క్రైసిస్‌లో టీడీపీ.. కార‌ణాలు ఇవేనా..? 

ఏపీ సీఎం చంద్ర‌బాబు కుల‌ స‌మీక‌ర‌ణాలు త‌ప్పాయి! ప్రాంతాల వారీగా స‌మ‌న్యాయం పాటించామ‌ని చెబుతున్న ఆయ‌న‌ లెక్క‌లు ఎక్క‌డో బెడిసికొట్టాయి! మంత్రి వ‌ర్గ‌విస్త‌ర‌ణ‌లో నూటికి నూరు శాతం అన్ని వర్గాల‌కు న్యాయం చేశామ‌ని, లెక్క‌ల‌న్నీ పాటించాన‌ని ఆయన బ‌ల్ల గుద్ది మ‌రీ చెబుతున్నా.. పార్టీ శ్రేణులు మాత్రం ఆయ‌న‌కు మార్కులు వేసేందుకు వెనుకాడుతున్నాయి. మొత్తానికి ఏపీ క్యాబినెట్ విస్త‌ర‌ణతో రేగిన అల‌జ‌డి నివురుగప్పిన నిప్పులా ఇంకా కొనసాగుతోంది. రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్న‌త‌రుణంలో పార్టీలో ఈ సంక్షోభం.. ప్ర‌తిప‌క్షాల‌కు […]

దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్ ఫ్యూచ‌ర్ ఏంటి..!

ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లోనే కాదు అప్ప‌ట్లో స‌మైక్యాంధ్ర‌లోనే కాక‌లు తీరిన యోధుడిగా పేరున్న మాజీ మంత్రి దేవినేని రాజ‌శేఖ‌ర్ (నెహ్రూ) ఈ రోజు ఆక‌స్మికంగా మృతిచెందారు. కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న ఓసారి ఎన్టీఆర్ హ‌యాంలో మంత్రిగా కూడాప‌నిచేశారు. కంకిపాడు నుంచి 1983-1985-1989-1994ల‌లో టీడీపీ త‌ర‌పున గెలిచిన నెహ్రూ…టీడీపీ ఆవిర్భావ స‌మ‌యంలో ఆయ‌న ఎన్టీఆర్ వైపే ఉన్నారు. ఎన్టీఆర్ చ‌నిపోయేంత వ‌ర‌కు టీడీపీలోనే ఉన్న నెహ్రూ ఆ త‌ర్వాత […]

త‌మిళ‌నాట మ‌రోసారి రాజ‌కీయ సంక్షోభం?

త‌మిళనాడు సీఎం పీఠాల‌ని ఎక్కాల‌ని భావించి భంగ‌ప‌డి.. జైలులో ఊచ‌లు లెక్క‌బెడుతున్న‌ శ‌శిక‌ళ‌కు ఊహించ‌ని షాక్ ఎదుర‌వబోతోంది. తాను లేక‌పోయినా.. త‌న వ‌ర్గ‌పు వారిని పార్టీ కార్య‌ద‌ర్శిగా నియ‌మించి అక్క‌డి నుంచే చ‌క్రం తిప్పాల‌ని భావించిన ఆమెకు.. అన్నాడీఎంకే మంత్రులు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను ఆ పదవి నుంచి తొలగించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. అంతేగాక ఇందుకు సంబంధించి ప‌క్కా స్కెచ్ కూడా వీరు […]

ప‌వ‌న్ విషయంలో జ‌గ‌న్ ముందు జాగ్ర‌త్త‌

ప్ర‌త్య‌ర్థులు ఏం చేస్తున్నారు? ఎలాంటి వ్యూహాలు అమ‌లుచేస్తున్నారు. వాటి కంటే ముందుగా ఏం చేయాలి? అనే విష‌యాలు రాజ‌కీయాల్లో నిరంత‌రం ప‌రిశీలిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇదే ప‌నిలో ప‌డ్డార‌ట ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌! ఇంత‌కీ ఆయ‌న ఆరా తీస్తున్న‌ది ఎవ‌రి గురించో తెలుసా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి! సీఎం చంద్ర‌బాబు గురించి ఆలోచించ‌డం మాని.. ప‌వ‌న్ గురించి ఎందుకు అని అనుకుంటారేమో! దీనికి ఓ లెక్క ఉంద‌ట‌. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ […]

బాల‌కృష్ణ హిట్ సినిమా లాక్కున్న ఎన్టీఆర్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కేరీర్‌లో వ‌చ్చిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్‌కు చాలా త‌క్కువ యేజ్‌లోనే తిరుగులేని స్టార్‌డ‌మ్‌ను తీసుకువ‌చ్చింది. 2003లో వ‌చ్చిన సింహాద్రి అప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న రికార్డుల‌న్నింటిని తిర‌గ‌రాసింది. సింహాద్రి ఎన్టీఆర్‌ను సూప‌ర్‌స్టార్‌ను చేస్తే, రాజ‌మౌళిని స్టార్ డైరెక్ట‌ర్‌గా మార్చేసింది. ఈ సినిమాకు కథ అందించింది రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌. తాజాగా ఆయన చాలా రోజుల త‌ర్వాత ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ సినిమాకు క‌థ‌ను ఎన్టీఆర్ […]

బోండాకు స‌మ‌యం చూసి వాత‌పెడ‌తారా?

తాము ఆశించిన ప‌ద‌వులు ద‌క్క‌ని సంద‌ర్భాల్లో నేత‌లు తీవ్ర అసంతృప్తికి గుర‌వ‌డం.. అధిష్ఠానంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మే!! ఒక్కోసారి ప్ర‌భుత్వ విధానాలపైనే మాట్లాడి అటు అధిష్ఠానం దృష్టిలో, ఇటు ప్ర‌జ‌ల దృష్టిలో చుల‌క‌న‌గా మిగిలిపోతారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు ప‌రిస్థితి కూడా ఇలానే మారింది. కాపుల అభివృద్ధికి ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నామ‌ని ఒక‌ప‌క్క టీడీపీ పెద్ద‌లంతా నొక్కిచెబుతుంటే.. కాపుల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని వ్యాఖ్యానించి.. అధిష్ఠానం దృష్టిలో నోటెడ్ అయ్యారు. అయితే వివాదం స‌ద్దుమ‌ణిగినా.. మ‌రి […]

2019 బెజ‌వాడ టీడీపీ ఎంపీ సీటు మూడు ముక్క‌లాటేనా..!

ఏపీలో రాజ‌కీయ చైత‌న్యానికి పురిటిగ‌డ్డ కృష్ణా జిల్లా. ఇక బెజ‌వాడ రాజ‌కీయం తెలుగు రాష్ట్రాల్లోనే ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. కీల‌క‌మైన విజ‌య‌వాడ ఎంపీ అయ్యేందుకు వివిధ పార్టీల త‌ర‌పున ఎంపీ సీటు ద‌క్కించుకునేందుకు అక్క‌డ నాయ‌కులు చేయ‌ని ప్ర‌య‌త్నాలు అంటూ ఉండ‌వు. ఏపీలో విజ‌య‌వాడ ఎంపీ సీటుకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇక్క‌డ నుంచి ఎంతోమంది మ‌హామ‌హులు, పారిశ్రామిక‌వేత్త‌లు లోక్‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు ఎంపీగా గెలిచిన ల‌గ‌డ‌పాటి ఆ త‌ర్వాత […]

కొడుక్కి రూల్స్ పెట్టిన చంద్ర‌బాబు

ఏదైనా ఒక విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డం ఎంత ముఖ్య‌మో.. అందులో త‌ప్పుడు లేకుండా మాట్లాడ‌టం కూడా అంతే ముఖ్యం! మ‌రీ ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ లాంటి వారికి మ‌రింత కీల‌కం!! అందుకు కొడుకు వేస్తున్న త‌ప్ప‌ట‌డుగుల‌ను స‌రిదిద్దేందుకు చంద్ర‌బాబు వెంట‌నే రంగంలోకి దిగార‌ట‌. క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో స్టిక్ట్‌గా ఉండే చంద్ర‌బాబు.. అంత‌కంటే స్ట్రిక్ట్ గా కొడుకు దగ్గ‌ర వ్య‌వ‌హ‌రించా ర‌ట‌. ముఖ్యంగా తెలుగు విష‌యంలో త‌డ‌బ‌డుతున్న కొడుక్కి […]

టీడీపీ నుంచి ఆ ఎంపీ స‌స్పెన్ష‌న్‌..!

పార్టీ, సీఎం చంద్ర‌బాబుపై త‌న అసంతృప్తిని బ‌హిరంగంగా వ్య‌క్తం చేసిన చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ త‌న పోరు కొన‌సాగిస్తున్నారు. ఈవిష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్‌గా తీసుకున్నారు. బుజ్జ‌గింపుల‌కు లొంగక‌పోవ‌డంతో.. ఆయ‌న‌పై వేటు త‌ప్ప‌ద‌ని అంతా స్ప‌ష్టంచేస్తున్నారు. వేటువేస్తే ఆయ‌న త‌దుప‌రి అడుగు ఏంటి? అనేది ఇప్పుడు అంద‌రిలోనూ మెదులుతోంది. `బ‌తికి ఉన్నంత‌కాలం చిత్తూరు ఎంపీని నేనే` అని ఆయ‌న ధీమాగా చెబుతున్నారు. సస్పెండ్ అయితే.. ఇక వైసీపీలో ఆయ‌న‌ చేరే అవ‌కాశాలున్నాయ‌నే చ‌ర్చ ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో […]