టోక్యో ఒలింపిక్స్: పతక వేటలో పీవీ సింధు దూకుడు..!

భారత స్టార్ షెట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు ప‌త‌క వేట‌లో ఏ మాత్రం వెనుక‌డుగు వేయడం లేదు. గురువారం ఉదయం డెన్మార్క్‌కు చెందిన 12వ ర్యాంక్ క్రీడాకారిణి బ్లింక్ ఫెల్ట్‌పై 21-15, 21-13 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి రెండు మ్యాచుల మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా సింధు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చింది.

నేటి మ్యాట్ మొత్తం న‌ల‌బై నిమిషాల కొన‌సాగ‌గా.. ప్రత్యర్థి ఫెల్ట్ ఏ దశలోనూ ఆమెను నిలువరించలేకపోయింది. ఇక నేటి మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసిన‌ సింధు.. క్వార్టర్‌ ఫైనల్స్ కు చేరుకుని పతకానికి రెండడుగుల దూరంలో నిలిచింది.

కాగా, గురువారం మధ్యాహ్నం పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నది. ఇక మొత్తానికి పీవీ సింధు దూకుడు చూస్తుంటే.. భ‌ర‌త్‌కు మ‌రో పతకం చేరడం ఖాయంగా కనిపిస్తోంది.