విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ.. తేజ్ సక్సెస్ అయ్యారా..!!

మెగా హీరో సాయి ధరంతేజ్ చాలా సంవత్సరాల తర్వాత నటించిన చిత్రం విరూపాక్ష.. ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. తన కెరియర్ లోనే ఒక డిఫరెంట్ జోనర్ తో ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది సాయి ధరంతేజ్ . హర్రర్ త్రిల్లర్ సస్పెన్స్ ఫాంటసీ ఎలిమెంట్తో కూడిన ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి సుకుమార్ రైటింగ్స్ శ్రీ వెంకటేశ్వర సినీ పతాకం పైన నిర్మించారు.

Virupaksha Movie Review | Virupaksha Movie Trailer | Virupaksha Telugu Movie  Review | Virupaksha Movie Review and Ratings | Sai Dharam Tej, Samyuktha Virupaksha  Movie review | Virupaksha Movie | Sai Dharam Tej, Samyuktha
1980-90 లో రుద్రవరం అనే గ్రామంలో జరిగే కథ అప్పటి కొన్ని సంఘటనలను బ్రేక్ చేసుకుని కొన్ని కల్పించాలని జోడించి ఈ సినిమా కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఊర్లో వరుస మరణాలు చోటు చేసుకుంటూ మిస్టరీ డెత్ వెనుక ఎవరున్నారు ఆ ఊరిని పట్టిపీడిస్తున్న శక్తి ఏంటి అనే విషయంపై హీరో ఎలా ఎదుర్కొంటారు ఆ ఊరు ప్రజలు ఎలాంటి విముక్తిని ఇచ్చారు అనే కథ అంశంతో తెరకెక్కించారు డైరెక్టర్ కార్తీక్. మారి సినిమా హిట్టుతో మంచి కలెక్షన్లు అందుకున్న కార్తిక్ ఈసారి ఇలాంటి విభిన్నమైన జోహార్ తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

సినిమాకి చాలా వరకు పాజిటివ్ టాక్ వస్తోంది. డైరెక్టర్ కార్తీక్ ఈ సినిమాని బాగానే హ్యాండిల్ చేశారని ఆడియన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కథపరంగా చాలా ఇంట్రెస్ట్ గా ఉందని సుకుమార్ స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకు పెద్దగా ఆకట్టుకుంటుందని తెలియజేస్తున్నారు. సెకండాఫ్ లో కూడా ఇంట్రెస్టింగ్ కలిగే సన్నివేశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.మొదటి భాగంలో లవ్ స్టోరీ కాస్త బోరింగ్ గా అనిపించిన సినిమా కూడా స్లోగానే సాగుతోందని తెలుపుతున్నారు.

సెకండ్ హాఫ్ లో త్రిల్లింగ్ ఎలివేషన్స్ సస్పెన్స్ బాగానే కంటిన్యూ అవుతోందని అదే ఆడియోస్ని ఎగ్జిట్ చేస్తోందని పోస్ట్లు పెడుతున్నారు. అయితే క్లైమాక్స్ మాత్రం ఆశించని స్థాయిలో లేదని ఇంకా బెటర్ గా చేయవలసి ఉందని తెలుపుతున్నారు. ఈ చిత్రంలో సాయి ధరంతే చాలా కొత్తగా ఫ్రెష్ గా కనిపిస్తున్నారని తెలుపుతున్నారు. సంయుక్త మీనన్ కూడా మంచి పాత్ర ఆమె ఈ సినిమాకి ఈమె ప్లస్ అన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో ఈమె నటన అద్భుతంగా ఉందని క్లైమాక్స్లో కూడా ఇరగదీసిందని తెలుపుతున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా విజువల్ ,VFX తో టెక్నికల్ గా బాగుందని కామెంట్ చేస్తున్నారు.

https://twitter.com/ReddySuki9/status/1649217758419140611?s=20