అమర్ ని టార్గెట్ చేసిన స్పై ఫ్యాన్స్.. మిగతా కంటెస్టెంట్ ల పై కూడా దాడి..!

బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 రైతు బిడ్డ విన్నర్ గా… అమర్ రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. షూటింగ్ అయిన అనంతరం అమర్ తో పాటు మిగతా కంటెస్టెంట్స్ అంత వరుసగా బయటకు వస్తారని ముందే సమాచారం ఉండడంతో… అన్నపూర్ణ స్టూడియోస్ గేటు వద్దే వేలాదిమంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తరలి వచ్చారు. అమర్ ని అతని ఫ్యామిలీని తరిమి తరిమి కొట్టారు.

దాదాపు అరగంట పాటు.. కారులోనే ఉండిపోయిన అమర్ ని అతని ఫ్యామిలీని వెంటాడి దాడి చేశారు. అమర్ కార్లో ఉన్నాడని తెలుసుకున్న స్పై ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆ కారుపై దాడి చేశారు. అలాగే అమర్ చెయ్యరాని నేరం చేసినట్లుగా… అతన్ని పిచ్చి బూతులు తిడుతూ.. కారు అద్దాలను ధ్వంసం చేశారు.

ఇక ఈ కారులో ఉన్న అమర్ కి అతని భార్యకి తల్లికి కూడా గాయాలయ్యాయి. కేవలం అమర్ కారునే కాకుండా.. మిగిలిన కంటెస్టెంట్స్ కారులను సైతం పగలు కొట్టారు. అంతేకాకుండా యాంకర్ గీతు రాయల్ కారుపై కూడా దాడి చేశారు. అలాగే రోడ్డుపై వెళ్తున్న బస్సులను కూడా ధ్వంసం చేశారు. దీంతో పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకుని వారిని చదరగొట్టారు.