గత ఎన్నికల్లో పూర్తిగా జగన్ గాలిలో సైతం…భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో వెలగపూడి రామకృష్ణబాబు కూడా ఒకరు. చంద్రబాబు, ఆదిరెడ్డి భవాని..ఆ తర్వాత మంచి మెజారిటీ వచ్చింది వెలగపూడికే..దాదాపు 26 వేల ఓట్ల మెజారిటీతో వెలగపూడి..విశాఖ ఈస్ట్ నుంచి 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అంతకముందు 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలా మూడుసార్లు గెలిచిన వెలగపూడికి చెక్ పెట్టాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖలో బలంగా ఉన్న […]
Author: Krishna
రిస్క్‌లో కరణం వారసుడు..చీరాల డౌటే..!
ఏపీ రాజకీయాల్లో కరణం బలరాం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. చంద్రబాబు సమకాలికుడుగా పనిచేస్తూ వచ్చిన కరణం..అనూహ్యంగా బాబుకు దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచి..వైసీపీలోకి జంప్ కొట్టారు. సరే అధికార పార్టీలో ఉన్నారు..అంతా బాగానే ఉందని అనుకోవచ్చు. మిగతా విషయాల్లో బాగానే ఉందేమో గాని..రాజకీయంగా మాత్రం కరణంకు కాస్త ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతానికి చీరాల ఎమ్మెల్యేగా కరణం ఉన్నారు…ఆయన వారసుడు చీరాల ఇంచార్జ్‌గా ఉన్నారు. మరి ఇంకేంటి నెక్స్ట్ చీరాల సీటు కరణం […]
తారక్‌ని తగులుకున్న తమ్ముళ్ళు..!
అనూహ్యంగా జగన్ ప్రభుత్వం…ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మార్చి వైఎస్సార్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. రాత్రికి రాత్రే పేరు మార్చేసి..కేబినెట్ ఆమోదం తీసుకుని, అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయించుకున్నారు. దాదాపు 25 ఏళ్లపై నుంచి ఉన్న ఎన్టీఆర్ పేరుని తీసేయడంపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నాయి. దీనిపై చంద్రబాబు గట్టిగానే పోరాడుతున్నారు. అసలు ఎన్టీఆర్ పెట్టిన యూనివర్సిటీకు వైఎస్సార్‌తో సంబంధం ఏంటి అని ఫైర్ అవుతున్నారు. జగన్ ఏమో వైఎస్సార్ డాక్టర్ […]
ఎంపీగానే బాలయ్య చిన్నల్లుడు..!
గత కొన్ని రోజులుగా బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ సీటు విషయంలో అనేక రకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కంటే బాగా మాట్లాడగల భరత్‌ని రాజకీయంగా ఎదగనివ్వకూడదని చంద్రబాబు, లోకేష్ చూస్తున్నారని, అందుకే నెక్స్ట్ ఎన్నికల్లో భరత్‌కు సీటు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారని..పొత్తు ఉంటే విశాఖ ఎంపీ సీటు జనసేనకు ఇవ్వాలని లేని పక్షంలో బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్‌కు విశాఖ ఎంపీ సీటు ఇవ్వాలని చూస్తున్నారని వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున […]
పవన్ గ్రాఫ్ పెంచుతున్న కేవీపీ.!
రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవీపీ రామచంద్రరావు గురించి పెద్దగా పరిచయం చేయనక్కరలేదు. వైఎస్సార్ సన్నిహితుడుగా మెలిగిన కేవీపీ..గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషించారు. ఒకానొక సమయంలో వైఎస్సార్ ఆత్మ కేవీపీ అనే విధంగా రాజకీయం నడిచింది. అయితే వైఎస్సార్ మరణం తర్వాత కేవీపీ..రాజకీయం కాంగ్రెస్‌లోనే కొనసాగుతుంది. జగన్ వేరే పార్టీ పెట్టినా సరే…అటువైపుకు కేవీపీ వెళ్లలేదు. మరి పరోక్షంగా ఏమైనా సహకారం అందించారేమో గాని..ప్రత్యక్షంగా జగన్ వైపు చూడటం లేదు. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు..రెండు రాష్ట్రాల్లో […]
బాబు ‘బీసీ’ మంత్రం..కలిసొస్తుందా?
బీసీలు అంటే టీడీపీ…టీడీపీ అంటే బీసీలు.. అసలు టీడీపీని, బీసీలని వేరుగా చూడని పరిస్తితి. టీడీపీ ఆవిర్భావం నుంచి..ఆ పార్టీకి బీసీలు అండగా ఉంటూ వస్తున్నారు. అలాగే ఎన్టీఆర్, చంద్రబాబు సైతం ఎప్పటికప్పుడు బీసీలకు పెద్ద పీఠ వేస్తూ వచ్చారు. పార్టీ పదవుల్లో గాని..ప్రభుత్వ పదవుల్లో గాని బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే బీసీలు..టీడీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకుగా ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో బీసీలే రివర్స్ అయ్యారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడకక్కడ కమ్మ […]
టార్గెట్ కుప్పం: వైసీపీలో ‘టీడీపీ’..!
కుప్పం అంటే చంద్రబాబు కంచుకోట అని అందరికీ తెలుసు..వరుసపెట్టి ఏడు పర్యాయాలు బాబు అక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. కానీ ఈ సారి మాత్రం కుప్పంలో బాబుకు ఖచ్చితంగా చెక్ పెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గానే రాజకీయం నడిపిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే మకాం వేసి..టీడీపీని దెబ్బ తీయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే కుప్పంలో పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచారు. కుప్పం మున్సిపాలిటీని […]
‘ఎన్టీఆర్’తోనే డ్యామేజ్ తప్పదా..!
ఎప్పుడు ఏదొక వివాదాస్పద నిర్ణయం తీసుకోకుండా జగన్ ప్రభుత్వం ఉండదా? ప్రశాంతంగా ఉండే పరిస్తితులని సైతం అల్లకల్లోలం జరిగేలా రాజకీయం చేస్తుందా? అంటే టీడీపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ..ప్రజల్లో కన్ఫ్యూజన్ పెంచుతున్నారని, చేసేదేమీ లేక..ఎప్పుడు ఏదొక వివాదం సృష్టించి రాజకీయం పబ్బం గడుపుతున్నారని టీడీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయంతో సహ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుని..వివాదాలు […]
తూర్పులో జనసేనతో భారీ మార్పులు..!
రాష్ట్రంలో జనసేన పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు గాని…కోస్తాలోని కొన్ని జిల్లాల్లో జనసేన ప్రభావం ఉంటుందని మొదట నుంచి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ జనసేన ప్రభావం ఉంటుందని గత ఎన్నికల్లో రుజువైంది. ఈ జిల్లాల్లో జనసేన భారీగా ఓట్లు చీల్చింది. దీని వల్ల టీడీపీకి భారీగా నష్టం, వైసీపీకి భారీగా లాభం చేకూరింది. ఈ సారి ఎన్నికల్లో కూడా జనసేన గాని విడిగా […]