తెలంగాణ ఉద్యమ సమయంలో వందల మంది ఉద్యోగులను ఒక్కమాటతో కదిలించిన నేత, ఉద్యమానికి ఉద్యోగుల సైడ్ నుంచి ఊపిరులూదిన నేత దేవీప్రసాద్ భవితవ్యం ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందట! కేసీఆర్‌ను నమ్ముకుని తెలంగాణ ఉద్యమం అనంతరం ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆయన తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. అయితే, అనంతరం ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించలేకపోయారు. దీంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. అయితే, తనను కేసీఆర్ పట్టించుకుంటారని, పార్టీలో ఏదన్నా పదవిని ఇస్తారని దేవీ భావించారు. అయితే, కేసీఆర్ నుంచి […]
Author: admin
హోదాపై పవన్ సర్వే.. కొత్త కార్యాచరణ!
ప్రశ్నిస్తానంటూ పొలిటికల్ కలరింగ్ ఇచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ప్రత్యేక హోదా విషయంలో అన్నంత పనీ చేశారు. కేంద్రాన్ని దుమ్ము దులిపేస్తున్నాడు. హోదా ఇస్తామని ఆనాడు చెబితేనే తాను ప్రచారం చేశానని, అప్పుడు తెలియదా? అంటూ కేంద్రాన్ని నిలదీశాడు. అయితే, కేంద్రం మాటమార్చి ప్యాకేజీ ఇవ్వడం దానికి చంద్రబాబు తలాడించడం జరిగిపోయాయి. అంతేకాదు, ఈ ప్యాకేజీకి రేపో మాపో చట్టబద్ధత కూడా వచ్చేయనుంది. మరోపక్క, తమిళనాడు జల్లికట్టు ఉదంతంతో ఏపీ యువత హోదాపై కదం తొక్కేందుకు సిద్ధమైన […]
టీడీపీకి ఎర్తుపెట్టేలా వైకాపా ప్లాన్లు!
జగన్ నేతృత్వలోని వైకాపా 2019 ఎన్నికలపై దృష్టి పెట్టింది! ఇప్పటి నుంచే సంస్థాగతంగా బలం చేకూర్చుకోకపోతే.. పార్టీ అధికారంలోకి రావడం కష్టమని భావించిన జగన్.. బలంగా ఉన్న టీడీపీని దెబ్బకొట్టేందుకు పక్కా ప్లాన్లతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రెండు రకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. వాటిలో ప్రధానమైంది.. టీడీపీ పట్టుకొమ్మలుగా ఉన్న జిల్లాల్లో వైకాపా గాలి వీచేలా చేయడం, రెండోది.. తన పార్టీ నుంచి జంప్ చేసి సైకిలెక్కిన ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి ఆహ్వనించడం, […]
ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఇన్ ఎవరు..? అవుట్ ఎవరు..?
ఏపీ కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. ముహూర్తం ఇంకా నిర్ణయించనప్పటికీ చంద్రబాబు ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతేకాదు, సీఎం తన తనయుడు లోకేష్ బాబుని కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్టు కూడా చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ మీదే చర్చోపచర్చలు సాగుతున్నాయి. కొన్ని వర్గాల కథనం మేరకు సీఎం గత ఏడాది నిర్వహించిన ఇంటిలిజెన్స్ సర్వేలో ఆశించిన మార్కులు రాని మంత్రులకు ఈ ప్రక్షాళనలో మంగళం పాడతారని తెలిసింది. ముఖ్యంగా విభజన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం […]
చిన్నమ్మకు షాక్: పన్నీర్ కు డీఎంకే మద్దతు
తమిళనాట సంక్షోభం దిశగా రాజకీయాలు అడుగులు వేస్తున్నాయి. మాజీ సీఎం, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ సీఎం పీఠం ఎక్కేందుకు గల అన్ని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటున్నారు. అయితే ఇన్నాళ్లూ శాంతి మార్గాన్ని ఎంచుకున్న మాజీ సీఎం, జయకు నమ్మిన బంటు పన్నీర్ సెల్వం ఒక్కసారిగా తిరుగుబాటు బావుగా ఎగరవేశారు. శశికళపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని చెప్పడంతో శశికళ వర్గంలో గుబులు రేకెత్తించారు. అంతేగాక ఇప్పుడు డీఎంకే […]
టీ మంత్రికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా కారణాలు ఇవే!
తెలంగాణలో నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్న శాఖ ఏదైనా ఉందంటే అది.. వైద్య, ఆరోగ్య శాఖ! ప్రభుత్వాసుపత్రు ల్లోనే వైద్యం చేయించుకోవాలని ఒకపక్క ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే.. మరోపక్క ఆ ఆసుపత్రుల్లో మరణాలు ప్రభుత్వానికీ, ఆ శాఖ మంత్రికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారికి కష్టాలు తప్పడం లేదు! ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో బాలింతల మరణాలు, నీలోఫర్ ఆసుపత్రుల్లో చిన్నారి ప్రవళిక మృతితో వైద్య శాఖ తీవ్రంగా […]
జయకు శశికళకు మధ్య తోపులాట … అసలు ఏమి జరిగింది ?
తమిళనాట రాజకీయాలు ఊహించని మలుపులతో థిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి! అధికారం కోసం జరుగుతున్న ఆధిపత్య పోరులో.. ఎన్నో ట్విస్ట్‌లు నమోదవుతున్నాయి! ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో జయ నెచ్చెలి శశికళపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో శశికళపై అసెంబ్లీ మాజీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయ ఆసుపత్రిలో చేరిన రోజు రాత్రి ఏమయిందో బట్టబయలు చేశారు! సెప్టెంబరు 22న పోయెస్ గార్డెన్‌లో శశికళకు, జయకు మధ్య తోపులాట జరిగిందని, అందులోనే జయను శశికళ తోసేయడంతోనే ఆమె […]
డబుల్ మీనింగ్ హెడ్డింగులే వెబ్ సైట్ల టార్గెట్
వార్తా ప్రపంచంలో వినూత్న ఆలోచనలకు తెరదీస్తూ.. దాదాపు దశాబ్దం కిందట ఆవిర్భవించిన సోషల్ మీడియా సైట్లు.. ప్రజలకు మంచి చేస్తున్నాయా? చెడు చేస్తున్నాయా? అంటే చెప్పడం ఒకప్పుడు కష్టంగా ఉండేది. కానీ, ఇటీవల కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన సైట్లు.. సంచలనాలకు మాత్రమే వేదికగా మారాలని తెగ ఉబలాట పడిపోతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల మరింతగా పెరిగిపోయిన సైట్ల పైత్యం అటు సామాన్యులను ఇటు సమాజంలో పేరున్న వారిని సైతం ఇబ్బంది పెడుతున్నాయనడంలో వెనుకాడవలసిన అవసరం లేదు. […]
తమిళనాడు సీఎం పీఠంతో బీజేపీ గేమ్!
తమిళనాడు రాజకీయాలు కీలక మలుపుతిరిగాయి! ప్రస్తుతం తమిళ రాజకీయాలు ఢిల్లీ కేంద్రంగా శాసించ బడుతున్నాయి. ఏరికోరి సీఎం పీఠం ఎక్కాలని కలలు కన్న శశికళ కేంద్రంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్లికట్టు ఆడేస్తోంది! శశికళను సీఎం కాదుకదా.. ఆ సీటు దగ్గరకు కూడా వెళ్లకుండా ప్లాన్ మీద ప్లాన్ ప్లే చేసేస్తూ.. ఇందిరాగాంధీ హయాంలో వ్యవహరించిన కాంగ్రెస్‌ను తలదన్నేలా బీజేపీ వ్యవహరిస్తోంది. విషయంలోకి వెళ్లిపోతే.. తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత […]