కౌంట‌ర్ల వ‌ర్మ‌కే అకున్ అదిరిపోయే కౌంట‌ర్‌

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏ విష‌యంలో అయినా, ఎవ్వ‌రిని వ‌ద‌లకుండా కౌంట‌ర్లు ఇవ్వ‌డంలో దిట్ట‌. నాగ‌బాబు, స‌న్నీలియోన్‌, ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఇలా చెప్పుకుంటూ పోతే వ‌ర్మ ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డు. తాజాగా టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న డ్ర‌గ్స్ ఇష్యూలో సిట్ అధికారులు ప‌లువురు ప్ర‌ముఖుల‌ను విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక వ‌ర్మ శిష్యుడు అయిన పూరీ జ‌గ‌న్నాథ్ గ్యాంగ్‌ను సిట్ అధికారులు ప్ర‌ధానంగా టార్గెట్ చేయ‌డంతో వ‌ర్మ కాస్త నొచ్చుకుని ఉన్న‌ట్లున్నాడు. పూరీ, సుబ్బ‌రాజును విచారించిన‌ట్టుగా 12 […]

వెంకయ్యపై కుట్ర.. వెనుక ఎన్ని చేతులో!

అవును! ఇప్పుడు దాదాపు అంద‌రూ ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు! ఏపీ తెలంగాణ‌ల్లో అత్యంత సీనియ‌ర్ బీజేపీ నేత వెంక‌య్య‌నాయుడు. అలాంటి నేత‌ను ఇప్పుడు ఉన్న ప‌ళాన ఎలాంటి రాజ‌కీయ ప్రాధ‌న్యం లేని కేవ‌లం రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌వి అయిన ఉప‌రాష్ట్ర‌ప‌తికి ప‌రిమితం చేయ‌డం? రాజ‌కీయాల‌పై క‌నీసం మాట మాత్ర‌మైనా మాట్లాడే అవ‌కాశం లేకుండా చేయ‌డం? వ‌ంటి ప‌రిణామాలు నిజంగా వెంక‌య్య వెనుక ఏదో జ‌రిగిన అనుమానాల‌కు తావిస్తున్నాయి. మైకు ప‌ట్టుకుంటే అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌డ‌మే కాదు, త‌న‌కే ప్ర‌త్యేక‌మైన […]

కాజల్ మేనేజర్ అరెస్ట్..రాశీఖ‌న్నా, లావ‌ణ్య‌కు లింకేంటి?

టాలీవుడ్ డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో రోజు రోజుకి కొత్త వ్యక్తుల పేర్లు బయటికొస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, కెమెరామ్యాన్‌ శ్యామ్‌ కే నాయుడు, నటులు సుబ్బరాజు, తరుణ్‌ సిట్‌ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరో టాలీవుడ్‌ హీరో నవదీప్ సోమవారం సిట్‌ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక చార్మి, ర‌వితేజ, మ‌మైత్ ఖాన్‌లు కూడా వ‌రుస‌గా విచార‌ణ‌కు రానున్నారు. ఈ విచార‌ణ‌ల్లోనే షాకింగ్ విష‌యాలు వెల్ల‌డి అవుతుంటే ఇప్పుడు మ‌రో కొత్త సంచ‌ల‌నం జ‌రిగింది. […]

కేసీఆర్‌కి ఝ‌ల‌క్‌..టీఆర్ఎస్‌కి తొలి దెబ్బ!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో? ఎవ‌రు ఎప్పుడు ఎలా మార‌తారో? ఎప్పుడు ఎవ‌రితో ఎలాంటి అనుబంధం ఏర్ప‌డుతుందో? ఎప్పుడు ఎవ‌రు ఎవ‌రితో అనుబంధాన్ని క‌ట్ చేసుకుంటారో? చెప్ప‌డం అంత వీజీకాదు!! కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్న నేత‌లు ఆ త‌ర్వాత క‌త్తులు దూసుకున్న ప‌రిస్థితులు మ‌న తెలుగు నాట కొత్త‌కాదు. అదేస‌మ‌యంలో క‌త్తులు నూరుకుని.. ఆన‌క అవ‌స‌రార్ధం కౌగిలింత‌ల‌కు సిద్ధ‌మైన నేత‌లూ మ‌న‌కు తెలుసు. ఇప్పుడు ఇదే జాబితాలో చేర‌నున్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ధ‌ర్మపురి శ్రీనివాస్ ఉర‌ఫ్ […]

జనసేనలోకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బద్ద శత్రువు!

కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ స్టైలే వేరు. ఆయ‌న ముక్కుసూటిత‌నంతో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్న‌ప్పుడు ఏపీ, తెలంగాణ‌లో ఆయ‌న‌కు ఎదురు చెప్పేందుకే చాలామంది నాయ‌కులు భ‌య‌ప‌డేవారు. అలాంటిది హ‌ర్ష‌కుమార్ వైఎస్‌తో తీవ్రంగా విబేధించారు. 2009 ఎన్నిక‌ల్లో హ‌ర్ష‌కుమార్‌కు టిక్కెట్ రాకుండా ఉండేందుకు వైఎస్ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నాలు చేసినా హ‌ర్ష‌కుమార్ సోనియాగాంధీ ద‌గ్గ‌రే చ‌క్రం తిప్పుకుని సీటు ద‌క్కించుకున్నారు. ఆంధ్రా యూనివ‌ర్సిటీ రాజ‌కీయాల్లో యూత్ కాంగ్రెస్ నేత‌గా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న […]

ర‌వితేజ‌ను ప్రెజ‌ర్ పెడుతోన్న నాగార్జున‌..!

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కు ఇటీవ‌ల వ‌రుస ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఓ వైపు డ్ర‌గ్స్ ఇష్యూలో ఆయ‌న పేరు బ‌య‌ట‌కు రావ‌డం, త‌మ్ముడు భ‌ర‌త్ మృతిచెందాక అత‌డి అంత్య‌క్రియ‌ల‌కు సైతం ర‌వితేజ హాజ‌రు కాక‌పోవ‌డంతో ఆయ‌న‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక ఎప్పుడో 2015 ద‌స‌రాకు వ‌చ్చిన బెంగాల్ టైగ‌ర్ సినిమా త‌ర్వాత ర‌వితేజ న‌టించిన ఏ సినిమా థియేట‌ర్ల‌లోకి రాలేదు. ర‌వితేజ మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక ర‌వితేజ న‌టిస్తోన్న తాజా చిత్రం […]

బాబుకు షాక్‌: టీడీపీ ఎమ్మెల్సీకి జ‌గ‌న్ ఎమ్మెల్యే సీటు ఆఫ‌ర్‌

ఏపీలో క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక ట్విస్టుల‌తో ర‌స‌వత్త‌రంగా మారుతోంది. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన భూమా నాగిరెడ్డి టీడీపీలో చేర‌డం, త‌ర్వాత హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో ఉప ఎన్నిక జ‌రుగుతోంది. ఆయ‌న మృతి చెంది సెప్టెంబ‌ర్ 12వ తేదీ నాటికి ఆరు నెల‌లు పూర్త‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ లోగానే ఇక్క‌డ ఉప ఎన్నిక నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఎన్నిక‌ల సంఘం నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం నాలుగైదు రోజుల్లోనే నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ […]

ఎన్టీఆర్ స‌మ‌స‌మాజ్ పార్టీ… పోటీ ఎక్క‌డో తెలుసా…!

ప్ర‌స్తుతం తెలుగులో ఎక్క‌డ చూసినా, ఎవ‌రి నోట విన్నా బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. మామూలుగా బిగ్ బాస్ షోకు అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్ రావ‌డం లేదు. కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన వీకెండ్స్‌లో మాత్రం టీఆర్పీలు పేలిపోయాయి. ఇక ఇటు బిగ్ బాస్ షో హోస్టింగ్‌తో పాటు అటు త‌న తాజా సినిమా జై ల‌వ‌కుశ షూటింగ్‌లో కూడా ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. జై ల‌వ‌కుశ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ […]

ఉంగుటూరు ఎమ్మెల్యే గ‌న్నిది కొత్త రూటా..? పాత రూటా..?

ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా ప‌శ్చిమ‌గోదావ‌రి. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న వార్త‌లు ఇక్క‌డ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను టెన్ష‌న్ పెట్టిస్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాలు కొత్తగా మారితే ? తాము ఎక్క‌డ నుంచి పోటీ చేయాలి ? అన్న ప్ర‌శ్న ఇప్పుడు వీళ్ల‌కు పెద్ద సంక‌టంగా మారాయి. ఈ క్ర‌మంలోనే ఉంగుటూరు టీడీపీ ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు ? ఆయ‌న రూటు ఎలా ? ఉంటుంది ? […]