వైసీపీ అనుకూల వ‌ర్గానికి టీడీపీ గాలం!

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మారిపోతోందా? వైసీపీకి మ‌ద్ద‌తిస్తున్న కొన్ని వ‌ర్గాలు ఇప్పుడు ఆ పార్టీకి హ్యాండివ్వాల‌ని డిసైడ్ అయ్యాయా? అదే స‌మ‌యంలో అధికార టీడీపీ పంచ‌న చేరాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ప్ర‌స్తుతం ద‌ళిత వ‌ర్గాల ఓటు బ్యాంకు ఏ పార్టీకైనా ఇంపార్టెంట్‌గా మారింది. దీంతో వీరిని మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌తి పార్టీ ప్ర‌య‌త్నిస్తూనే ఉంటుంది. ఇక‌, వైసీపీకి ఈ విష‌యంలో క‌లిసొచ్చిన అంశం ఏంటంటే.. కోర కుండానే నిన్న మొన్న‌టి వ‌ర‌కు […]

” రారండోయ్ వేడుక చూద్దాం ” ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

అక్కినేని హీరో నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. చైతు – ర‌కుల్‌ప్రీత్‌సింగ్ జంట‌గా సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేం కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు చైతు కెరీర్‌లోనే ఫ‌స్ట్ డే బెస్ట్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఈ సినిమా ఏపీ+తెలంగాణ‌లో ఫ‌స్ట్ డే రూ 3.40 కోట్ల షేర్ రాబ‌ట్టింది. నాగ‌చైత‌న్య సినిమాల‌కు తొలి రోజు ఇంత పెద్ద షేర్ రావ‌డం ఓ రికార్డుగా చెప్పుకోవాలి. […]

ఇద్ద‌రు చంద్రుల ఏక‌ప‌క్ష‌ ధోర‌ణులు.. అల్లాడుతున్న నేత‌లు, అధికారులు

ఏపీ, తెలంగాణ సీఎంల ఏక‌ప‌క్ష ధోర‌ణుల‌తో ఇరు రాష్ట్రాల్లోనూ అధికారులు, నేత‌లు అల్లాడి ఆకులు మేస్తున్నార‌ట‌! థ‌ర్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండస్ట్రీ.. టెన్ ఇయర్స్ సీఎం ఎక్స్‌పీరియ‌న్స్ అని చెప్పుకొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ ఉద్య‌మ సార‌ధిగా రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన సీఎం కేసీఆర్ వ్య‌వ‌హార శైలిల‌తో ఇరు రాష్ట్రాల్లోనూ చాపకింద నీరులా అసంతృప్తి ర‌గులుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటో చూద్దాం.. తెలంగాణ‌లో కేసీఆర్ హ‌వాతో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి […]

మ‌హానాడులో లోకేశ్ భ‌జ‌న ఎక్కువైందా…

ఏపీలో అధికార టీడీపీకి మ‌హానాడు పెద్ద పండుగ లాంటిది. టీడీపీ నాయ‌కులంద‌రూ ఒకే చోట మూడు రోజుల పాటు స‌మావేశ‌మై పార్టీ విధివిధానాలు, ఇత‌ర‌త్రా అంశాల‌పై చ‌ర్చించుకుంటారు. టీడీపీ పండుగగా మ‌హానాడును పిలుస్తారు. తాజాగా ఏపీలో అధికారంలో ఉండి, తెలంగాణ‌లో అస్తిత్వం కోసం పోరాడుతోన్న టీడీపీ మ‌హానాడు రెండు రాష్ట్రాల్లోను వేర్వేరుగా నిర్వ‌హించారు. తెలంగాణ‌లో తొలి మ‌హానాడు హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే జ‌ర‌గ‌గా ఏపీలో మ‌హానాడు విశాఖ కేంద్రంగా ఈ రోజు స్టార్ట్ అవుతోంది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత […]

టీడీపీలో బాబు మాట‌కు విలువ లేదా…

ప్ర‌పంచంలో రాజ‌కీయ పార్టీల‌లో నాయ‌కుల మ‌ధ్య విబేధాలు స‌హ‌జం. అధికార పార్టీలో ఇవి మ‌రింత ఎక్కువుగా ఉంటాయి. ఆధిప‌త్యం అనే ఒకే ఒక్క అంశం నాయ‌కుల మ‌ధ్య విబేధాల‌ను తారాస్థాయికి చేర్చుతుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే తెలుగుజాతి ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాపింప‌జేసి, ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను మిగిలిన పార్టీల‌తో పోల్చ‌లేం. 36 ఏళ్ల ప్ర‌యాణంలో నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్ర‌బాబు పాల‌న వ‌ర‌కు టీడీపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు. అయితే ఈ […]

టీడీపీలో మ‌రో వికెట్ డౌన్‌… టీఆర్ఎస్‌లో టెన్ష‌న్‌

తెలంగాణ‌లో ఉనికిని చాటుకునేందుకు ముప్పుతిప్ప‌లు ప‌డుతోన్న టీడీపీకి మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌నుంది. తెలంగాణ‌లోని పాత ఆదిలాబాద్ జిల్లాలో టీడీపీలో బ‌ల‌మైన నాయ‌కుడిగా గుర్తింపు ఉన్న మాజీ ఎంపీ ర‌మేష్ రాథోడ్ ఈ నెల 29న టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ర‌మేష్ రాథోడ్ ఆదిలాబాద్ ఎంపీగా ప‌నిచేయ‌గా, ఆయ‌న భార్య సుమ‌న్ రాథోడ్ ఖ‌నాపూర్ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గ‌త ఎన్నిక‌ల్లో ర‌మేష్ రాథోడ్ ఆదిలాబాద్ ఎంపీగాను, ఆయ‌న త‌న‌యుడు రితీష్ […]

సునీల్ సినిమా బిజినెస్ చూస్తే జాలేస్తోందిగా…

టాలీవుడ్‌లో టాప్ క‌మెడియ‌న్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సునీల్‌. కెరీర్ స్టార్టింగ్‌లో సునీల్‌కు వ‌రుస హిట్లు వ‌చ్చాయి. వ‌రుస‌ హిట్లు కూడా సునీల్ సొంతం చేసుకున్నాడు. అందాల రాముడు – మ‌ర్యాద రామ‌న్న – పూల‌రంగ‌డు సినిమాల‌తో సునీల్ స్టార్ హీరోలు అసూయ చెందే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అక్క‌డి నుంచి సునీల్ కెరీర్ రివ‌ర్స్ గేర్‌లో వెన‌క్కు త‌న్నుకొచ్చింది. ప్ర‌స్తుతం సునీల్ ఒకే ఒక్క హిట్ కోసం తహతహలాడుతున్నాడు. చివ‌ర‌కు సునీల్ సినిమాకు బిజినెస్ […]

షో మ‌ధ్య‌లో స‌మంత‌కు షాక్ ఇచ్చిన చైతు

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య రెండో సినిమా ఏ మాయ చేశావే సినిమాతో స్నేహితులుగా మారిన నాగచైతన్య, సమంత చాలా యేళ్ల‌పాటు ఎవ్వ‌రికి తెలియ‌ని సీక్రెట్ ప్రేమికులిగా మారారు. ఆ త‌ర్వాత వారిద్ద‌రు ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం సినిమాల్లో కూడా జోడీక‌ట్టారు. ఎట్ట‌కేల‌కు ఊరించి ఊరించి వారి ప్రేమ‌ను రివీల్ చేశారు. స‌మంత అక్కినేని ఇంట కోడ‌లిగా త్వ‌ర‌లోనే అడుగు పెట్ట‌నుంది. ఇదిలా ఉంటే ఏ మాయ చేశావే సినిమాలో ఓ ఫేమ‌స్ డైలాగ్ ఉంది. ‘ప్రపంచంలో ఇంతమంది […]

టీడీపీతో బీజేపీ క‌టీఫ్ త‌ప్ప‌దా?! 

ప్ర‌స్తుతం ఏపీలో టీడీపీతో అధికారం పంచుకున్న బీజేపీ నేత‌లు 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ ర‌థ‌సార‌థి.. అమిత్ షా.. నిన్న ఏపీలో పెద్ద ఎత్తున స‌భ నిర్వ‌హించారు. అయితే, ఇక్క‌డ ఆస‌క్తి క‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. టీడీపీతో పొత్తు వద్దంటూ ప‌లువురు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు షా స‌భ‌లో, బ‌య‌టా కూడా ప్ల‌కార్డులు ప‌ట్టుకుని నినాదాలు చేశారు. టీడీపీని వ‌దిలేద్దాం అని షాకు చెప్ప‌క‌నే చెప్పారు. విజయవాడలో గురువారం కార్యక్రమం ప్రారంభమైన […]