కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించిన చిత్రం కాంతారా. ఈ చిత్రాన్ని తానే స్వయంగా దర్శకత్వం వహించారు. కన్నడ సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువగా అన్ని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. మొదట ఈ సినిమా కన్నడ నాట చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా చిత్రంగా పేరు సంపాదించింది. ప్రస్తుతం కన్నడ , తమిళ్, తెలుగు, హిందీ వంటి భాషలలో విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ చిత్రాన్ని చూసిన ఎంతో మంది సెలబ్రిటీలు సైతం ఈ సినిమా చూసి సూపర్ అంటు తమ ఎక్స్పీరియన్స్ సైతం షేర్ చేసుకున్నారు.
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ సినిమాని కుటుంబ సమేతంగా వీక్షించి సోషల్ మీడియా వేదికగా తన అనుభవాలను పంచుకుంది. ఇప్పుడే తమ కుటుంబంతో కలిసి కాంతారా చిత్రాన్ని చూశాను.. ఇప్పటికీ నా శరీరం ఇంకా వణుకుతూనే ఉంది.ఇది ఒక అద్భుతమైన అనుభవం సాంప్రదాయం జానపద కథలు దేశీయ సమస్యల సమ్మేళనమే ఈ చిత్రం. ఇందులో హీరోకి ముందుగా హ్యాండ్సప్ చెప్పాలి. రచన దర్శకత్వం నటన అన్ని ఇలా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని రిషబ్ శెట్టి ని పొగిడేస్తోంది.
సినిమా అంటే ఇది ఇలాంటి చిత్రాన్ని తాను ఎన్నడు చూడలేదని థియేటర్లో ప్రేక్షకులు చెబుతున్నారని.. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన టీంకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరొక వారం రోజుల పాటు నేను ఈ అనుభూతిలోనే ఉంటానని తెలియజేస్తోంది. అలాగే మరొక పోస్ట్ చేస్తూ వచ్చే ఏడాది కాంతారా చిత్రం ఆస్కార్ కు నామినేట్ అయ్యే అవకాశం పక్కా అని భవిష్యత్తులో ఇలాంటి గొప్ప చిత్రాలు రావచ్చు కానీ మన దేశ సంస్కృతిని అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసి ఇలాంటి చిత్రాలకు ఆస్కార్ నామినేట్ చేయవలసిందే అని తెలియజేసస్తోంది. ప్రస్తుతం ఇమే చేసిన పోస్ట్ కాస్త వైరల్ గా మారుతోంది.
Kangana Ranaut is all praise for #Kantara after watching the film in theaters.#KanganaRanaut #KantaraMovie pic.twitter.com/Qya9Ghizb3
— Kangana Ranaut Daily (@KanganaDaily) October 20, 2022