” హోంబలే బ్యానర్ పేరు వెనక దాగి ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. అదే సక్సెస్ సీక్రెట్ కూడా “.. విజయ్ కిరగందూర్ సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న బ్యానర్లలో హోంబలే బ్యానర్ ఒకటి. అయితే ఈ బ్యానర్ కు సక్సెస్ సులువుగా దక్కలేదు. కర్ణాటకకు చెందిన విజయ్ కిరగందూర్, చలువే గౌడ, కార్తీక్ గౌడాలకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండడంతో 2013 వ సంవత్సరంలో ఈ బ్యానర్ ను స్థాపించడం జరిగింది.

తమ ఇలవేల్పు హోంబలమ్మ పేరును బ్యానర్ కు ఈ నిర్మాతలు పెట్టడం జరిగింది. ఇక అనంతరం వీరు స్థాపించిన సినిమాలు సక్సెస్ అవడంతో ఈ బ్యానర్ కు మంచి పేరు ప్రఖ్యాతలు దత్తాయి. ఇక తాజాగా సలార్ మూవీతో మరోసారి వీరి సత్తాని చాటుకున్నారు. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ…” మేము ఏ కథనైనా ప్రేక్షకుల కోణంలో చూస్తాము.

వారికి నచ్చే విధంగా ఉంటేనే మేము ఆ సినిమాని నిర్మిస్తాము. మా సక్సెస్ కి కారణం ఇదే. వారు ఎక్కువగా ఆదరించే సినిమాలపై మేము ఎక్కువగా ఆసక్తి చూపిస్తాము. ఇక ఈ బ్యానర్ కు మా కుల దేవత పేరు పెట్టుకోవడం కూడా మాకు కలిసి వచ్చింది ” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.