమాలు విడుదలై విజయాలు నమోదు చేస్తుంటాయి. ప్రస్తుతం సూర్య ‘సింగం 3’ సినిమా చేస్తున్నాడు. ఇక కార్తీ ‘కాష్మోరా’ చేస్తున్నాడు .. రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. గతంలో సింగం 1, సింగం 2 సినిమాలతో సూర్య ఘనవిజయాలు అందుకున్నాడు. దీంతో సింగం 3 పై భారీ అంచనాలే […]

ఆమాత్రం గ్లామర్ లేకపోతే ఎలా

గ్లామర్‌ షో తప్పుకాదన్నది కొందరి హీరోయిన్‌ల మాట. వాటిని సమర్థించుకోవడానికి వారి వద్ద సవాలక్ష సమాధానాలుంటాయి. రాశీ ఖన్నా కూడా ఓ కొత్త ఫార్ములా సెలవిస్తోంది. తాము అందంగా కనిపించేది హీరోల కోసమే అంటోంది. ఎందుకంటే కథానాయకులు ఏం చేసినా చూస్తారు. ఎలాగున్నా స్వీకరిస్తారు. వాళ్ల పేరుకి, వాళ్ల ఇమేజ్‌కీ అంత శక్తి ఉంది. కానీ కథానాయికలకు ఆ సౌలభ్యం ఉండదట. తెరపై కథానాయకుల పక్కన హీరోయిన్లు కనిపించాలంటే… కచ్చితంగా గ్లామర్‌గా ఒలకబోయాల్సిందే అని చెప్తోంది. లేకుంటే […]