బుల్లితెర సూపర్ హిట్ సీరియల్ `కార్తీకదీపం` అంటే తెలియని వారు ఉండరు. రోజురోజుకు ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ సీరియర్ బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ సీరియల్‌తో వంటలక్క, డాక్టర్ బాబులు ఎంత ఫేమస్ అయ్యారో.. పిల్లలుగా నటిస్తున్న సౌర్య, హిమలు కూడా అంతే ఫేమస్ అయ్యారు.
సౌర్య(క్రితిక) క్యారెక్టర్‌కి తగ్గట్టుగానే బయట కూడా రౌడీనే. ఇక హిమ(సహృద ఫ్రూటీ) విషయానికి వస్తే ఈమె మల్టీటాలెంటెడ్ అమ్మాయి. ఈమె ఎప్పటికప్పుడు డాన్స్‌లతో ఇరగదీస్తుంటుంది. అయితే కార్తీకదీపం సీరియల్లో తమ తమ పాత్రల ద్వారా ప్రేక్షకులకు బాగా చేరువైన సౌర్య, హిమలు రోజుకు ఎంత సంపాదిస్తారో తెలుసా..?
వీరిద్దరూ కార్తీకదీపం సీరియల్ నుంచి కేవలం ఒక్క రోజుకే రూ.7 వేలు అందుకుంటారట. ఇక నెలలో 15 రోజుల పాటు షూటింగ్ ఉంటే రూ.లక్షకు పైగా వీరి సంపాదన ఉంటుంది. ఏదేమైనా చిన్న వయసు నుంచి ఈ చిచ్చర పిడుగులు ఇంత సంపాదిస్తుండడం నిజంగా విశేషమే అని చెప్పాలి.