బిగ్ బాస్ 7 లో ఊహించని పరిణామం… నొప్పి తట్టుకోలేక గట్టిగ అరిచిన శోభ…‌!!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. హౌస్ లో ఉండేందుకు కంటిస్టేన్స్ పవర్ అస్త్ర సాధించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా మొదటి వారం సందీప్ పవర్ అస్త్ర గెలుచుకోగా.. రెండో వారం శివాజీ గెలుచుకున్నాడు.

ఇక మూడో వారం ప్రిన్స్, శోభా శెట్టి, ప్రియాంక పోటీ పడడానికి సిద్ధమయ్యారు. బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టి ప్రిన్స్ యావర్ సైడ్ అయ్యేలా చేశాడు. దీంతో ఫైనల్ గా పోటీలో ప్రియాంక, శోభ శెట్టి పాల్గొన్నారు. ఎలా పడితే అలా కాదిలే ఎలక్ట్రిక్ ఎద్దు పై ఎక్కువ సేపు ఎవరు కూర్చుంటారు వారే ఈవారం పవర్ అస్త్ర దలుచుకుంటారు అని బిగ్ బాస్ చెప్పాడు.

దీంతో ప్రియాంక హైట్ తక్కువ కావడంతో ప్రియాంక దానిపై ఉండిపోయింది. కానీ శోభాశెట్టికి మాత్రం ఈ జర్క్లకు తట్టుకోలేకపోయింది. ఎద్దుపై నుంచి కింద పడిపోవడంతో ఆమె చేతికి గాయమైంది. దీన్ని డాక్టర్ గౌతమ్ చూస్తుండగా నొప్పిని భరించలేక గట్టి గట్టిగా అరిచింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.