తేజ ” హనుమాన్ ” ఫస్ట్ డే కలెక్షన్స్.. మనోడు ఎంత రాబట్టాడు అంటే..!

యంగ్ హీరో తేజ సజ్జ తాజాగా నటించిన మూవీ ” హనుమాన్ “. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా నిన్న విడుదలై భారీ హైప్స్ ని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో తేజ నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు.

అలాగే హనుమాన్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక తాజాగా హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా రూ. 21 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇక రెండో రోజుకు థియేటర్ల సంఖ్య పెంచడంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరి రానున్న కాలంలో ఈ సినిమా ఎంతటి రికార్డుని నెలకొల్పుతుందో చూడాలి మరి. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హనుమాన్ టీం తమకి లభించిన ప్రతి టికెట్ నుంచి ఐదు రూపాయలు అయోధ్యకి పంపుతామని మాటించారు. ఇక నేడు ఆ మాటని కూడా తూచా తప్పకుండా పాటించి అయోధ్యకు కొంత డబ్బును పంపించారు ఈ మూవీ టీం. ఇక దీంతో ఈ సినిమా పై మరిన్ని గుడ్వైప్స్ క‌లిగాయి.