కంచుకోటలపై పట్టు తప్పుతున్న ‘ఫ్యాన్’..సైకిల్ జోరు!

రాయలసీమ అంటే వైసీపీ కంచుకోట…అలాగే కోస్తా చివరిలో..రాయలసీమకు దగ్గరలో ఉండే ప్రకాశం, నెల్లూరు జిల్లాలు సైతం వైసీపీకి పట్టున్న జిల్లాలు గత రెండు ఎన్నికల్లో ఈ జిల్లాల్లో వైసీపీ హవానే నడుస్తోంది. సీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం..ఈ ఉమ్మడి జిల్లాలని తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ జిల్లాలుగా చేసి ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారు. తూర్పు రాయలసీమ అంటే ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాలు…అటు పశ్చిమ రాయలసీమ అంటే కడప-కర్నూలు-అనంతపురం జిల్లాలు. 2014 ఎన్నికల్లో రెండు చోట్ల వైసీపీ […]

ఎమ్మెల్సీ పోరు..టీడీపీ హవా..ఆ సీటులో టఫ్ ఫైట్!

ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంతకాలం ఏ ఎన్నికలైన వైసీపీదే గెలుపు అనే పరిస్తితి..పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్,..ఉపఎన్నికలు ఇలా ఏ ఎన్నికలైన గెలుపు వైసీపీదే. ఆ ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలిచిందో తెలిసిందే. అధికార బలాన్ని, ప్రలోభాలు, వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు పోతాయనే బెదిరింపులు..సరే ఏది ఎలా జరిగినా చివరికి గెలుపు వైసీపీదే. ఇక స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో […]

ధర్మానని టచ్ చేయలేకపోతున్న టీడీపీ..మళ్ళీ దెబ్బే!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. దశాబ్దాల నుంచి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అటు ధర్మాన ప్రసాదరావు, ఇటు ధర్మాన కృష్ణదాస్ దీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ అనేక విజయాలని సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో కూడా ఇటు ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి గెలవగా, అటు కృష్ణదాస్ నరసన్నపేట నుంచి గెలిచారు. ఇక మొదట విడతలో కృష్ణదాస్ మంత్రిగా చేయగా, రెండో విడతలో ప్రసాదరావు మంత్రిగా చేస్తున్నారు. అయితే […]

 జనసేనతోనే సిటీ సీట్లలో టీడీపీకి ప్లస్..వైసీపీకి చెక్!

టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకి షాక్ తప్పదని చెప్పవచ్చు..కానీ రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తే మాత్రం వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో అదే జరిగింది. ఇటీవల వచ్చిన సర్వేల్లో కూడా అదే తేలింది. కాస్త టి‌డి‌పికి లీడ్ ఉన్నా సరే..జనసేన వల్ల టి‌డి‌పికి నష్టం జరగడం ఖాయమని తేలింది. అదే సమయంలో వైసీపీకి కొన్ని సీట్లలో బెనిఫిట్ ఉంది. ఇక రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే చాలా సీట్లలో ఫలితాలు తారుమారు అయ్యే ఛాన్స్ […]

పొత్తులో ఎత్తులు..సీట్ల లెక్కపై ట్విస్ట్‌లు!

టీడీపీ-జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. పవన్ ఏమో పొత్తు ఉందనే చెప్పినట్లు కనిపిస్తున్నారు గాని.. ఉందని గట్టిగా చెప్పలేని పరిస్తితి. ఇటు టీడీపీ ఏమో పొత్తులపై సరైన సమయంలో స్పందిస్తామని అంటుంది. దీంతో పొత్తు పై పూర్తి క్లారిటీ రావడం లేదు. కానీ పొత్తు దాదాపు ఉండేలా ఉంది. అదే సమయంలో సీట్లపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అవి ఎవరు సృస్తిస్తున్నారో గాని..ఎవరు లెక్కలు వారు చెబుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం […]

వైసీపీ ఫార్ములాతో కోటంరెడ్డి..తమ్ముడుకు టీడీపీ కండువా!

నెల్లూరు రూరల్ లో తొలిసారి టీడీపీకి పట్టు దొరకనుందా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎఫెక్ట్ తో రూరల్ లో వైసీపీకి చెక్ పడనుందా? అంటే ప్రస్తుతం పరిస్తితులని చూస్తే అదే జరిగేలా ఉంది. గత రెండు ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి విజయాలు అందుకుంటూ వచ్చారు. వైసీపీ నుంచి ఆయన సత్తా చాటారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కోటంరెడ్డి మంత్రి పదవి ఆశించారు..అది దక్కలేదు. ఇక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు రావడం లేదు. […]

ఎమ్మెల్సీ పోరు: ఆధిక్యంలో టీడీపీ..వైసీపీకి షాక్ తప్పదా?

ఏపీలో ఎమ్మెల్సీ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. ఇటీవల స్థానిక సంస్థల కోటాలో  నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు, మూడు పట్టభద్రుల స్థానాలకు, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలని వైసీపీ కైవసం చేసుకుంది. అయినా ప్రతి జిల్లాలో స్థానిక అభ్యర్ధులు వైసీపీకి 90 శాతం వరకు ఉన్నారు. దీంతో సులువుగా ఆ స్థానాలని కైవసం చేసుకుంది. టి‌డి‌పి కూడా పోటీకి నిలవలేదు. ఇండిపెండెంట్లు మాత్రమే బరిలో నిలిచారు. […]

టీడీపీతో సీపీఐ కూడా రెడీ..ఫిక్స్ చేసేశారు!

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తులో పోటీ చేస్తుందో ఇప్పుడుప్పుడే క్లారిటీ వస్తుంది. చాలా రోజుల నుంచి టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందని ప్రచారం వస్తూనే ఉంది. ఈ పొత్తు ఉంటే తమకు నష్టమని తెలిసిన వైసీపీ..పొత్తుని ఏదొక విధంగా చెడగొట్టడానికే చూస్తుంది. కానీ టి‌డి‌పి-జనసేన మాత్రం పొత్తు దిశగానే వెళుతున్నాయి. తాజాగా పవన్ సైతం పొత్తుపై క్లారిటీ ఇచ్చేశారు. కలిసి పనిచేద్దామంటే బి‌జే‌పి ముందుకు రాలేదని, బి‌జే‌పితో కలిసి బలపడి ఉంటే టి‌డి‌పి అవసరం వచ్చేది […]

మంత్రులపై జగన్ సీరియస్..వారిపై వేటు తప్పదా?

మరొకసారి సి‌ఎం జగన్ మంత్రులపై సీరియస్ అయ్యారు. తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని లేదంటే వేటు తప్పదని హెచ్చరించారు. తాజాగా బడ్జెట్ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. గవర్నర్ స్పీచ్ అనంతరం జగన్..కేబినెట్ మీటింగ్ పెట్టారు. ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లుల్ని ఆమోదించిన సీఎం జగన్.. అనంతరం మంత్రులతో మాట్లాడారు. ఇందులో ఆయన పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. అలాగే వారిని తమ పనితీరు మార్చుకోకపోతే ఉద్వాసన తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా […]