బ్రేకింగ్: ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూత..!!

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నిన్నటి రోజున కళాతపస్వి కె విశ్వనాథ్ హఠాస్మరణం నుంచి ఇంకా కోలుకో ఒక ముందే సినీ పరిశ్రమలో మరొక విషాదం చోటు చేసుకున్నది. ఇప్పుడు తాజగా ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ ఈరోజు మధ్యాహ్నం కన్ను మూసినట్లుగా తెలుస్తోంది. చెన్నైలో తననివాసంలో ఆమె తృతీయ శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. తన గాన ప్రతిభతో గుర్తింపు పొందిన గాయని వాణి జయరామ్ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ అవార్డును కూడా ప్రకటించింది.

Popular Indian cinema and classical singer Vani Jayaram dies | South-indian  – Gulf News

ఇంతలోనే ఇమే మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ ఒకసారిగా షాక్కు గురైంది. ఇదే సమయంలో ఈమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈమె మృతి పట్ల పలువురు అభిమానులు కూడ ఇమే ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. తమిళనాడులోని వేలూరులో పుట్టిన వాణి జయరామ్ తెలుగు, తమిళ్ తో సహా పలు భాషలలో 20వేలకు పైగా పాటలు పాడడం జరిగింది. వెయ్యికి పైగా ప్లే బ్యాక్ సింగర్ గా వ్యవహరించింది. సుమారుగా 19 భాషలలో ఈమె పాటలు పాడినట్లుగా తెలుస్తోంది.

వాణి జయరామ్ 1945 నవంబర్ 30న ఈమె జన్మించింది.. తన ఎనిమిదవ సంవత్సరంలోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడి అబ్బురపరిచిన బాల మేధావిగా పేరుపొందింది. ఈమె సినీ ఇండస్ట్రీ కూడా చాలా విచిత్రంగా జరిగింది.. పెళ్లి తర్వాత ముంబైలో స్థిరపడ్డ వాణి జయరామ్ అనుకోని విధంగా సూపర్ హిట్ హిందీ మూవీ గుడ్డి ద్వారా తన సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. అయితే ఇప్పుడు ఈమె మరణ వార్త ప్రతి ఒక్కరిని కలిచీ వేస్తోంది.