వరుస కష్టాలతో విలవిల్లాడుతోన్న ఏపీ విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్‌కు మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. కీలకమైన విశాఖ నగరానికి ఆనుకునే ఉన్న భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం పార్టీకి గుడ్ బై చెప్పపేశారు. గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన సీతారాం జగన్ తీరుతో విసిగిపోయి తాను పార్టీకి గుడ్ బై చెపుతున్నట్టు ప్రకటించారు. పార్టీ వీడుతున్న సందర్భంగా మీడియా సమావేశం పెట్టిన ఆయన […]
Author: admin
రాజమౌళి కటాక్షం కోసం అల్లు వారి ప్రదక్షిణలు
బాహుబలికి ముందు వరకు రాజమౌళి కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన దర్శకుడు. బాహబలి 1, 2ల తర్వాత రాజమౌళి పేరు విశ్వవ్యాప్తమైంది. బాహుబలి రెండు పార్టులతో ఇప్పటి వరకు కలుపుకుంటే రూ. 2100 కోట్ల వసూళ్లు ఈ సినిమా సొంతమయ్యాయి. బాహుబలి 2 ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1500 కోట్ల వసూళ్లను రాబట్టి బాలీవుడ్ సినిమాలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. బాహుబలి 2 అంచనాలకు మించి ఆడేసింది. దీంతో ఇప్పుడు […]
ఆ హీరో రిజెక్ట్ కానీ ఎన్టీఆర్ ఓకే
మూడు వరుస హిట్లతో సూపర్ సక్సెస్‌లో ఉన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేఎస్.రవీంద్ర (బాబి) డైరెక్షన్‌లో జైలవకుశ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజే రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. డైరెక్టర్ బాబి ఈ కథను ఎన్టీఆర్ కోసం రాసుకోలేదట. మాస్ మహారాజ్ రవితేజ్ కోసం ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడట. బాబి ఫస్ట్ సినిమా […]
గుంటూరు వైసీపీ అభ్యర్థుల్లో ఇన్ – అవుట్ లిస్టు
2019 ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించకపోతే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమని డిసైడ్ అయిన జగన్ ఆ ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటి నుంచే రకరకాల ప్రణాళికలతో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 17 ఎమ్మెల్యే స్థానాలకు గాను ఐదుగురు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత చాలా మంది సిట్టింగ్ ఇన్‌చార్జులకు షాకులు ఇచ్చి […]
బాహుబలిని చూసి చిరు వాతలు..!
ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. కోలీవుడ్‌లో ఆల్రెడీ హిట్ అయిన కత్తి సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా అంత గొప్పగా లేకున్నా మెగాస్టార్ ఛరిష్మాతో ఇండస్ట్రీ టాప్ హిట్ అయ్యి కూర్చుంది. వాస్తవానికి ఈ సినిమా నిర్మాణ విషయంలో చిరు సలహా మేరకు నిర్మాతగా ఉన్న చెర్రీ చాలా సేఫ్ గేమ్ ఆడాడు. చాలా తక్కువుగా ఖర్చు చేశారు. దీంతో సినిమాకు మంచి లాభాలే వచ్చాయి. ఖైదీ […]
కృష్ణా జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టిక్కెట్
2019 ఎన్నికల వేళ ఏపీలో చాలా జిల్లాల్లో రాజకీయ వాతావరణం ఊసరవెల్లి రంగులు మార్చిన విధంగా… ఊహకు అందకుండా ఉండేలా ఉంది. మరోసారి అధికారం నిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోన్న టీడీపీ, తొలిసారి అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోన్న విపక్ష వైసీపీ, తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తోన్న జనసేన పార్టీల మధ్య రసవత్తర సమరం జరగనుంది. ఇదిలా ఉంటే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తోన్న ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో అనూహ్యమైన […]
గ్రేటర్ లో పాగా వేసేందుకు బీజేపీ బడా ప్లాన్
తెలంగాణలో తిరుగులేకుండా జెట్ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోన్న అధికార టీఆర్ఎస్ దూకుడును నిలువరించేందుకు విపక్ష బీజేపీ సరికొత్త అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో బలోపేతం అయ్యేందకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌ను బీజేపీ మెయిన్‌గా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నాయకులు అయిన మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, మాజీ […]
కొత్త నియోజకవర్గంపై చింతమనేని కన్ను..!
చింతమనేని ప్రభాకర్‌రావు ఈ పేరు వినగానే మనకు ఏపీ ప్రభుత్వ విప్ కన్నా కాంట్రవర్సీ కింగ్ అన్న ట్యాగ్‌లైన్ ఠక్కున గుర్తుకు వస్తుంది. నిత్యం వివాదాలతో సావాసం చేసే చింతమనేని ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన చింతమనేని దూకుడు ముందు నియోజకవర్గంలో విపక్షాలు ఆగలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే రాజకీయంగా తన నియోజకవర్గ విషయంలో చింతమనేని కొత్త స్టెప్ తీసుకోనున్నారా ? అంటే […]
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న రజినీ పార్టీ
సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రజనీ పొలిటికల్ ఎంట్రీపై దాదాపు దశాబ్ద కాలంగా జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు గత పది రోజులుగా బాగా ఎక్కువవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అప్పటి నుంచి రజనీ రాజకీయాల్లోకి రావాలన్న ఒత్తిడి తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలోనే రజనీ చాలా రోజుల తర్వాత తన అభిమానులతో భేటీ కావడం కూడా ఆయన […]