వింటర్ సీజన్‌లో సూపర్ ఫుడ్ గా మొక్క‌జొన్న‌.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

వింటర్ సీజన్‌లో బజ్జీలు ఎంత ఫేమసో.. శీతాకాలంలో మొక్కజొన్న కూడా అంతే ఫేమస్. ఈ మొక్కజొన్న ఇష్టపడని వారు ఉంటారంటే ఆశ్చర్యమే. టేస్ట్ కోసమో, సరదా కోసమో కానీ చాలామంది మొక్కజొన్నలు తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.. మొక్కజొన్న ఎలా తిన్న.. ఎప్పుడు తిన్న.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పీచు ఎక్కువగా ఉండే ఈ మొక్కజొన్న జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని.. అది చాలా మంచి పద్ధతి అని నిపుణులుచెబుతున్నారు. ఉడికించినా, కాల్చినా ఏ విధంగా తీసుకున్న ఈ మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట.

ఈ మొక్కజొన్న పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని.. మలబద్దక సమస్యలు నివారిస్తుందని.. సాధారణ మొక్కజొన్న.. లేదా స్వీట్ కార్న్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయని మొక్కజొన్నలు తింటే తక్షణ శక్తి వస్తుందని.. నిత్యం ఎక్సర్సైజ్ చేసేవారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఆహారంలో మొక్కజొన్న తప్పక చేర్చుకుంటారని చెబుతున్నారు. మొక్కజొన్నను అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. శరీర బరువును అదుపులో ఉంచడానికి ఇది సహకరిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండి త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఫలితంగా అదనపు క్యాలరీలను బర్న్ చేసుకోవచ్చు.

హై లెవెల్ బ్యాడ్ కొలెస్ట్రాల్, గుండెజబ్బులను తగ్గిస్తుంది. మొక్కజొన్న లేదా స్వీట్ కార్న్ లో లూటీన్, జియాక్సంతిన్‌ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఇవి వయస్సు సంబంధిత కంటి సమస్య ప్రమాదాన్ని తగ్గించి.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. విటమిన్ సి కూడా వీటిలో సమృద్ధిగా ఉంటుంది. అయితే ఈ విషయాలు చాలామందికి తెలియవు. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా కూడా మొక్కజొన్న పని చేసింది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చ‌ర్మ వృద్ధాప్య ఛాయాలను తగ్గిస్తుంది,