సమంత ముందుకు వచ్చిన మరో మ్యారేజ్ ప్రపోజల్.. రెండో పెళ్ళికి సిద్ధమా??

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక 2018లో అక్కినేని నాగచైతన్యని ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు ఆ తరువాత కొన్ని మనస్పర్థల కారణంగా 2021 లో విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై చాలా రోజుల వరకూ సోషల్ మీడియాలో పెద్ద వారే జరిగింది. ఇప్పుడిప్పుడే ఆ విషయం గురించి మర్చిపోతున్న సమయంలో అభిమానులు ఇప్పుడు […]

జబర్దస్త్ యాంకర్‌గా ఆఫర్ అలా వచ్చిందని చెప్పిన సౌమ్య రావు..!

  ఈటీవీ సీరియల్స్ లో కనిపించినప్పటికీ పెద్దగా పాపులర్ అవ్వని సౌమ్య రావు జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయింది. అయితే ఈ అమ్మడు జబర్దస్త్ లో ఒక్క ఎపిసోడ్‌కి రూ.80,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. జబర్దస్త్ షో వల్ల పాపులర్ అయిన సౌమ్య వేరే షోస్ లో కూడా యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ షోలో ఈమె వేసే జోకులు, పంచులు బాగుంటాయని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. జాగాయి ముద్దుగుమ్మ […]

బాలయ్య ఎన్టీఆర్‌పై కోపం పెంచుకోవడానికి అదే కారణమా..??

  నందమూరి తారక రామారావు అంటే తెలియని వారు ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంత గొప్ప స్థానంలో ఉంది అంటే దానికి కారణం రామారావుగారి కృషి, పట్టుదల అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక మూడవ తరంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వారిద్దరిలో […]

యాంకర్ సుమ చేసిన పనికి ఎన్టీఆర్‌ తీవ్ర ఆగ్రహం.. ఏం చేసిందంటే..?

కొత్త సినిమా రిలీజ్‌కి ముందు ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ పెట్టి ప్రేక్షకులకు ఆ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కామన్. ఇక చిన్న హీరోల సినిమాకి స్టార్ట్ హీరోలను పిలిచి ప్రచారం చేయించడం మరింత సర్వసాధారణం. ఆ పెద్ద హీరో ఇలా వేరే హీరోల ఈవెంట్‌కి వచ్చినప్పుడు వారి అభిమానులు కూడా వస్తుంటారు. సినిమాతో సంబంధం లేకుండా తమ ఫేవరెట్ హీరో పేరు పెద్దగా అరుస్తూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో […]

ఆ ఒక్క మాటతో ఆదిపురుష్‌పై హైప్‌ మొత్తం పెంచేసిన కృతి సనన్‌!!

  ప్రముఖ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆయన రాముడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా కోసం డార్లింగ్ అభిమానులు వేయి కళ్ల తో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ని వెండితెరపై రాముడిలా చూడాలనే కోరిక ఫ్యాన్స్‌కి రోజురోజుకీ పెరిగిపోతుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో మోహన్ సెన్సార్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ టీజర్ […]

కమర్షియల్ సినిమాలను గాలికి వదిలేసిన హీరోలు.. హిట్స్ కొట్టడం కష్టమా??

  ఒకప్పుడు సినిమా అంటే ఒక ప్రేమ కథ దాంట్లో ఫైటింగ్స్, హీరో హీరోయిన్ల రొమాన్స్, ఒక నాలుగు పాటలు ఉండేవి. కానీ ప్రేక్షకులకు ఇప్పుడు ఆ రొటీన్ కథలు నచ్చడం లేదు. దాంతో దర్శకులు కూడా కాస్త కొత్త కథలను తీయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ పాత రోటీన్ కమర్శియల్ సినిమాలు విడుదల అయినా కూడా ప్రేక్షకులకు దానిని పెద్దగా పట్టించుకోడం లేదు. అందుకే ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ సినిమాలలో చాలా మార్పు […]

నటి దివ్యవాణికి ఎంత ఆస్తి ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!

దివ్యవాణి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ సూపర్ హిట్ ఫిలిం ‘పెళ్లి పుస్తకం’తో సహా చాలా హిట్ సినిమాల్లో నటించింది. పెళ్లి పుస్తకం మూవీలోని ‘శ్రీరస్తు.. శుభమస్తు… శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం’ పాట ఎవర్ గ్రీన్ హిట్ అయింది. ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాట ద్వారా దివ్యవాణి అందరికీ గుర్తిండి పోయేంత గుర్తింపు తెచ్చుకుంది. ఇక దివ్యవాణి ఇప్పటివరకు 40 సినిమాలకు పైగా నటించింది. […]

ఫస్ట్ వీక్‌లో బీభత్సమైన కలెక్షన్లను రాబట్టిన మూవీస్ ఇవే…!!

  ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా పాన్ ఇండియా హంగామా నడుస్తుంది. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలో నటించడం ద్వారా అన్ని భాషా ప్రేక్షకులకు మెప్పించే అవకాశం ఉంటుంది. అలాగే వారి మార్కెట్ కూడా పెరుగుతుంది. పాన్ ఇండియా సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువ. నిజానికి స్టార్ట్ హీరోల సినిమాలు రెండు మూడు […]

టాక్ షోలలో సెలబ్రిటీలకు ఎంత డబ్బు ఇస్తారో తెలిస్తే అవాక్కవుతారు!

ఒకప్పుడు సెలబ్రిటీల టాక్ షోలు సూపర్ హిట్స్ అయ్యేవి. ఆ తర్వాత వీటికి ఆదరణ కాస్త తగ్గింది. కాగా మళ్లీ ఇప్పుడు ఈ షోలకు పాపులారిటీ పెరిగిపోయింది. సమంత, బాలకృష్ణ, రానా లాంటి టాప్ యాక్టర్స్ ఈ షోలను నిర్వహించడం వల్ల వీటికి బాగా హైప్‌ పెరిగిపోతుంది. ఇక బుల్లితెర అనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో సెలబ్రిటీల టాక్ షోలను జోరుగా జరుగుతున్నాయి. దీనివల్ల ఒక సెలబ్రిటీ గురించి పూర్తిగా తెలుసుకోవడం అభిమానులకు సులభమవుతోంది. […]