ఆ ముగ్గురి చేతిలో అడ్డంగా బుక్ అయిన ఎన్టీఆర్

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న జ‌న‌తా గ్యారేజ్ హిట్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఎన్టీఆర్ కొత్త సినిమా ఎట్ట‌కేల‌కు ఇటీవ‌లే ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మించే ఈ సినిమాకు ప‌వ‌ర్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు జై-ల‌వ‌-కుశ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ని..ఈ మూడు క్యారెక్ట‌ర్ల‌కు త‌గ్గ‌ట్టుగా ఎన్టీఆర్ ప‌క్క‌న ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తార‌ని కూడా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. […]

ఏపీలో సీన్ రివర్స్…వైసీపీలోకి జోరుగా వలసలు

ఏపీ రాజ‌కీయాల్లో షాకింగ్ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేల‌ను, నాయ‌కుల‌ను త‌న పార్టీలో చేర్చేసుకుంది. అయితే గ‌త కొద్ది రోజులుగా ఇత‌ర పార్టీల‌కు చెందిన సీనియ‌ర్లు, నాయ‌కులు, మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల వార‌సులు వ‌రుస‌గా జ‌గ‌న్ గూటికి చేరుతున్నారు. ఈ క్ర‌మంలోనే నిన్న తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొప్ప‌న మోహ‌న్‌రావు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. ఇక ఇప్పుడు వంతు క‌ర్నూలు జిల్లాకు […]

తమిళనాడు గవర్నర్ ఇప్పుడైనా పనిచేస్తారా?!

త‌మిళ‌నాడులో ఇప్పుడు కొంద‌రు ఊహించిన ప‌రిణామాలే జ‌రిగిపోయాయి. సీఎం పీఠం ఎక్కుతాన‌నుకున్న శ‌శిక‌ళ‌ అక్ర‌మాస్తుల కేసులో జైలుకెళ్లారు. దీంతో ఇక‌, రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఏర్పాటు ప‌రిస్థితి ఏమిటి? అనేది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. వాస్త‌వానికి అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు శ‌శిక‌ళ పంచ‌న చేరిపోయారు. వారంతా చిన్న‌మ్మ‌కే మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు. అంతేకాదు, వీరి సంత‌కాల‌తో కూడిన లేఖ‌ను శ‌శిక‌ళ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర‌రావుకి కూడా అంద‌జేసింది. అయిన‌ప్ప‌టికీ.. సుప్రీం కోర్టు కేసు చూపుతూ అప్ప‌ట్లో గ‌వ‌ర్న‌ర్ ఆమెను ప్ర‌భుత్వ ఏర్పాటుకు […]

స్టార్ హీరో కుమార్తెతో మెగాస్టార్ రొమాన్స్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి త‌న కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టాడు. చిరు రీ ఎంట్రీ ఎలా ఉండాలో అదే రేంజ్ హిట్‌ను ఖైదీ ఇచ్చింది. ఈ సినిమా నాన్ బాహుబ‌లి రికార్డుల‌కు పాత‌రేసి ఏకంగా రూ.100 కోట్ల షేర్ మార్క్ కూడా క్రాస్ చేసేసింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చిరు త‌న నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నాడు. చిరు 151వ సినిమా ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ […]

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాలయ్య పవర్ పనిచేసేనా?!

అనంత‌పురంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానం  ఖాళీ కానుంది. ప్ర‌స్తుతం స్థానిక సంస్థ‌ల త‌ర‌ఫున ఎమ్మెల్సీ స్థానం టీడీపీ చేతిలో నే ఉంది. మెట్టు గోవింద రెడ్డి స్థానిక సంస్థ‌ల త‌ర‌ఫున ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే, ఈయ‌న ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. దీంతో ఈ స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, స్థానిక సంస్థ‌ల్లో టీడీపీకి బ‌లం ఉండ‌డంతో ఈ స్థానంలో ఎవ‌రు నిల‌బ‌డ్డా గెలుపు ఖాయం. దీంతో టీడీపీలో ఇప్పుడు […]

ఆవేదన, ఆక్రోశానికి గురై … అమ్మ సమాధిని కొట్టిన శశికళ

క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయి. ఇక ఎక్కి కూర్చోవ‌డ‌మే లేటు అనుకున్న సీఎం సీటు ప‌దేళ్లపాటు దూరం జ‌రిగిపోయింది! ఈ ప‌రిణామం ఊహించ‌నైనా ఊహించ‌లేదు దివంగ‌త త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ‌.  అక్ర‌మార్జ‌న కేసులో సుప్రీం తీర్పుకి ఆమె హ‌తాశురాలైంది. అంతేకాదు, ఆమెకు సుప్రీం నుంచి ఊర‌ట కూడా ల‌భించ‌లేదు. నెల రోజుల పాటు విరామం ప్ర‌క‌టించాల‌న్న ఆమె అభ్య‌ర్థ‌న‌కు కూడా సుప్రీం అంగీక‌రించ‌లేదు. దీంతో చివ‌రాఖ‌రికి కోర్టులో లొంగిపోవాల్సి వ‌చ్చింది. ఈ ప‌రిణామంతో ఒక్క‌సారిగా ఆవేద‌న‌, ఆక్రోశానికి […]

ముహూర్తం ఫిక్స్: బాబు కేబినెట్ ప్రక్షాళన మార్చి 1

ఏపీ కేబినెట్లో మార్పులు చేర్పుల‌కు ముహూర్తం ఫిక్స‌యిపోయింది. గ‌త ఏడాది ద‌స‌రాకి ముందు నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చంద్ర‌బాబు కేబినెట్ ప్ర‌క్షాళ‌న మార్చి 1న చేస్తార‌ని వెల్ల‌డైంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు అంద‌రి దృష్టీ అమ‌రావ‌తిపై ప‌డింది. ఇక‌, త‌న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సంబంధించి చంద్ర‌బాబు వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు వెళ్తున్నారు. త‌న త‌న‌యుడు లోకేష్ కి మంత్రి వ‌ర్గంలో సీటు ఖ‌రారైన నేప‌థ్యంలో ఆయ‌న‌ను ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేయ‌నున్నారు. ఈ […]

అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వారం రోజుల ల‌గ్జ‌రీ ఖ‌ర్చెంతో తెలుసా

తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ఉత్కంఠ ప‌రిణామాల‌తో ఎట్ట‌కేల‌కు స‌మ‌సిపోయింది. జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ సీఎం పీఠం ఎక్కాల‌న్న ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి. ఇక ఇప్పుడు సీఎం పీఠం రేసులో అమ్మ న‌మ్మిన‌బంటు ప‌న్నీరుసెల్వం వ‌ర్సెస్ చిన్న‌మ్మ న‌మ్మిన‌బంటు ప‌ళ‌నిస్వామి మాత్ర‌మే ఉన్నారు. శ‌శిక‌ళ‌కు అక్ర‌మాస్తుల కేసులో నాలుగు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష ప‌డ‌డంతో రేపోమాపో ఆమెను పోలీసులు అరెస్టు చేయ‌డం ఖాయం. ఇక ఇప్పుడు శ‌శిక‌ళ‌కు మ‌ద్ద‌తు తెలిపిన ఎమ్మెల్యేల్లో భ‌యం ప‌ట్టుకుంది. ప‌ళ‌నిస్వామికి మ‌ద్ద‌తు ఇస్తే […]

శశికళకు భారీ షాక్ … పన్నీరు గూటికి పలువురు ఎమ్మెల్యేలు

తమిళనాడులోనే అతిపెద్ద పార్టీలలో ఒకటైన అన్నాడీఎంకే రెండున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత భారీ చీలిక దిశ‌గా వెళుతోంది. ద‌క్షిణాదిలో పెద్ద రాష్ట్రాల‌లో ఒక‌టి అయిన తమిళ‌నాడు రాజ‌కీయాల్లో ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఈ పార్టీని 1972లో ఎంజీ రామచంద్రన్ స్థాపించారు. ఎంజీఆర్ త‌ర్వాత ప్ర‌ముఖ సినీన‌టి జ‌య‌ల‌లిత ఈ పార్టీని రెండున్న‌ర ద‌శాబ్దాల పాటు త‌న క‌నుసైగ‌ల‌తో న‌డిపించారు. గ‌తంలో ఎంజీఆర్ చ‌నిపోయిన‌ప్పుడు రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన ఈ పార్టీ ఇప్పుడు మ‌రోసారి భారీ చీలిక ద‌శగా […]