దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికేసిన టాలీవుడ్ స్టార్ హీరో…. ఏంటి భయ్యా ఇది…!

టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు మనందరికీ సుపరిచితమే. ఒకప్పుడు పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు విష్ణు. ఇక ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ను కంప్లీట్ చేసే హడావిడిలో ఉన్నాడు. ఇక ప్రస్తుతం కన్నప్ప మూవీ షూటింగ్ న్యూజిలాండ్ అడవుల్లో సర్వే గంగా కొనసాగుతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఇటీవల మంచి విష్ణు తన ఫ్యామిలీతో న్యూజిలాండ్ కు వెళ్లాడు. అక్కడ ఎంజాయ్ సైతం చేశాడు. ఇక తాజాగా మంచు విష్ణు భార్య ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. ఇక ఆ వీడియో కింద ఈమె ఇలా రాస్కొచ్చింది. ” న్యూజిలాండ్ లో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన నాకు ఇష్టమైన హైడ్రేంజ పువ్వులు కనిపించాయి.

దీంతో విష్ణు కారు ఆపి నాకోసం వాటిని కోసుకువచ్చారు. అయితే అక్కడ రూల్స్ ప్రకారం ఎక్కడ పడితే అక్కడ పూలు కొయ్యకూడదు.. కానీ మేము కోసేసాం ” అంటూ రాసుకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోని చూసిన ప్రేక్షకులు..” కోస్తే కోశావు కానీ బ్రో.. నీ భార్య షేర్ చేసిన వీడియోతో అడ్డంగా దొరికిపోయావుగా..” అంటూ కామెంట్లు చేస్తున్నారు.