ఇప్ప‌టి వరకు నటించిన అన్ని సినిమాలు వ‌ర్క్ షాప్స్.. ‘ దేవర ‘ నే నా అసలు సినిమా.. జాన్వి కపూర్ సెన్సేషనల్ కామెంట్స్..

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ దేవర. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి హైప్‌ నెలకొంది. ఈ మూవీలో దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.

అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలి ఖాన్‌ నెగిటివ్ రోల్‌ను ప్లే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సినిమాలు అన్ని మంచి సక్సెస్ సాధించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. అదేవిధంగా ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బ‌స్టర్ తర్వాత వ‌స్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన జాన్వి కపూర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

దేవ‌రా సెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ వర్క్ షాప్‌ల అనిపించాయి.. ఇప్పుడే హీరోయిన్ అనే ఫీలింగ్ వస్తుంది. నా సినీ కెరీర్ దేవరాతోనే మొదలవుతుంది అన్నట్లు అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. జాన్వి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. కొరటాల అమ్మడుకి గట్టి రోల్‌నే ఇచ్చినట్లు ఉన్నాడే అంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.