వెంకటేష్ – ఐశ్వర్యరాయ్ కాంబోలో ఆ సూపర్ హిట్ మూవీ మిస్ అయిందని తెలుసా.. కారణం ఇదే..

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు 40 కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు నటించింది. అయితే ఈమె టాలీవుడ్ లో ఏ సినిమాలో నటించకపోయినా తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. గతంలో ఐశ్వర్యన్ని టాలీవుడ్ కి పరిచయం చేయాలని ఎంతోమంది స్టార్ట్ డైరెక్టర్స్ ప్రయత్నాలు చేసినా అవి సక్సెస్ కాలేదు. అదే టైంలో విక్టరీ వెంకటేష్ సినిమాతో ఐశ్వర్యారాయ్‌ని టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం చేయాలని మేకర్స్‌ భావించారు.

అయితే అది కూడా వర్కౌట్ కాలేదు. వెంకటేష్, ఐశ్వర్య కాంబోలో ఎవరు ఊహించని సూపర్ హిట్ సినిమా చేజారిపోయింది. ఇంతకీ ఆ మూవీ ఏంటి అనుకుంటున్నారా.. ప్రేమించుకుందాం రా. జ‌యంత్ సి.ప‌రాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా.. వెంకటేష్ అన్న సురేష్ బాబు సొంత బ్యానర్ పై నిర్మించారు. అంజ‌లా జవేరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శ్రీహరి, జయప్రకాశ్ రెడ్డి, రంగనాథ్, అన్నపూర్ణ లాంటి వారు కీలకపాత్రలో మెప్పించారు.

1997లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ హిట్‌గా నిలిచి రికార్డులు సృష్టించింది. మ్యూజికల్ గాను సూపర్ హిట్ అయినా ఈ మూవీలో.. మొదట ఐశ్వర్య రాయ్‌ను హీరోయిన్గా తీసుకోవాలని భావించారట. డైరెక్టర్ జయంత్ సి. పరాంజి తన స్నేహితుల ద్వారా ఐశ్వర్యతో ఏర్పడిన పరిచయంతోనే ఐశ్వర్యతో కలిసి ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాల‌ని ఆయన భావించినట్లు తెలుస్తుంది.

అయితే అప్పటికే ఐశ్వర్యరాయ్ రెండు ఫ్లాపులతో ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. దాంతో వెంకీ సినిమాలో నటిస్తే ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందేమో అన్న భయంతో నిర్మాత సురేష్ బాబు.. ఐశ్వర్యారాయ్ హీరోయిన్గా వద్దని చెప్పేసారట. ఇక అప్పుడు ఫైనల్ గా అంజలి జవేరిని.. వెంకీకి జంటగా సెలెక్ట్ చేశారు. సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులు ఆకట్టుకుని భారీ వసూళ్లను కల్లగొట్టింది. వెంకటేష్ – ఐశ్వర్యరాయ్ కాంబోలో సూపర్ హిట్ సినిమాని టాలీవుడ్ ప్రేక్షకులు మిస్ అయిపోయారు.